అన్వేషించండి

265 hp పవర్‌తో రేస్‌ కార్‌ ఫీలింగ్‌ - Skoda Octavia RS బుకింగ్స్‌ ఓపెన్‌, కేవలం 100 కార్లు మాత్రమే!

భారతదేశంలో Skoda Octavia RS బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ₹2.50 లక్షల టోకెన్‌ అమౌంట్‌తో బుక్‌ చేసుకోవచ్చు. 265 hp 2.0 లీటర్ టర్బో-పెట్రోల్‌ ఇంజిన్‌ 0-100 km/h 6.4 సెకన్లలో చేరుతుంది.

Skoda Octavia RS India Booking Open: స్కోడా లవర్స్‌కు సంతోషకరమైన వార్త. ఐదేళ్లకు పైగా విరామం తర్వాత స్కోడా ఓక్టేవియా RS భారతీయ మార్కెట్‌లోకి మళ్లీ అడుగు పెడుతోంది. ఈ హై-పర్ఫార్మెన్స్‌ సెడాన్‌ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మీకు ఈ ప్రీమియం కారు కావాలంటే, స్కోడా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ₹2.50 లక్షల టోకెన్‌ అమౌంట్‌తో బుక్‌ చేసుకోవచ్చు. అయితే, ఈసారి పూర్తిగా తయారైన కారును (CBU) దిగుమతి చేసుకుని మీకు అందిస్తారు. అందుకే, మన దేశానికి కేవలం 100 యూనిట్లను మాత్రమే కేటాయించారు.

ఇంజిన్‌ & పనితీరు
కొత్త స్కోడా ఓక్టేవియా RSలో ఉన్న 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 265 hp పవర్‌, 370 Nm టార్క్‌ అందిస్తుంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన అన్ని RS మోడళ్లలో అత్యంత శక్తిమంతమైన వెర్షన్‌ ఇది. ఈ ఇంజిన్‌ స్కోడా కొడియాక్‌ RS & వోక్స్‌వ్యాగన్‌ గోల్ఫ్‌ GTIల్లో వాడే తరహా TSI యూనిట్‌. ట్రాన్స్‌మిషన్‌ కోసం స్కోడా 7-స్పీడ్‌ DSG ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఇచ్చింది. ఇది ముందరి చక్రాలకు శక్తిని పంపుతుంది, అంటే ఇది ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ (FWD) సెడాన్‌.

2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఇచ్చే పవర్‌తో స్కోడా ఓక్టేవియా RS కారు 0 నుంచి 100 km/h వేగాన్ని కేవలం 6.4 సెకన్లలో అందుకుంటుంది. టాప్ స్పీడ్‌ను ఎలక్ట్రానిక్‌గా 250 km/h వరకు పరిమితం చేశారు. స్పోర్టీ సౌండ్ కోసం ప్రత్యేక స్పోర్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ కూడా ఉంది.

లుక్స్‌ & ఫీచర్లు
కొత్త ఓక్టేవియా RS, యూరప్‌ వెర్షన్‌లో లభించే అగ్రెసివ్‌ లుక్‌తో వస్తోంది. ఐదు ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌ - మాంబా గ్రీన్‌, రేస్‌ బ్లూ, కాండీ వైట్‌, మ్యాజిక్‌ బ్లాక్‌, వెల్వెట్‌ రెడ్‌ - ఉన్నాయి. 19-అంగుళాల స్పోర్ట్‌ అలాయ్‌ వీల్స్‌ దీని ప్రెజెన్స్‌ను మరింత స్టైలిష్‌గా మార్చేస్తాయి.

ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఆల్‌-బ్లాక్‌ థీమ్‌లో స్పోర్ట్‌ సీట్స్‌, సువేడ్‌ & లెదరెట్‌ ఫినిష్‌తో అద్భుతమైన కంఫర్ట్‌ ఇస్తుంది. 10.25 అంగుళాల డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, 12.9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌, 11-స్పీకర్‌ కాంటన్‌ సౌండ్‌ సిస్టమ్‌, హెడ్‌-అప్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ చార్జర్‌, వైర్‌లెస్‌ ఆపిల్‌ కార్‌ప్లే & ఆండ్రాయిడ్‌ ఆటో, 360 డిగ్రీల కెమెరా, 3-జోన్‌ ఆటో క్లైమేట్‌ కంట్రోల్‌, పవర్డ్‌ & హీటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌ విత్‌ మసాజ్‌ ఫంక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లలోనే కాదు సేఫ్టీలో కూడా రాజీ పడలేదు - 10 ఎయిర్‌బ్యాగ్స్‌, ADAS సిస్టమ్‌, ESP, & డ్రైవింగ్‌ అసిస్టెంట్‌ టెక్నాలజీలు కొత్త ఓక్టేవియా RS లో భాగమయ్యాయి.

ధర & లభ్యత
స్కోడా ఓక్టేవియా RS ధరను అధికారికంగా మరికొన్ని రోజుల్లోనే, అక్టోబర్‌ 17న ప్రకటించబోతున్నారు. మార్కెట్‌ అంచనాల ప్రకారం, దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర ₹50 లక్షల నుంచి ₹55 లక్షల మధ్యలో ఉండొచ్చు. డెలివరీలు నవంబర్‌ 2025 నుంచి ప్రారంభం కానున్నాయి.

భారత మార్కెట్‌లో స్కోడా ఓక్టేవియా RS కు ప్రత్యక్ష పోటీదారు లేదు. ఈ సెగ్మెంట్‌లో ప్రీమియం పనితీరు కోరుకునే యువ కస్టమర్లకు ఓక్టేవియా RS ఒక అద్భుతమైన ఆప్షన్‌. పవర్‌, స్టైల్‌, & లగ్జరీ మూడు మిళితమై ఉన్న స్కోడా ఓక్టేవియా RS కోసం బుకింగ్స్‌ వేగంగా ఫిల్‌ అవుతున్నాయి. కేవలం 100 యూనిట్లు మాత్రమే ఉన్నందున, ఆలస్యం చేస్తే అవకాశం చేజారిపోవచ్చు!.

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget