అన్వేషించండి

Suzuki Accessలో ఇప్పుడు ABS సేఫ్టీ: రూ. 92,328 రేటుతో కొత్త వేరియంట్‌ లాంచ్‌

Suzuki Access స్కూటర్‌కు ఇప్పుడు ABS సేఫ్టీ అందుబాటులోకి వచ్చింది. రూ. 92,328 ఎక్స్‌-షోరూమ్‌ ధరతో కొత్త వేరియంట్‌ను సుజుకి లాంచ్‌ చేసింది. ఇంజిన్‌, ఫీచర్లు అలాగే కొనసాగాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సుజుకి యాక్సెస్ 125cc స్కూటర్ ఇప్పుడు సింగిల్-ఛానల్ ABSతో అందుబాటులో ఉంది.
  • ABS వల్ల చక్రాలు లాక్ కావు, రైడర్ నియంత్రణలో ఉంటారు.
  • ఇంజిన్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు లేవు, TFT స్క్రీన్ వేరియంట్ కూడా ఉంది.
  • ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు, కలర్ ఆప్షన్లతో స్కూటర్ లభిస్తుంది.

Suzuki Access ABS Feature: భారత మార్కెట్లో అత్యంత నమ్మకమైన 125cc స్కూటర్లలో ఒకటిగా పేరున్న Suzuki Access ఇప్పుడు మరింత సేఫ్‌గా మారింది. రోజువారీ ప్రయాణాల్లో బ్రేకింగ్‌ భద్రతను పెంచే లక్ష్యంతో, సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా, ఈ స్కూటర్‌కు "సింగిల్‌-చానల్‌ ABS" (యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌)ను పరిచయం చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌తో Suzuki Access ABS వేరియంట్‌ రూ. 92,328 ఎక్స్‌-షోరూమ్‌ ధర నుంచి అందుబాటులోకి వచ్చింది.

ABS‌ అప్‌డేట్‌ ఎందుకు కీలకం?

నగర రోడ్లు, అకస్మాత్తుగా బ్రేక్‌ వేయాల్సిన పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ABS ఉండటం వల్ల చక్రాలు లాక్‌ కావు, స్కూటర్‌ కూడా రైడర్‌ నియంత్రణలోనే ఉంటుంది. దీని వల్ల, జారిపడే ప్రమాదం తగ్గుతుంది. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సుజుకి Access‌కు ఈ సేఫ్టీ అప్‌డేట్‌ తీసుకొచ్చింది.

ఇంజిన్‌ విషయంలో మార్పులేవీ లేవు

ABS వచ్చినా, Access స్కూటర్‌లోని ప్రాథమిక అంశాలను సుజుకి అలాగే కొనసాగించింది. ఇందులో ఇప్పటికే కొనసాగుతున్న 124 సీసీ, సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్‌ 6,500 rpm వద్ద 8.43 bhp (6.2 కిలోవాట్లు) శక్తి, 5,000 rpm వద్ద 10.2 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌కు CVT గేర్‌బాక్స్‌ జత చేశారు. స్మూత్‌ రైడింగ్‌, మంచి మైలేజ్‌, తక్కువ మెయింటెనెన్స్‌ కారణంగా ఇది పట్టణాలు, నగర వినియోగానికి సరైన ఎంపికగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ స్కూటర్‌కు విపరీతమైన గిరాకీ ఉంది.

ఫీచర్లు, కొలతలు ఎలా ఉన్నాయి?

Suzuki Access ABS స్కూటర్‌లో... 1,260 మిల్లీమీటర్ల వీల్‌బేస్‌, 160 మిల్లీమీటర్ల గ్రౌండ్‌ క్లియరెన్స్‌, వేరియంట్‌ను బట్టి 105 నుంచి 106 కిలోల కర్బ్‌ వెయిట్‌ ఉన్నాయి.

ఇందులో 5.3 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఇచ్చారు. అలాయ్‌ లేదా కాస్ట్‌ వీల్స్‌ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు అవసరమైన ప్రాక్టికాలిటీని ఇది బాగా అందిస్తుంది.

TFT స్క్రీన్‌తో టాప్‌ వేరియంట్‌

ABS‌తో పాటు TFT స్క్రీన్‌ ఉన్న వేరియంట్‌ కూడా సుజుకి అందిస్తోంది. ఈ వేరియంట్‌ ధర రూ. 98,378 ఎక్స్‌-షోరూమ్‌. డిజిటల్‌ డిస్‌ప్లే ద్వారా స్పీడ్‌, ఫ్యూయల్‌, ఇతర సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది.

కలర్‌ ఆప్షన్లు

TFT లేని వేరియంట్‌కు

మెటాలిక్‌ మ్యాట్‌ బ్లాక్‌ నం.2

మెటాలిక్‌ మ్యాట్‌ స్టెల్లర్‌ బ్లూ

పెర్ల్‌ గ్రేస్‌ వైట్‌

సాలిడ్‌ ఐస్‌ గ్రీన్‌

పెర్ల్‌ షైనీ బీజ్‌

TFT ఉన్న వేరియంట్‌కు

మ్యాట్‌ స్టెల్లర్‌ బ్లూ

పెర్ల్‌ గ్రేస్‌ వైట్‌

సాలిడ్‌ ఐస్‌ గ్రీన్‌

పెర్ల్‌ మ్యాట్‌ ఆక్వా సిల్వర్‌

వంటి కలర్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఫైనాన్స్‌ ఆఫర్లు కూడా ఆకర్షణీయం

యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరిచేలా సుజుకి ఫైనాన్స్‌ స్కీమ్స్‌ను కూడా ప్రకటించింది. 6.99 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా లోన్లు అందిస్తున్నారు. అదనంగా ప్రతి రాష్ట్రం నుంచి 10 మందికి రూ. 5,000 విలువైన ఓచర్లు గెలుచుకునే అవకాశం కూడా కల్పించారు.

మొత్తంగా చూస్తే, ABS‌తో Suzuki Access ఇప్పుడు భద్రతను ప్రాధాన్యం ఇచ్చే 125 సీసీ స్కూటర్‌ కొనాలనుకునే వారికి మరింత ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

Suzuki Access 125 ABS వేరియంట్ ధర ఎంత?

Suzuki Access ABS వేరియంట్ రూ. 92,328 ఎక్స్-షోరూమ్ ధర నుంచి అందుబాటులోకి వచ్చింది.

Suzuki Access 125 లో ABS ఎందుకు ముఖ్యం?

ABS ఉండటం వల్ల బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా, స్కూటర్ నియంత్రణలో ఉండి జారిపడే ప్రమాదం తగ్గుతుంది.

Suzuki Access 125 ఇంజిన్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా?

ABS వచ్చినా, ఇంజిన్ లో ఎటువంటి మార్పులు లేవు. పాత 124 సీసీ ఇంజిన్‌తోనే ఇది కొనసాగుతోంది.

Suzuki Access ABS వేరియంట్ లో TFT స్క్రీన్ ఉంటుందా?

అవును, ABS తో పాటు TFT స్క్రీన్ ఉన్న టాప్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 98,378 ఎక్స్-షోరూమ్.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget