బంపర్ బంపర్! Maruti Brezza రేటు రూ.43,100 తగ్గింది - సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగుల గ్లామరస్ SUV ఇప్పుడు చవక
GST Reforms 2025: మీరు ఈ పండుగ సీజన్‌లో మారుతి బ్రెజ్జా కొనాలని ప్లాన్ చేస్తుంటే, GST తగ్గింపు తర్వాత ఈ కారు ఇప్పుడు ఎంత చవకగా ఉందో తెలుసుకోవడం ముఖ్యం.

Maruti Brezza Price Drop After GST Cut 2025: ఇంధన సామర్థ్యం పరంగా అద్భుతంగా నిలిచిన మారుతి బ్రెజ్జా, GST 2.0 తగ్గింపు తర్వాత గతంలో కంటే మరింత అందుబాటులోకి వచ్చింది. ఈ గ్లామరస్ SUV గతంలో రూ. 8.69 లక్షలతో ప్రారంభమైంది. GST 2025 అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కారు ధర ఒకేసారి రూ. 43,100 తగ్గింది, ఇప్పుడు ప్రారంభ రేటు రూ. 8.25 లక్షలుగా మారింది (Maruti Brezza ex-showroom price, Hyderabad Vijayawada).
మారుతి బ్రెజ్జా SUV పెట్రోల్ & CNG ఇంధన ఎంపికలలో తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. Tata Nexon, Kia Sonet, Hyundai Venue & Nissan Magnite వంటి కార్లతో Maruti Brezza నేరుగా పోటీ పడుతుంది. అంటే, దాదాపుగా సారూప్య ధర & ఫీచర్లతో ఉన్న ఉన్న కార్లు ఇవి.
మారుతి బ్రెజ్జా ఫీచర్లు
అద్భుతమైన లక్షణాల కారణంగా మారుతి బ్రెజ్జా తన కస్టమర్లకు బాగా ఇష్టమైన కారుగా మారింది, మంచి పేరు సంపాదించుకుంది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారులో ఉన్నాయి. 6-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ , క్రూయిజ్ కంట్రోల్ & వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కూడా చూడవచ్చు. ఈ SUVలో వెనుక AC వెంట్స్ , హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఫాస్ట్-ఛార్జింగ్ USB పోర్ట్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ & కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
మారుతి బ్రెజ్జా భద్రత ఎలా ఉంది?
భద్రత విషయానికి వస్తే మారుతి బ్రెజ్జా కూడా ఒక బలమైన ఎంపిక. ఇది ఆరు ఎయిర్ బ్యాగులు , 360 డిగ్రీ కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ( ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ & ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కలిగి ఉంది. అదనంగా, EBD తో ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హై- స్పీడ్ హెచ్చరిక వ్యవస్థ & ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రత సాంకేతికతలను కూడా అందిస్తుంది.
మారుతి బ్రెజ్జా ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
ఇంజిన్ & పనితీరు పరంగా.. మారుతి బ్రెజ్జా 1.5-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. ఈ ఇంజిన్ 101.6 bhp & 136.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ & 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు నడుస్తుంది. CNG వేరియంట్ కూడా అదే ఇంజిన్‌తో పని చేస్తుంది, కానీ 86.6 bhp & 121.5 Nm వరకు పవర్ ఔట్‌పుట్ ఇస్తుంది.
మారుతి బ్రెజ్జా ఎంత మైలేజీని ఇస్తుంది?
స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ & ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ వంటి సాంకేతికతలను ఈ SUVలో ఇచ్చారు, ఇవి ఈ కారు ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మారుతి బ్రెజ్జా, తన విభాగంలో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన SUVలలో ఒకటి. దీని పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ 19.89 నుంచి 20.15 kmpl మైలేజీని ఇస్తుంది, పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ 19.80 kmpl మైలేజీని ఇస్తుంది & CNG వెర్షన్ 25.51 km/kg వరకు మైలేజీని ఇవ్వగలదని కంపెనీ డేటా చెబుతోంది.





















