అన్వేషించండి

E20 Petrol: షెల్‌, జియో BP పెట్రోల్‌లో ఎథనాల్‌ తక్కువేనా? ల్యాబ్‌ రిపోర్ట్‌ చెప్పే ఆసక్తికర విషయాలు

షెల్‌, జియో BP పెట్రోల్‌ను ముంబై ల్యాబ్‌లో టెస్ట్‌ చేయగా, రెండింటిలోనూ ఎథనాల్‌ స్థాయులు లేబుల్‌లో ఉన్నదాని కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది. ఆక్టేన్‌ రేటింగ్స్‌ మాత్రం 97 నుంచి 98.5 RON వరకు ఉన్నాయి.

E20 Fuel: మన దేశంలో, అందరు వాహనదారుల దృష్టి E20 పెట్రోల్‌ నిబంధనల పైనే ఉంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీల తర్వాత, ప్రైవేట్‌ కంపెనీలైన Shell & Jio BP అమ్మే పెట్రోల్‌ను కూడా ల్యాబ్‌లో పరీక్షించారు. ముంబైలోని గుర్తింపు పొందిన ల్యాబ్‌లో ఈ టెస్టులు జరిగాయి. పరీక్షల్లో ఎథనాల్‌ కంటెంట్‌ (Ethanol Content), ఆక్టేన్‌ రేటింగ్‌ ‍‌(Octane Rating) వంటి కీలక అంశాలను పరిశీలించారు.

ల్యాబ్‌ టెస్టుల్లో ఏం బయటపడింది?
ASTM D4815 పద్ధతిలో గ్యాస్‌ క్రోమాటోగ్రఫీ (GC) టెస్టు ద్వారా ఎథనాల్‌ శాతం కొలిచారు. ఫలితాలు ఇలా ఉన్నాయి:

Shell Regular: 16.7% ఎథనాల్‌

Shell V-Power: 15.1% ఎథనాల్‌

Jio BP E12: 15.7% ఎథనాల్‌

Jio BP E20: 18.7% ఎథనాల్‌

ఈ సంఖ్యల ప్రకారం, ఈ రెండు కంపెనీలు (Shell & Jio BP) E20 లక్ష్యానికి ఇంకా పూర్తిగా చేరుకోలేదు. అంటే, లేబుల్‌లో చెప్పినంత ఎథనాల్‌ ప్రస్తుతం ఈ ఇంధనాల్లో లేదన్నమాట.

ఆక్టేన్‌ రేటింగ్‌ మాత్రం టాప్‌
ఇక, ఆక్టేన్‌ రేటింగ్‌ టెస్టులు ASTM D2699 పద్ధతిలో చేసారు. అన్ని నమూనాల్లో ఆక్టేన్‌ లెవెల్స్‌ 97 నుంచి 98.5 RON మధ్య ఉండి, ప్రభుత్వ రంగ పెట్రోల్‌ సంస్థల కంటే (91-95 RON) ఎక్కువగా వచ్చాయి. Jio BP E20 లో ఎక్కువ ఎథనాల్‌ ఉండడం వల్ల 98.5 RON రేటింగ్‌ వచ్చింది. ఇది హై కంప్రెషన్‌ లేదా టర్బో ఇంజిన్లకు మేలు చేస్తుంది. అయితే, ఎథనాల్‌ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల మైలేజ్‌ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది.

షెల్‌ & జియో BP ఫ్యూయల్‌ సోర్సింగ్‌ తేడాలు
షెల్‌కి సొంత రిఫైనరీ ఇండియాలో లేదు. అది IOCL, BPCL లాంటి పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల నుంచి బేస్‌ పెట్రోల్‌ తీసుకుని, తన సొంత యాడిటివ్‌లతో “Regular” & “V-Power” వేరియంట్లుగా విక్రయిస్తోంది. జియో BP మాత్రం రిలయన్స్‌ జామ్‌నగర్‌ రిఫైనరీ నుంచి నేరుగా ఇంధనం తెచ్చుకుని, రెండు గ్రేడ్స్‌ - E12 & E20 - పేరిట అమ్ముతోంది.

ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వ E20 రూల్‌ దశల వారీగా అమలవుతోంది. ఇందులో మొదట పబ్లిక్‌ సెక్టార్‌ పెట్రోల్‌ కంపెనీలకే ప్రాధాన్యం ఇవ్వడంతో, షెల్‌కి ఇంకా పూర్తిగా E20 బేస్‌ ఫ్యూయల్‌ అందడం లేదు. అందుకే వాటిలో ఎథనాల్‌ శాతం కొంచెం తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్‌ చెబుతోంది.

E20 వైపు ఇండియా అడుగులు
కేంద్ర ప్రభుత్వం, 2025 ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌ తప్పనిసరి చేసింది. అందుకే ప్రైవేట్‌ ఇంధన కంపెనీలు కూడా తమ బ్లెండింగ్‌ యూనిట్లను విస్తరిస్తున్నాయి. జియో BP ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో E20 ఇంధనం అందిస్తోంది. షెల్‌ కూడా రాబోయే నెలల్లో E20కి పూర్తిగా అనుగుణంగా మారనుంది.

ప్రస్తుతం షెల్‌ & జియో BP ఇంధనాల్లో ఎథనాల్‌ లెవెల్స్‌ కొంచెం తక్కువగా ఉన్నా, ఆక్టేన్‌ రేటింగ్‌ మాత్రం గట్టిగా ఉంది. అంటే, పెర్ఫార్మెన్స్‌ బాగానే ఉన్నా, పూర్తి E20 ప్రమాణాలకు ఇంకా సమయం ఉంది. రాబోయే నెలల్లో ఈ కంపెనీల ఫ్యూయల్‌ మిక్సింగ్‌ మరింత స్థిరంగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 మారుతి బలెనోలో ఏం మారింది? ఇంజిన్ పవర్‌, మైలేజ్‌, ఫీచర్లు పెరిగాయా, తగ్గాయా?
పాత బలెనోకు కొత్త బలెనోకు తేడా ఇదే.. కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
నెలకు కేవలం రూ.10 వేలతో ఎలక్ట్రిక్‌ కారు సొంతం - పెట్రోల్ భారం నుండి విముక్తి పొందే ఐడియా
కేవలం రూ.10,000 EMIతో కొనగలిగే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు! పెట్రోల్‌ బిల్లుకు చెప్పండి గుడ్‌బై!
రూ.లక్ష లోపులో వచ్చే బజాజ్ బైక్‌లు, స్కూటర్లు.. ఈ 8 టూవీలర్లలో ఒకటి ఎంచుకోవచ్చు!
డైలీ జర్నీ నుంచి స్పోర్టీ రైడ్ వరకు.. రూ.లక్షలోపే వచ్చే ఈ బజాజ్ బైక్స్‌పై ఓ లుక్కేయండి!
398cc Triumph Scrambler 400 X: నెలకు రూ.6600 కడితే ఈ బైక్ మీదే! డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్స్‌ ఇవే!
Triumph Scrambler 400 X: రూ.3.15 లక్షల అడ్వెంచర్ బైక్‌ కేవలం రూ.6600 EMIతో మీ సొంతమవుతుంది!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డ్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి
Arvind Kejriwal: గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
గోవాలో కూటమి ఏర్పాటు చేసిన AAP.. అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన, ఆ పార్టీ అంత స్పెషలా ?
18th BRICS Summit: ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఖనిజాలు, టెక్నాలజీని ఆయుధాలుగా మార్చవద్దు.. బ్రిక్స్ సదస్సు ముగింపులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
ఎంత మంది సీఎంలు మారినా ఆర్థిక మంత్రి ఆయనే.. రోశయ్య దూరదృష్టి వల్లే మిగులు బడ్జెట్ - సీఎం రేవంత్ రెడ్డి
Tirumala Latest News: తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
తిరుమలకు వచ్చే ప్రైవేట్ వాహనాల పరిమితిపై భక్తులకు టీటీడీ క్లారిటీ
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Vijay Trisha: త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
త్రిష ఎంట్రీతో విజయ్ కంగారు... ముఖం పక్కకు తిప్పేశాడుగా!
Embed widget