అన్వేషించండి

Steel Bumper Guard: కారుకి స్టీల్‌ బంపర్‌ గార్డ్ పెడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా? చట్టపరమైన చర్యలు ఎదురుకావచ్చు!

Challan on Steel Bumper Guard: కారుకు చాలా మంది స్టీల్ బంపర్ గార్డ్‌ లేదా బుల్ బార్‌ను అమరుస్తూ ఉంటారు. దీని వల్ల చాలా మీ కారుకి జరిమానా పడే అవకాశం ఉంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • స్టీల్ బంపర్ గార్డులు పాదచారులకు, వాహనాలకు ప్రమాదకరం.
  • ఇవి కారు ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి.
  • స్టీల్ బంపర్ ఉంటే వెయ్యి వరకు జరిమానా విధించవచ్చు.
  • అనధికార మార్పులు, అధిక శబ్దంతో జరిమానాలు పడతాయి.

Challan on Steel Bumper Guard: ట్రాఫిక్‌లో తరచూ జరిగే చిన్న చిన్న ప్రమాదాలను నివారించడానికి కార్లకు చాలా మంది స్టీల్ బంపర్‌లు అమరుస్తూ ఉంటారు. ముందు నుంచి వెనుక నుంచి వచ్చి వాహనాలు తగిలినా కారుకు ఎక్కువ డ్యామేజీ లేకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తారు. కార్లను మరింత బలంగా సురక్షితంగా మార్చుకోవడానికి ఇలాంటి వాటిని అమరుస్తుంటారు. వీటిని సాధారణంగా బుల్ బార్స్ అని అంటారు. ఇవి మీ కారుని రక్షిస్తుందేమో కానీ మీ జేబుకు మాత్రం చిల్లు పెడుతుంది. ఈ అనుబంధ పరికరం ఇప్పుడు చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. భారత్‌లో రహదారి భద్రతను నిర్దారించడానికి ప్రభుత్వం ఇటువంటి గార్డులపై కఠినమైన నిబంధనలను విధించింది. ఎందుకంటే ఇవి పాదచారులకు ఇతర వాహనాలకు ప్రమాదకరంగా మారగలవు. 

 స్టీల్ బంపర్‌లను ఎందుకు నిషేధించారు?

స్టీల్ బంపర్‌ గార్డ్‌ దృఢంగా కనిపించినప్పటికీ ప్రమాదం జరిగినప్పుడు అది భారీ నష్టాన్ని మిగులుస్తుంది. ఒక వేళ కారు పాదచారిని ఢీకొంటే,  అది తీవ్రమైన గాయానికి కారణం కావచ్చు. అంతేకాకుండా ఇది కారు ఎయిర్‌బ్యాగ్‌ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌ బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవు. దీని వల్ల కారులోని ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ఈ కారణంగానే ప్రభుత్వం దీనిని చట్టవిరుద్ధమని ప్రకటించింది. 

జరిమానా ఎంత విధిస్తారు?

మీ కారు స్టీల్ బంపర్ గార్డ్ ఉన్నట్టు తేలితే, ట్రాఫిక్ పోలీసులు మీకు జరిమానా విధించవచ్చు. మోటార్‌ వాహనాల చట్టం ప్రకారం, దీనికి సాధారణంగా వెయ్యి వరకు జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా వాహనానికి ఇతర చట్టవిరుద్ధమైన మార్పులు చేసినట్టు అయితే జరిమానా ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. ఆ గార్డ్‌ను వెంటనే తొలగించమని కూడా పోలీసులు మిమ్మల్ని అడగవచ్చు. 

ఏ మార్పులు చట్టవిరుద్ధమైనవి?

బంపర్ గార్డులు మాత్రేమే కాదు, కారుకు చేసే అనేక మార్పులు నిబంధనలకు విరుద్ధం. మితమీరిన శబ్దం చేసే హారన్‌, తప్పుడు నెంబర్ ప్లేట్, అనుమతిలేని లైట్లు, బాడీ మార్పులు వంటివి కూడా జరిమానాకు దారితీయవచ్చు. అందువల్ల ఏమైనా మార్పులు చేసే ముందు నిబంధనలు గురించి తెలుసుకోవాలి. 

చలాన్ రాకుండా ఉండాలంటే ఏంచేయాలి.?

మీ కారు స్టీల్ బంపర్ గార్డు అమర్చి ఉంటే దానిని తీసివేయడం ఉత్తమం. ఇది మిమ్మల్ని జరిమానాల చి కాపాడటమే కాకుండా మీ రోడ్డు భద్రతను కూడా మెరుగుపరుస్తుంది. మీ కారు అసలు డిజైన్‌ను ఎల్లప్పుడూ అలాగే ఉంచడానికి ప్రయత్నించండి. ఇది వాహనాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ఎలాంటి చట్టపరమైన చిక్కులు ఉండవు.

Frequently Asked Questions

స్టీల్ బంపర్ గార్డులను ఎందుకు నిషేధించారు?

స్టీల్ బంపర్ గార్డులు పాదచారులకు, ఇతర వాహనాలకు ప్రమాదకరంగా మారతాయి. ఇవి కారు ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి, ప్రయాణికుల భద్రతకు ముప్పు తెస్తాయి.

స్టీల్ బంపర్ గార్డు అమర్చినందుకు ఎంత జరిమానా పడుతుంది?

స్టీల్ బంపర్ గార్డు అమర్చినందుకు సాధారణంగా వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో, వాహనానికి ఇతర చట్టవిరుద్ధమైన మార్పులు చేస్తే జరిమానా ఇంకా ఎక్కువగా ఉండవచ్చు.

కారుకు ఏయే మార్పులు చట్టవిరుద్ధమైనవి?

బంపర్ గార్డులతో పాటు, అధిక శబ్దం చేసే హారన్, తప్పుడు నంబర్ ప్లేట్, అనుమతిలేని లైట్లు, బాడీ మార్పులు వంటివి కూడా చట్టవిరుద్ధమైనవి. వీటివల్ల జరిమానా పడే అవకాశం ఉంది.

చలాన్ రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

కారుకు స్టీల్ బంపర్ గార్డు అమర్చి ఉంటే, దానిని తొలగించడం ఉత్తమం. కారు అసలు డిజైన్‌ను మార్చకుండా ఉంచడం వల్ల చట్టపరమైన చిక్కులు రాకుండా ఉంటాయి.

టాప్ హెడ్ లైన్స్

అథర్‌ స్కూటర్లలో 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ప్రారంభం.. రోడ్డుపై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందే హెచ్చరికలు
రోడ్డుపై గుంతల గురించి ముందే హెచ్చరించే కొత్త ఫీచర్‌ - అథర్‌ Gen 2 స్కూటర్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌
526km రేంజ్‌, ఆశ్చర్యపరిచే ఫీచర్లు... కానీ ఈ 2 కారణాల వల్ల కియా సైరోస్‌ EV మీకు సరిపోకపోవచ్చు!
కియా సైరోస్‌ EV ని కొనాలా? వద్దా? - ఈ మోడ్రన్‌ కారులో 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు
కొత్త స్పెక్ట్రల్‌ గ్రీన్‌ కలర్‌తో టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ - ధర రూ.95,320
టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ లాంచ్‌.. మార్వెల్‌ అభిమానుల కోసం స్పెషల్‌ బైక్‌
No PUC No Fuel: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Embed widget