Tata Curvv Release Date: టాటా కర్వ్ రిలీజ్ డేట్ ఫిక్స్ - డీజిల్, EV ఒకేసారి లాంఛ్!
Tata Curvv Latest News: టాటా మోటార్స్ నుంచి వస్తున్న Curvv అనే మోడల్ ను అధికారికంగా లాంఛ్ చేయబోతున్నారు. ఈ SUV కూపే మోడల్‌ను ఆగస్టు 7న లాంఛ్ చేయనున్నట్లుగా టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
TATA Curvv on Road Price Hyderabad: టాటా మోటార్స్ తన వాహన శ్రేణిలో తర్వాత ప్రవేశపెట్టబోతున్న కర్వ్ (Tata Curvv) ఇప్పటికే ఎంతో మంది కార్ లవర్స్ దృష్టిని ఆకర్షించింది. కొత్తగా కారు కొనాలనుకునే ఆలోచన ఉన్నవారు ఈ కారు కోసం వేయి కళ్లతో ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. కనీసం లాంచ్ కూడా అవ్వని టాటా కర్వ్ పై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు భారత్‌లో టాటా మోటార్స్ కర్వ్‌ను అధికారికంగా లాంఛ్ చేసే టైం వచ్చింది. ఆగస్టు 7వ తేదీన కర్వ్‌ను ప్రదర్శించనున్నట్లుగా టాటా మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
అయితే, ఒకేసారి డీజిల్, EV రెండూ దేశంలో లాంచ్ అవుతాయని అంటున్నారు. అదే సమయంలో వాటి ధరలను కూడా కంపెనీ ప్రకటిస్తుందని చెబుతున్నారు. టాటా కర్వ్ దాని డీజిల్ వేరియంట్ ను గత ఫిబ్రవరిలో జరిగిన భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రొడక్షన్ రెడీ అవతార్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు EV వెర్షన్‌ను కూడా డీజిల్ వేరియంట్ తో కలిసి లాంచ్ చేస్తారని అంటున్నారు. ICE, EV వెర్షన్స్ రెండూ కంపెనీ లాంచ్ చేస్తుందని అంటున్నారు. ICE వెర్షన్ 1.5l డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వస్తుందని మర్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పెద్ద బ్యాటరీ!
ఇంకా 1.2l టర్బో పెట్రోల్‌తో కూడిన పెట్రోల్ వెర్షన్ తర్వాత అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. EV వెర్షన్ డీజిల్‌తో పాటు కారు లాంచింగ్ నుంచే అందుబాటులో ఉండనుందని అంటున్నారు. ఇంకా ఈ EV వెర్షన్ నెక్సాన్ EV కంటే పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది Acti.ev ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుందని సమాచారం. అంటే ఇది ఒక ఫ్రంక్ (కారు బానెట్ లో స్టోరేజ్ స్పేస్) కలిగి ఉంటుందని అంటున్నారు.
నెక్సాన్ కంటే పొడవు
4308 mm పొడవుతో Curvv పొడవు పరంగా నెక్సాన్ కంటే ఎక్కువే ఉండనుంది. కానీ, టాటా హారియర్ కంటే తక్కువ ఉంటుంది. Curvv ను మన దేశంలో మొదటి కాంపాక్ట్ SUV కూపేగా భవిస్తున్నారు. ఇందులో బూట్ స్పేస్ కూడా 422 లీటర్లు ఉంటుంది. ఫీచర్స్ కూడా ఇందులో అదిరిపోయేలా ఉంటాయని అంటున్నారు. EV వెర్షన్ లో పెద్ద టచ్ స్క్రీన్ ఉండనున్నట్లు సమాచారం. EV, ICE వెర్షన్ రెండింటిలోనూ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ADAS లెవల్ 2 వంటి ఫీచర్స్‌ను Curvv లోచూడవచ్చని అంటున్నారు. Curvv EV వేరియంట్.. నెక్సాన్‌లో మాదిరిగానే ICE వెర్షన్‌లో కూడా స్టైలింగ్ మార్పులను ఆశించవచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. Curvv ధర నెక్సాన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంకా హ్యుందాయ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కార్లకు దీటైన పోటీ ఇవ్వనుంది.