Tata Punch EV Sale: మొదలైన టాటా పంచ్ ఈవీ బుకింగ్స్ - ఎంత రేటు ఉండొచ్చు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Tata Punch EV: టాటా పంచ్ ఈవీ బుకింగ్స్ మనదేశంలో ప్రారంభం అయ్యాయి. రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి వాటిని బుక్ చేసుకోవచ్చు.
Tata Punch EV Launch: ఈవీ అమ్మకాల విషయంలో గత సంవత్సరం టాటా అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2024లో టాటా లాంచ్ చేయనున్న మొదటి కారు కూడా ఈవీనే. అనేక స్పై షాట్లు, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టాటా మోటార్స్ ఈ వారం భారతదేశంలో పంచ్ ఈవీని అధికారికంగా లాంచ్ చేయవచ్చు. ఇప్పుడు దాని బ్యాటరీ ప్యాక్, ఫీచర్ల గురించి కొన్ని తాజా వివరాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే కంపెనీ తన బుకింగ్‌ను కూడా ప్రారంభించింది. మీరు టాటా లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.
టాటా పంచ్ ఈవీ నాలుగు కలర్ ఆప్షన్లు, నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ చిన్న ఈవీ ఎస్‌యూవీ టాటా ఆల్ఫా ప్లాట్‌ఫారంతో జెన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని ప్రధాన అప్‌డేట్లతో ఐసీఈ నుంచి ఈవీకి రూపాంతరం చెందుతుంది. ఇది లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ, పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారును కలిగి ఉంటుంది. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానుంది.
టాటా పంచ్ ఈవీ ఫీచర్లు
పంచ్ ఈవీలో స్మార్ట్ మోడల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, స్మార్ట్ డిజిటల్ డీఆర్ఎల్, మల్టీ మోడ్ రీజన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో సహా అనేక సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. అడ్వెంచర్ మోడల్‌లో క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్, కార్నరింగ్ ఫంక్షన్, 17.78 సెంటీ మీటర్లు హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోహోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, జ్యుయల్డ్ కూడిన కంట్రోల్ నాబ్ ఉన్నాయి. ఆప్షనల్ సన్‌రూఫ్ వేరియంట్ కూడా ఉంటుంది.
ఎంపవర్డ్ మోడల్‌లో ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో ఫోల్డ్ ఓఆర్వీఎంలు, 17.78 సెంటీమీటర్ల డిజిటల్ కాక్‌పిట్, ఎస్ఓఎస్ ఫంక్షన్, 26.03 హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ టోన్ బాడీ కలర్స్, సన్‌రూఫ్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. పంచ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ లగ్జరీ మోడల్‌లో లెథెరెట్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మిర్రర్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆర్కేడ్.ఈవీ యాప్ సూట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 26 సెంటీమీటర్ల ఇమ్మర్సివ్ డిజిటల్ కాక్‌పిట్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
టాటా పంచ్ ఈవీ ధర, రేంజ్, బ్యాటరీ
టాటా పంచ్ ఈవీ కోసం ఆక్సైడ్ డ్యూయల్ టోన్, సివిక్ డ్యూయల్ టోన్, వైట్ డ్యూయల్ టోన్, గ్రే డ్యూయల్ టోన్, రెడ్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ ఈవీ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ప్రస్తుతానికి పంచ్ ఈవీ బ్యాటరీ, రేంజ్, ధరను టాటా వెల్లడించలేదు. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 13 లక్షల వరకు ఎక్స్ షోరూమ్‌గా ఉండవచ్చని అంచనా. పంచ్ ఈవీ భారత మార్కెట్లో సిట్రోయెన్ ఈసీ3తో పోటీపడుతుంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!