Tata Nexon EV Max: ఒక్కసారి చార్జింగ్ పెడితే విజయవాడ నుంచి తిరుపతి వెళ్లిపోవచ్చు - టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ వచ్చేసింది!
టాటా నెక్సాన్ మోడల్‌లో కొత్త వేరియంట్ మనదేశంలో లాంచ్ అయింది. అదే నెక్సాన్ ఈవీ. దీని రేంజ్ 437 కిలోమీటర్లుగా ఉండనుంది.
టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.17.74 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎంట్రీ లెవల్ ఎక్స్‌జెడ్+ వేరియంట్ ధర. ఇందులో టాప్ ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.19.24 లక్షలుగా ఉంది. రెగ్యులర్ నెక్సాన్ ఈవీ ధర రూ.14.79 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.
రెండు సంవత్సరాల క్రితం లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే వెర్షనే ఈ నెక్సాన్ ఈవీ మ్యాక్స్. ఇందులో ఎక్కువ కెపాసిటీ ఉన్న లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. శక్తివంతమైన మోటార్, కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
దీని డిజైన్ రెగ్యులర్ నెక్సాన్ ఈవీ తరహాలోనే ఉంది. ఇంటెన్సీ టియాల్, డేటోనా గ్రే, ప్రిస్టీన్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ కొంచెం కొత్తగా ఉండనుంది. 16 అంగుళాల అలోయ్ వీల్స్, ఈవీ మ్యాక్స్ బ్యాడ్జింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
రెగ్యులర్ ఈవీ తరహాలోనే నెక్సాన్ ఈవీ మ్యాక్స్ డిజైన్ కూడా ఉండనుంది. వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ మోడ్ రీజనరేటివ్ బ్రేకింగ్, ఎయిర్ ప్యూరిఫయర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, క్రూజ్ కంట్రోల్ కూడా ఇందులో అందించారు.
వీటితో పాటు ఏడు అంగుళాల టచ్ స్క్రీన్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు ఏకంగా 437 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని కంపెనీ అంటోంది. నెక్సాన్ ఈవీ 312 కిలోమీటర్ల రేంజ్‌తో లాంచ్ అయింది. ఇందులో 40.5 కేడబ్ల్యూహెచ్ లిథియం ఇయాన్ బ్యాటరీని అందించారు. దీంతోపాటు 3.3 కేడబ్ల్యూ చార్జర్‌ను అందించనున్నారు. వినియోగదారులు 80 కేడబ్ల్యూ ఫాస్ట్ చార్జర్‌ను కొనుగోలు చేస్తే 56 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం చార్జింగ్ ఎక్కనుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
View this post on Instagram