Suzuki Vision e-Sky BEV: 270 km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ మినీ కార్ కాన్సెప్ట్ - మీకు తెలియాల్సిన 3 విషయాలు
జపాన్ మొబిలిటీ షోలో Suzuki Vision e-Sky BEV కనువిందు చేసింది. 270 కి.మీ. రేంజ్, కాంపాక్ట్ సైజ్, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ ఎలక్ట్రిక్ కార్ 2026లో మార్కెట్లోకి రానుంది.

Suzuki Vision e-Sky BEV Concept Revealed: సుజుకి కంపెనీ, తన భవిష్యత్తు ఎలక్ట్రిక్ ప్రయాణానికి కొత్త దిశ చూపించింది. జపాన్ మొబిలిటీ షో 2025లో Suzuki Vision e-Sky BEV కాంసెప్ట్‌ను ఆవిష్కరించింది. చిన్నగా కనిపించే ఈ కార్ డిజైన్, రేంజ్, పనితీరు అన్నీ చూసి “ఇదే సరైన మినీ ఎలక్ట్రిక్ కార్” అనిపించేలా ఉన్నాయి.
ఆకర్షణీయమైన డిజైన్ - చిన్నదైనా బెటర్ ఆప్షన్
సుజుకి డిజైన్ ఫిలాసఫీ “Unique, Smart, Positive” ఆధారంగా ఈ Vision e-Sky రూపుదిద్దుకుంది. స్నేహపూర్వకంగా, పాజిటివ్‌గా కనిపించే ఫ్రంట్ లుక్, క్లీన్ లైన్స్, టాల్ బాడీ డిజైన్ - ఇవన్నీ ఈ మినీ కార్‌కు ప్రత్యేక ఆకర్షణ తెస్తాయి. జపాన్‌లో ప్రాచుర్యం పొందిన ‘కే-కార్’ (kei-car) తరహా సైజ్ ఉన్నప్పటికీ, ఇది భవిష్యత్ టచ్‌తో రూపుదిద్దుకుంది. చిన్నదైనా సిటీ రోడ్లలో సులభంగా మలుపులు తిప్పుకునేలా, పార్కింగ్‌లో కంఫర్ట్‌గా ఉండేలా తయారు చేశారు.
పరిమాణం విషయానికి వస్తే: ఈ కాంపాక్ట్ కార్ పొడవు 3,395 మి.మీ, వెడల్పు 1,475 మి.మీ, ఎత్తు 1,625 మి.మీ. సరిగ్గా సిటీ డ్రైవింగ్‌కి సరిపోయే పరిమాణం అని చెప్పొచ్చు.
పర్ఫార్మెన్స్ & రేంజ్ - రోజువారీ డ్రైవ్‌కు సరైన పార్ట్‌నర్
చిన్న సైజ్‌లో ఉన్నప్పటికీ, Vision e-Sky శక్తిమంతమైన రేంజ్‌తో వస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 కి.మీ. దూరం ప్రయాణించగలదు. ఇది రోజువారీ ఆఫీస్ ట్రిప్స్, షాపింగ్ లేదా వీకెండ్ అవుటింగ్‌లకు బాగా సరిపోతుంది. ఎలక్ట్రిక్ టెక్నాలజీలో సుజుకి అందించే నమ్మకాన్ని ఇది మరోసారి రుజువు చేసింది. వాహనం తేలికగా ఉండటంతో పాటు, ఇంధన వ్యయం లేకుండా పూర్తిగా పర్యావరణహితంగా ఉంటుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మినీ కార్లు ఎలా ఉండబోతాయో ఈ కాంసెప్ట్ స్పష్టంగా చూపిస్తోంది.
ఉత్పత్తి & మార్కెట్‌లో ప్రవేశం - 2026లో ప్రారంభం
సుజుకి కంపెనీ Vision e-Sky BEV ని 2026 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందుబాటులో ఉండే ధరలో, రోజువారీ ప్రయాణాలకు సరిపోయే ఈ కార్, సుజుకి ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కొత్త మార్గాన్ని తెరిచే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో చిన్న సైజ్ ఎలక్ట్రిక్ కార్లు కోరుకునే వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారే అవకాశముంది.
చిన్నదైనా అందంగా, ఎకో-ఫ్రెండ్లీగా ఉండే Vision e-Sky BEV సుజుకి బ్రాండ్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. ప్రాక్టికల్ యూజ్, మనస్సును హత్తుకునే డిజైన్, ఎలక్ట్రిక్ ఎఫిషియెన్సీ - ఈ మూడు అంశాల కలయికతో ఇది నగర జీవనానికి సరిపోయే ఉత్తమ ఎలక్ట్రిక్ సిటీ కార్‌గా నిలిచే అవకాశం ఉంది. 2026లో ఇది మార్కెట్లోకి వచ్చాక, అందుబాటులో ఉన్న చిన్న ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















