Sony SUV:త్వరలో సోనీ ఎస్‌యూవీలు.. అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఫీచర్లు.. టాప్ స్పీడ్ ఎంతంటే?
సోనీ కొత్త ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. అదే సోనీ విజన్-ఎస్ 02.
ప్రముఖ టెక్ కంపెనీ సోనీ త్వరలో ఆటోమొబైల్స్ రంగంలోకి కూడా రానుందని వార్తలు వస్తున్నాయి. విజన్-ఎస్ 02 అనే ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని కూడా సోనీ 2022 సీఈఎస్‌లో ప్రదర్శించింది. సోనీ ఒక ప్రత్యేకమైన మొబిలిటీ కంపెనీని కూడా స్థాపించింది.
2020లో లాంచ్ సోనీ మొదటి ఎలక్ట్రిక్ సెడాన్ కారు విజన్-ఎస్ 01ను లాంచ్ చేసింది. ఇది సోనీ లాంచ్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ వాహనం ప్రోటో టైప్. దీన్ని ప్రస్తుతం పబ్లిక్ రోడ్ల మీద టెస్ట్ చేస్తున్నారు. విజన్-ఎస్ 02 పొడవు 4.89 మీటర్లు కాగా, వెడల్పు 1.93 మీటర్లుగానూ, ఎత్తు 1.6 మీటర్లుగానూ ఉంది. ఈ కొలతలను చూస్తే ఈ కారు టెస్లా మోడల్ వైతో పోటీ పడనుందని అర్థం చేసుకోవచ్చు.
ఈ కొత్త సెవెన్-సీటర్ ఎస్‌యూవీలో ఎస్ 01 సెడాన్‌లోని కనెక్టివిటీ టెక్నాలజీని అందించారు. 268 బీహెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్‌ను ప్రతి యాక్సిల్‌లో అందించారు. ఈ కారు బ్యాటరీ కెపాసిటీని, పెర్ఫార్మెన్స్ గణాంకాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని ఈ కారు అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
సోనీ ఫోకస్ పూర్తిగా అటానమస్ డ్రైవింగ్ మీదనే ఉందని ఈ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ వాహనం ద్వారా క్లియర్‌గా తెలుస్తోంది. ఇందులో బోలెడన్ని సెన్సార్లను కూడా అందించారు. లెవల్ 2+ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌ను కూడా సోనీ అందించే అవకాశం ఉంది. అయితే ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడు రానుందో తెలియరాలేదు.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?