అన్వేషించండి

New Suzuki Access 125: టెస్టింగ్‌లో కనిపించిన సుజుకి యాక్సెస్ 125 ఫేస్‌లిఫ్ట్ - లాంచ్ త్వరలోనే!

Suzuki Access 125 Facelift Update: సుజుకి యాక్సెస్ 125 ఫేస్‌లిఫ్ట్ మోడల్ మనదేశంలో టెస్టింగ్‌లో కనిపించింది. దీన్ని కంపెనీ త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Suzuki Access 125 Facelift: సుజుకి మోటార్‌సైకిల్స్ బీఎస్4 ఉద్గార నిబంధనలను అమలు చేయడానికి ముందు, 2016లో దాని మోస్ట్ పాపులర్ యాక్సెస్ 125ని చివరిసారిగా అప్‌డేట్ చేసింది. అప్పటి నుండి ఇది చాలా వరకు అలాగే ఉంది. అయితే సుజుకి ఇప్పుడు ఒక టెస్ట్ మ్యూల్‌ను పరీక్షించడం గుర్తించారు. ఇది ఫేస్‌లిఫ్టెడ్ సుజుకి యాక్సెస్ 125లాగా కనిపిస్తుంది.

సుజుకి యాక్సెస్ 125 ఫేస్‌లిఫ్ట్
టెస్ట్ మ్యూల్‌పై బ్యాడ్జింగ్ కనిపించనప్పటికీ, సిల్హౌట్‌ను బట్టి ఇది యాక్సెస్ 125 అని అనుకోవచ్చు. ఇది మృదువైన బాడీ ప్యానెల్‌తో చాలా న్యూట్రల్ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే దీని లుక్‌లో పెద్దగా మార్పులు ఉండవు. ఈ మోడల్‌లో దాని హెడ్‌లైట్ కౌల్‌ను రీడిజైన్ చేశారు. ఇది ప్రస్తుత తరం స్కూటర్ కంటే శక్తివంతమైనది.

సుజుకి యాక్సెస్ 125 ఎల్లప్పుడూ ఒక ప్రాక్టికల్ స్కూటర్‌గా ఉండేది. దీనికి కుడి వైపున ఒక స్టోరేజ్ క్యూబీని జోడించడం వలన అది మరింత మెరుగ్గా ఉంటుంది. ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్, వెనుక మడ్‌గార్డ్‌లను కూడా రీడిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సుజుకి తన 21.8 లీటర్ అండర్ సీట్ స్టోరేజీ ఏరియాని పెంచుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే మార్కెట్‌లోని చాలా ఐసీఈ, ఈవీ స్కూటర్లు ఇప్పుడు 30 లీటర్ల కంటే ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యాన్ని అందిస్తున్నాయి.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టెస్టింగ్ మ్యూల్స్‌లో ఒకదానిలో హజార్డ్ లైట్లు కూడా ఉన్నాయి. వీటిని ప్రొడక్షన్ స్పెక్ మోడల్‌లో కూడా చేర్చే అవకాశం ఉంది. ప్రస్తుతం యాక్సెస్ 125 ఫీచర్లలో కిల్ స్విచ్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, వన్ పుష్ సెంట్రల్ లాక్ సిస్టమ్, రెండు లగేజ్ హుక్స్ ఉన్నాయి.

ధర పెరుగుతుందా?
యాక్సెస్ 125 ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికీ 10 అంగుళాల వెనుక చక్రంతో కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి చాలా కొత్త స్కూటర్లు 12 అంగుళాల చక్రాలతో వస్తున్నాయి. ప్రస్తుత మోడల్‌తో పోల్చితే కొద్దిగా మారిన డిజైన్‌తో వచ్చినప్పటికీ దీని మెకానికల్ ఫీచర్లలో పెద్దగా మార్పులు ఉండవని అంచనా. సుజుకి యాక్సెస్ 125 ప్రస్తుత ఎక్స్ షోరూమ్ ధర రూ. 79,899 నుంచి రూ. 90,500 మధ్యలో ఉంది. అయితే ఈ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయితే దీని ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Avatar 3 Piracy : 'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
Embed widget