Slavia vs City vs Verna vs Rapid: నాలుగూ సూపర్ కార్లే.. దేని ధర తక్కువ? ఎందులో ఫీచర్లు బాగున్నాయి?
సెడాన్ కార్లు కొనాలనుకునేవారికి ఆ విభాగంలో ఏ కారు కొనాలనే విషయంలో గందరగోళం సహజమే. బెస్ట్ సెడాన్లు అయిన స్లేవియా, హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, స్కోడా ర్యాపిడ్‌ల్లో దేని ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
స్కోడా స్లేవియా కారు మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఇది ర్యాపిడ్ కారును రీప్లేస్ చేయనుంది. సెడాన్ విభాగంలో స్లేవియాకు ప్రధాన ప్రత్యర్థులు అయిన హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, స్లేవియా, ర్యాపిడ్ కార్లలో ఏది బెస్ట్? దేని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం..
ఏది అతిపెద్ద సెడాన్?
పొడవు విషయంలో హోండా సిటీ అన్నిటికంటే పెద్ద సెడాన్. రెండో స్థానంలో స్లేవియా, మూడో స్థానంలో వెర్నా ఉన్నాయి. ఇక ర్యాపిడ్ అన్నిటికంటే చిన్న కారు. వెడల్పు విషయంలో చూస్తే.. స్లేవియా అన్నిటికంటే పెద్దది. రెండో స్థానంలో హోండా సిటీ, మూడో స్థానంలో వెర్నా, నాలుగో స్థానంలో ర్యాపిడ్ ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే.. స్లేవియా లేటెస్ట్ కారు కాబట్టి దాని లుక్ ప్రీమియంగా ఉంది. ఇక హోండా సిటీ, వెర్నాల్లో కూడా క్రోమ్ గ్రిల్, పెద్ద హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇక అన్ని కార్లలో 16 అంగుళాల వీల్ బేస్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి.
ఎందులో ఎక్కువ స్పేస్ ఉంది?
వీటిలో స్లేవియాకు అతిపెద్ద వీల్ బేస్ ఉంది. అంటే స్పేస్ కూడా కాస్త ఎక్కువ ఉంటుందన్న మాట. స్లేవియా వెనకవైపు కూడా కాస్త విశాలంగా ఉందని లుక్‌ను బట్టి తెలుస్తోంది. హోండా సిటీ క్యాబిన్ కూడా కాస్త పెద్దగానే ఉంది. ఇక హ్యుండాయ్ వెర్నా మరింత చిన్నగా ఉండనుంది. నలుగురు ప్రయాణికులకు ఈ కారు సరిపోనుంది. స్లేవియా.. ర్యాపిడ్ కంటే చాలా పెద్దగా ఉండనుంది. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే.. స్లేవియాలో ముందంజలో ఉండగా.. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, స్కోడా ర్యాపిడ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఫీచర్లు
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ర్యాపిడ్‌లో లేటెస్ట్ లుక్, టెక్నాలజీ లేవు. అయితే స్లేవియాలో మాత్రం పూర్తిగా లేటెస్ట్ ఫీచర్లను అందించారు. హోండా సిటీ, వెర్నాలతో ఇది పోటీ పడనుంది. స్లేవియాలో కనెక్టెడ్ కార్ టెక్నాలజీని అందించారు. ఇందులో ఇన్‌బిల్ట్ సిమ్‌ను కూడా అందించారు. హోండా సిటీ, వెర్నా తరహాలో స్మార్ట్ ఫోన్ ఫంక్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే స్లేవియాలో కూడా హోండా సిటీ, వెర్నా తరహాలో సన్‌రూఫ్ ఉంది. స్లేవియాలో పెద్ద 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ కూడా ఉంది. వెనకవైపు కెమెరా, టచ్ బేస్డ్ క్లైమెట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఇందులో అందించారు. ఇక వెర్నాలో కూడా వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. దీంతోపాటు ఎయిర్ ప్యూరిఫయర్, రేర్ వ్యూ కెమెరా కూడా ఉన్నాయి. హోండా సిటీలో వెంటిలేటెడ్ సీట్లు లేవు కానీ ఇందులో లేన్ వాచ్ టెక్నాలజీ ఉంది. మీరు ఇండికేటర్ వేసినప్పుడు ఎడమవైపు ఫీడ్‌ను స్క్రీన్ మీద చూపిస్తుంది.
ఇంజిన్లు
హోండా సిటీలో 1.5 లీటర్ల డీజిల్ లేదా పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. పెట్రోల్ వేరియంట్‌లో సీవీటీ ఆటోమేటిక్ కూడా ఉంది. హ్యుండాయ్ వెర్నాలో 1.5 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. ఈ రెండు ఇంజిన్లలోనూ సీవీటీ ఆటో ఆప్షన్ ఉంది. వెర్నాలో కూడా 1.5 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ ఇంజిన్ అందించారు. ర్యాపిడ్‌లో ఒకప్పుడు డీజిల్ ఆటోమేటిక్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు కేవలం టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ మాత్రమే ఉంది. స్లేవియాలో రెండు టర్బో పెట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. అవే 1.0 లీటర్, 1.5 లీటర్ ఆప్షన్లు. ఈ రెండిట్లోనూ ఆటోమేటిక్ ఆప్షన్ ఉంది. 1.0 లీటర్ ఆప్షన్‌లో మాన్యువల్ వేరియంట్ కూడా ఉంది.
ధర
హోండా సిటీ ధర వేరియంట్‌ను బట్టి రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండనుంది. వెర్నా ధర రూ.9.3 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉంది. ఇక ర్యాపిడ్ ధర రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షల మధ్యలో ఉంది. ఈ అన్ని కార్లలో చవకైనది ఇదే. ఇక స్లేవియా ధర రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
Also Read: Best Selling Cars: 2021లో ఎక్కువ అమ్ముడుపోయిన కార్లు ఇవే.. ఏ కారును ఎక్కువ కొన్నారంటే?
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?