అన్వేషించండి

Speed Petrol: స్పీడ్‌ పెట్రోల్‌ అంటే ఏంటి?, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే దాని గొప్పేంటి?

స్పీడ్‌ పెట్రోల్‌ అంటే ఏంటి? సాధారణ పెట్రోల్‌ & స్పీడ్‌ పెట్రోల్‌ మధ్య ఉన్న ముఖ్య తేడాలు ఏంటి? వాహనానికి స్పీడ్‌ పెట్రోల్‌ వాడితే కలిగే ప్రయోజనాలేమిటో వివరంగా తెలుసుకోండి.

Normal Petrol vs Speed Petrol: మనలో చాలా మందికి పెట్రోల్‌ బంక్‌ వద్ద స్పీడ్‌ పెట్రోల్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. కానీ దాని ధర కొంచం ఎక్కువ, కాబట్టి చాలా మంది స్పీడ్‌ పెట్రోల్‌ వైపు వెళ్లరు. అసలు.. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే స్పీడ్‌ పెట్రోల్‌ గొప్పేంటి, ఏం అదనంగా ఇస్తుంది, దీనివల్ల వాహనానికి నిజంగానే ప్రయోజనమా? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు తెలుసుకుందాం. దీనికంటే ముందుగా, స్పీడ్‌ పెట్రోల్‌ అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం.

స్పీడ్‌ పెట్రోల్‌ అంటే ఏమిటి?
స్పీడ్‌ పెట్రోల్‌ను కొన్ని కంపెనీలు ప్రీమియం పెట్రోల్‌గా మార్కెట్‌ చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేకమైన ఫ్యూయల్‌ యాడిటివ్స్‌ & డిటర్జెంట్లు ఉంటాయి. ఇవి ఇంజిన్‌లో ఏర్పడే కార్బన్‌ డిపాజిట్లను తగ్గించి, ఇంజిన్‌ క్లీన్‌గా ఉండేలా సహాయపడతాయి. అంటే, వాహన ఇంజిన్‌ లోపల జరిగే దహన ప్రక్రియ మరింత శుభ్రంగా, సవ్యంగా కొనసాగేందుకు స్పీడ్‌ పెట్రోల్‌ ఉపయోగపడుతుంది.

సాధారణ పెట్రోల్‌ vs స్పీడ్‌ పెట్రోల్‌ - ప్రధాన తేడాలు
సాధారణ పెట్రోల్‌ అంటే మనం ప్రతిరోజూ వాడే రెగ్యులర్‌ పెట్రోల్‌. ఇందులో యాడిటివ్స్‌ చాలా తక్కువగా ఉంటాయి. స్పీడ్‌ పెట్రోల్‌లో మాత్రం అదనపు క్లీనింగ్‌ యాడిటివ్స్‌, ఆక్టేన్‌ స్థాయి కొంత ఎక్కువగా ఉండవచ్చు. దీని వల్ల దహన సామర్థ్యం కొంచెం మెరుగుపడుతుంది. సాధారణ పెట్రోల్‌ పనితీరు రోజువారీ వాహన వినియోగానికి పూర్తిగా సరిపోతుంది. అయితే, స్పీడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను శుభ్రం చేయడంలో, స్మూత్‌గా నడపడంలో కొంత పైచేయి కలిగి ఉంటుంది.

స్పీడ్‌ పెట్రోల్‌ వల్ల వాహనానికి ఉపయోగమేమిటి?

ఇంజిన్‌ క్లీన్‌గా ఉండటం: ఇందులో ఉన్న యాడిటివ్స్‌ కారణంగా ఇంజిన్‌ లోపలి భాగాల్లో కార్బన్‌ పేరుకుపోవడం తగ్గుతుంది. దీని వల్ల ఇంజిన్‌ శబ్దం తగ్గి స్మూత్‌గా నడుస్తుంది.

ఆక్సిలరేషన్‌ మెరుగుపడే అవకాశం: ఇంజిన్‌ శుభ్రంగా ఉన్నప్పుడు ఆక్సిలరేషన్‌ కొంచెం మెరుగుపడుతుంది. ప్రత్యేకంగా ఎక్కువగా సిటీ రైడింగ్‌ చేసే వారికి ఇది ఉపయోగకరం.

ఫ్యూయల్‌ ఎకానమీ కొంతవరకు మెరుగుపడవచ్చు: స్పీడ్‌ పెట్రోల్‌ వాడడం వల్ల ఇంజిన్‌ లోపలి రాపిడి కొంచెం తగ్గి మైలేజ్‌ కొంచం మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే ఇది వాహనం, రైడింగ్‌ స్టైల్‌, రోడ్డు పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇంజిన్‌ నెమ్మదిగా డిప్రిసియేట్‌ అవ్వడం: ఇంజిన్‌ శుభ్రంగా ఉన్నప్పుడు దాని జీవితకాలం కొంత పెరగవచ్చు. దీర్ఘకాలం ఒకే వాహనం వాడే వాళ్లకు ఈ ఫ్యూయల్‌ మంచి ఆప్షన్‌.

స్పీడ్‌ పెట్రోల్‌ అందరికీ అవసరమా?
అందరూ తప్పనిసరిగా స్పీడ్‌ పెట్రోల్‌ వాడాలా? అంటే, అవసరం లేదు. మీ వాహనం పూర్తిగా కండిషన్‌లో ఉండి, రెగ్యులర్‌గా సర్వీస్‌ చేయిస్తే సాధారణ పెట్రోల్‌ సరిపోతుంది. కానీ, మీ ఇంజిన్‌ పనితీరు కొంచెం మెరుగుపడాలని అనుకుంటే లేదా మీ వాహనం పాతది అయితే స్పీడ్‌ పెట్రోల్‌ను అప్పుడప్పుడు వాడటం మంచిదే.

స్పీడ్‌ పెట్రోల్‌ వాడితే ఇంజిన్‌ శుభ్రంగా, స్మూత్‌గా పని చేసే అవకాశాలు ఎక్కువ. అయితే ఇది వాహనాన్ని మంత్రం వేసినట్లు మార్చేయదు. సాధారణ పెట్రోల్‌ కూడా చాలా బండ్లకు సరిపోతుంది. అయితే, ప్రీమియం ఫీలింగ్‌ కోసం లేదా ఇంజిన్‌ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కొన్నిసార్లు స్పీడ్‌ పెట్రోల్‌ వాడడం ప్రయోజనకరం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో JSW నుంచి బిగ్ సర్ ప్రైజ్.. 450 కిమీ వరకు రేంజ్ ఇవ్వనున్న iCaur V23
భారత్‌లో JSW నుంచి బిగ్ సర్ ప్రైజ్.. 450 కిమీ వరకు రేంజ్ ఇవ్వనున్న iCaur V23
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
రూ.9 వేల కంటే తక్కువ EMIతోనే టాటా ఆల్ట్రోజ్‌ను మీ సొంతం చేసుకోవచ్చు! ఇదిగో ఈజీ ప్లాన్‌
5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ఉన్న టాటా ఆల్ట్రోజ్‌ కొనడానికి లోన్‌ ఇస్తారా? డౌన్‌పేమెంట్‌ ఎంత కట్టాలి?
Kawasaki Z900 బైక్‌పై అదిరిపోయే డీల్‌.. వడ్డీ మినహాయింపుతో పాటు ఉచిత యాక్సెసరీస్‌!
Kawasaki Z900 కొనండి.. రూ. 1.25 లక్షల విలువైన డీల్‌ సొంతం చేసుకోండి!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget