అన్వేషించండి

Simple Dot One: బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన సింపుల్ - ధర ఎంత ఉంది?

Simple Dot One Price: సింపుల్ డాట్ వన్ బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయింది.

Simple Dot One Launched: బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు సింపుల్ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ ఎనర్జీ వన్‌లో చవకైన వేరియంట్‌ను పరిచయం చేసింది. కంపెనీ ఇప్పటికే దీని బుకింగ్‌ను ప్రారంభించింది. దీని ధర రూ. 1.40 లక్షల ఎక్స్ షోరూమ్‌గా నిర్ణయించారు. కొత్త కస్టమర్‌లు 2024 జనవరి 27వ తేదీ నుంచి నామమాత్రపు టోకెన్ మొత్తం రూ.1,947తో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోగలరు. ఇప్పుడు వన్ నుంచి డాట్ వన్‌కు మారాలనుకునే ప్రస్తుత కస్టమర్లకు బుకింగ్‌లో ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ తెలిపింది.

డిజైన్ ఎలా ఉంది?
వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, డిజైన్ డాట్‌లో ఉంచారు. అయితే బ్యాటరీ ఆప్షన్ మాత్రం ముందు వెర్షన్‌లానే ఉంది. ఇది డ్యూయల్ బ్యాటరీ సెటప్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. దీని కారణంగా డాట్ వన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ముందు వెర్షన్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇది తప్ప పెద్ద మార్పులేమీ కనిపించలేదు.

బ్యాటరీ ప్యాక్, రేంజ్ ఇలా...
డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే వేరియంట్‌లో మార్కెట్లోకి వచ్చింది. 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందించగలదు. దీన్ని కంపెనీ తన విభాగంలో అత్యధికం అని పేర్కొంది. ఈ స్కూటర్‌లో 8.5 కేడబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇది 72 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 2.7 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

లక్షణాలు ఎలా ఉన్నాయి?
సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో సీబీఎస్ డిస్క్ బ్రేక్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఓటీఏ అప్‌డేట్‌లు కూడా ఉన్నాయి. దీన్ని నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. లైట్ఎక్స్, బ్రేజెన్ఎక్స్ ఆప్షన్లు కూడా పరిచయ ఆఫర్‌లుగా అందుబాటులో ఉన్నాయి.

ఓలా ఎస్1తో పోటీ?
డాట్ వన్ దేశీయ మార్కెట్‌లో ఓలా ఎస్1తో పోటీపడనుంది. దేశీయ మార్కెట్‌లో దీని ధర రూ. 92,300 నుండి రూ. 1,29,828 వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర.

మరోవైపు 2024లో టాటా.ఈవీ కంపెనీ కర్వ్ ఎస్‌యూవీ రూపంలో పెద్ద లాంచ్‌కు సిద్ధం అవుతోంది. టాటా కర్వ్ 4 మీటర్ ప్లస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్పేస్‌లో మార్కెట్లోకి రానుంది. హారియర్, నెక్సాన్ మధ్య స్థానంలో ఇది ఉంటుంది. 2024లో మొదటగా కర్వ్ ఈవీ లాంచ్ అవుతుంది. దాని పెట్రోల్ వేరియంట్ తరువాత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ఈ కారును మొదట ప్రదర్శించారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget