అన్వేషించండి

Tata Curvv EV Waiting Period: టాటా కర్వ్ ఈవీ కొనాలనుకుంటున్నారా? - వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా?

Tata Curvv EV: టాటా కర్వ్ ఈవీ వెయిటింగ్ పీరియడ్ రెండు నెలలకు పెరిగింది. ఈ కారు ధర మనదేశంలో రూ.17.49 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Tata Curvv EV Waiting Time: టాటా మోటార్స్ భారత మార్కెట్లో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తోంది. ఇటీవల కంపెనీ టాటా కర్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దీని తరువాత కర్వ్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లను కూడా తీసుకురావడానికి ప్రణాళిక ఉంది. అదే సమయంలో టాటా కర్వ్ ఈవీ బుకింగ్స్‌లో సంచలనం సృష్టించింది. ఈ వాహనం కోసం వెయిటింగ్ పీరియడ్ పెరిగింది కూడా.

టాటా కర్వ్ ఈవీ వెయిటింగ్ పీరియడ్ ఎంత?
కర్వ్ ఈవీ అనేది టాటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లైనప్‌లో తాజా మోడల్. ఈ కారు మహీంద్రా ఎక్స్‌యూవీ400, ఎంజీ జెడ్ఎస్ ఈవీలకు గట్టి పోటీనిస్తోంది. టాటా కర్వ్ ఈవీని విడుదల చేసి నెల కూడా కాలేదు. ఆటోకార్ నివేదిక ప్రకారం ఈ కారు కోసం వెయిటింగ్ పీరియడ్ దాదాపు రెండు నెలలకు చేరుకుంది. ఆగస్ట్ 7వ తేదీన టాటా కర్వ్ ఈవీని లాంచ్ చేసిన తర్వాత, ఆగస్ట్ 12 నుండి కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించింది.

మీరు ఈరోజే టాటా కర్వ్‌ను బుక్ చేసుకుంటే రెండు నెలల తర్వాత ఈ కారు డెలివరీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దాని టాప్ స్పెక్ వేరియంట్‌లు కస్టమర్‌లకు డెలివరీ అయ్యాయి. టాటా మొదట ఈ వేరియంట్‌లను డెలివరీ చేయడం ప్రారంభించింది.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

టాటా కర్వ్ ఈవీ పవర్ ఎంత?
టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఆప్షన్లతో మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు బ్యాటరీ ప్యాక్ 45 కేడబ్ల్యూహెచ్, మరొకటి 55 కేడబ్ల్యూహెచ్. దీని 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 502 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి తొమ్మిది సెకన్లు పడుతుంది. ఈ వేరియంట్‌లో అమర్చిన ఇంజన్ 150 పీఎస్ శక్తిని ఇస్తుంది. అలాగే 215 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా కర్వ్ ఈవీ 55 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వేరియంట్‌ను కూడా కలిగి ఉంది. ఈ వేరియంట్‌లోని ఇంజన్ 167 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 215 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

టాటా కర్వ్ ఈవీ ధర, రేంజ్ ఎంత?
టాటా కర్వ్ ఈవీ ఐదు కలర్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. టాటా లాంచ్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 17.49 లక్షల నుంచి మొదలవుతుంది. దాని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 21.99 లక్షల వరకు ఉంటుంది. టాటా కర్వ్ ఈవీ మనదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget