అన్వేషించండి

Car Maintenance: టైర్లలో నైట్రోజన్ గాలి – మార్కెటింగ్ ట్రిక్కా లేక నిజంగానే అవసరమా?

Car Maintenance: కార్ల టైర్లలో సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ నింపడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఖర్చులు, ఇతర కీలక అంశాలపై పూర్తి విశ్లేషణ గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టైర్లలో నైట్రోజన్ వాడకం, దాని వల్ల లాభాలు, నష్టాలు తెలుసుకుందాం.
  • నైట్రోజన్ వల్ల టైర్ ప్రెజర్ స్థిరంగా, తుప్పు పట్టకుండా ఉంటుంది.
  • హై-పెర్ఫార్మెన్స్ కార్లకు, వేడి ప్రాంతాల్లో నివసించేవారికి ఇది మంచిది.
  • సాధారణ డ్రైవర్లకు, నగర ప్రయాణాలకు మామూలు గాలి సరిపోతుంది.

Car Maintenance: ఆటోమొబైల్ రంగంలో అప్పుడప్పుడు కొన్ని పాత పదాలు కొత్తగా వినిపిస్తుంటాయి. టైర్లలో 'నైట్రోజన్ ఇన్ఫ్లేషన్' కూడా అలాంటిదే. టైర్ షాపుల్లో గ్రీన్ కలర్ వాల్వ్ క్యాప్స్ చూసినప్పుడు.. "సాధారణ గాలి కంటే నైట్రోజన్ నిజంగానే మంచిదా?" అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. ఈ మార్కెటింగ్ హడావుడిని పక్కన పెట్టి అసలు విషయానికి వస్తే, నైట్రోజన్ గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలి.

నైట్రోజన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి?

సాధారణంగా మనం వాడే గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ తో పాటు కొంత తేమ (Moisture) ఉంటుంది. టైర్లలో నైట్రోజన్ నింపడం అంటే ఆక్సిజన్, తేమను తొలగించి దాదాపు 95 నుండి 99 శాతం స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ నింపడమే. ఆక్సిజన్, నీటి ఆవిరి వల్ల టైర్ ప్రెజర్‌లో మార్పులు రావడం, రబ్బరు త్వరగా పాడవ్వడం వంటివి జరుగుతుంటాయి. వీటిని తగ్గించడమే నైట్రోజన్ ప్రధాన ఉద్దేశం.

నైట్రోజన్ వల్ల కలిగే లాభాలు..

ప్రెజర్ తగ్గడం నెమ్మదిగా ఉంటుంది: నైట్రోజన్ అణువులు (Molecules) సాధారణ గాలి కంటే పెద్దవిగా ఉంటాయి. ఇవి టైర్ రబ్బరు రంధ్రాల నుండి బయటకు రావడం కొంచెం కష్టం. దీనివల్ల టైర్ ప్రెజర్ ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది. తరచుగా గాలి చెక్ చేయని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

తుప్పు పట్టకుండా రక్షణ: కంప్రెస్డ్ ఎయిర్‌లో ఉండే తేమ వల్ల టైర్ రిమ్స్ లోపల తుప్పు పట్టే అవకాశం ఉంది. నైట్రోజన్ పూర్తిగా డ్రై గా ఉండటం వల్ల అల్లాయ్ వీల్స్, టీపీఎంఎస్ (TPMS) సెన్సార్లు సురక్షితంగా ఉంటాయి.

స్థిరమైన ఉష్ణోగ్రత: హైవేలపై లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా సమ్మర్ ఎండల్లో టైర్లు వేడెక్కుతాయి. సాధారణ గాలి కంటే నైట్రోజన్ తక్కువగా వ్యాకోచిస్తుంది. దీనివల్ల టైర్లు చల్లగా ఉండటమే కాకుండా హ్యాండ్లింగ్ కూడా స్టేబుల్‌గా ఉంటుంది.

ఇబ్బందులు ఇవే:

సాధారణ డ్రైవర్లకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువనే చెప్పాలి. సిటీ ట్రాఫిక్‌లో తిరిగే వారికి నార్మల్ ఎయిర్ సరిపోతుంది. నైట్రోజన్ ప్రతి పెట్రోల్ బంకులో దొరకదు. దీనికి రూ. 50 నుండి రూ. 200 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా నైట్రోజన్ కొట్టించాం కదా అని గాలి చెక్ చేయడం మానేస్తే ప్రమాదమే. నైట్రోజన్ నింపినా కూడా నెలకోసారి ప్రెజర్ చెక్ చేసుకోవడం తప్పనిసరి.

ఎవరు వాడాలి?

మీరు హై-పెర్ఫార్మెన్స్ కార్లు వాడుతున్నా, విపరీతమైన ఎండలు ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నా నైట్రోజన్ గ్యాస్ తీసుకోవడం మంచిది. లగ్జరీ కార్ ఓనర్లకు ఇది సెట్ అవుతుంది. కానీ ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లి వచ్చే సాధారణ వాహనదారులకు మామూలు గాలి పక్కాగా సరిపోతుంది. సరిగ్గా మెయింటైన్ చేయడం, క్రమం తప్పకుండా ప్రెజర్ చెక్ చేయడం వల్ల టైర్ లైఫ్ పెరుగుతుంది. నైట్రోజన్ గాలి అనేది ఒక అదనపు సౌకర్యం మాత్రమే, అది ఖచ్చితంగా ఉండాలనే రూల్ ఏమీ లేదు. ప్రీమియం పెట్రోల్ లాగా ఇది థియరీ పరంగా బాగుంటుంది కానీ అందరికీ అవసరం లేదు. మీ దగ్గరలోని షాపులో నైట్రోజన్ అందుబాటులో ఉండి, కొంచెం ఎక్స్ట్రా ఖర్చు చేయడానికి మీకు ఇబ్బంది లేకపోతే హ్యాపీగా వాడుకోవచ్చు. లేదంటే సాధారణ గాలితోనూ మీ కారు ప్రయాణం క్షేమంగా సాగుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

టైర్లలో నైట్రోజన్ అంటే ఏమిటి?

టైర్లలో ఆక్సిజన్, తేమను తొలగించి, దాదాపు 95-99% స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ నింపడాన్ని నైట్రోజన్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది టైర్లలో ఒత్తిడి స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.

సాధారణ గాలికి బదులుగా నైట్రోజన్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

నైట్రోజన్ అణువులు పెద్దవి కావడం వల్ల టైర్లలో ఒత్తిడి ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుంది. అలాగే, తేమ లేకపోవడం వల్ల రిమ్స్ తుప్పు పట్టకుండా రక్షణ లభిస్తుంది, టైర్లు చల్లగా ఉంటాయి.

నైట్రోజన్ వాడటం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి?

నైట్రోజన్ ప్రతి చోటా అందుబాటులో ఉండదు, దీనికి కొంత అదనపు ఖర్చు కూడా అవుతుంది. సాధారణ డ్రైవర్లకు దీనివల్ల కలిగే ప్రయోజనాలు చాలా తక్కువ.

ఎవరు నైట్రోజన్ గ్యాస్ వాడటం మంచిది?

హై-పెర్ఫార్మెన్స్ కార్లు వాడేవారు, ఎక్కువ ఎండలు ఉండే ప్రాంతాల్లో నివసించేవారు, లగ్జరీ కార్ యజమానులు నైట్రోజన్ వాడటం వల్ల ప్రయోజనం పొందవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget