ఏ నటుడి వద్దర అత్యంత ఖరీదైన కారు ఉంది?

Published by: Shankar Dukanam
Image Source: rolls-roycemotorcars.com

రోల్స్ రాయిస్ కార్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా పరిగణిస్తారు.సెలబ్రిటీల్లో ఈ కారుకు మంచి ఆదరణ ఉంది.

Image Source: rolls-roycemotorcars.com

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ వద్ద అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి ఉంది. ఒక ప్రీమియం బంగ్లా ఖరీదుతో సమానం.

Image Source: therealemraan

ఇమ్రాన్ హాష్మీ దగ్గర Rolls Royce Ghost Black కారు ఉండగా. దాని ధర సుమారు 12.25 కోట్లు.

Image Source: therealemraan

ఇందులో 6.75 లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజిన్ ఉంది. ఇది 592 bhp శక్తిని, 900 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Image Source: rolls-roycemotorcars.com

ఆ కారు కేవలం 4.6 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిమీ

Image Source: rolls-roycemotorcars.com

కారులో 21 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి దాని ప్రీమియం లుక్ మరింత పెంచుతాయి.

Image Source: rolls-roycemotorcars.com

కారులో బ్లాక్ క్రోమ్ డిటైలింగ్, స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ, సిగ్నేచర్ బ్లాక్ బ్యాడ్జ్ ట్రీట్మెంట్, ప్యాంథియన్ గ్రిల్ వంటి హై-ఎండ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

Image Source: rolls-roycemotorcars.com

బూడిద రంగులో ఉన్న చెక్కతో చేసిన ట్రిమ్, డ్యూయాలిటీ ట్విల్ అప్హోల్స్టరీ మెటీరియల్ వంటి ప్రీమియం ఇంటీరియర్ చాయిస్ ఉన్నాయి

Image Source: rolls-roycemotorcars.com

ఈ కారులో 18 స్పీకర్లతో 1400 వాట్స్ ఆడియో సిస్టమ్ ఉంది. ఇది మోడ్రన్ యాంప్లిఫైయర్‌తో వస్తుంది.