అన్వేషించండి

526km రేంజ్‌, ఆశ్చర్యపరిచే ఫీచర్లు... కానీ ఈ 2 కారణాల వల్ల కియా సైరోస్‌ EV మీకు సరిపోకపోవచ్చు!

కియా సైరోస్‌ EV రెండు బ్యాటరీ ఆప్షన్లు, 526km వరకు రేంజ్‌, ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అయితే కొన్ని విషయాలను కొనుగోలు ముందు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

Kia Syros EV Price, Range And Features Telugu: భారత ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కియా తీసుకొచ్చిన కారు సైరోస్‌ EV. కేరెన్స్‌ క్లావిస్‌ EV తర్వాత కంపెనీ నుంచి వచ్చిన రెండో మాస్‌ మార్కెట్‌ ఎలక్ట్రిక్‌ వాహనం ఇదే. మహీంద్రా XUV 3XO EV, టాటా నెక్సాన్‌ EVలకు ప్రత్యర్థిగా నిలిచే ఈ ఎలక్ట్రిక్‌ SUVలో ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొనుగోలు నిర్ణయం తీసుకునే ముందు ఈ SUV బలాలు & బలహీనతలు తెలుసుకోవడం మంచిది.

కొనడానికి మొదటి కారణం.. శక్తిమంతమైన పనితీరు & ఆకట్టుకునే రేంజ్‌

కియా సైరోస్‌ EV రెండు బ్యాటరీ ప్యాక్‌లతో - 42kWh & 51.4kWh - అందుబాటులో ఉంది. చిన్న బ్యాటరీ వేరియంట్‌లో 135 హెచ్‌పీ పవర్‌, పెద్ద బ్యాటరీ వేరియంట్‌లో 171 హెచ్‌పీ పవర్‌ లభిస్తుంది. రెండు వేరియంట్లలోనూ 255 ఎన్‌ఎం టార్క్‌ అందుబాటులో ఉంటుంది.

51.4kWh వేరియంట్‌ కేవలం 8.1 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది. ఈ EVలో ఈకో, నార్మల్‌, స్పోర్ట్‌ అనే మూడు డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఈకో & నార్మల్‌ మోడ్‌ల్లో కూడా ఓవర్‌టేకింగ్‌ చాలా సులభంగా జరుగుతుంది. స్పోర్ట్‌ మోడ్‌కు మారాల్సిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. 51.4kWh బ్యాటరీతో MIDC ప్రకారం 526 కిలోమీటర్లు, 42kWh బ్యాటరీతో 443 కిలోమీటర్ల వరకు రేంజ్‌ లభిస్తుంది. వాస్తవ పరిస్థితుల్లో పెద్ద బ్యాటరీ వేరియంట్‌ సుమారు 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశముంది.

ఇది కూడా చదవండి: కొత్త స్పెక్ట్రల్‌ గ్రీన్‌ కలర్‌తో టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ - ధర రూ.95,320

కొనడానికి రెండో కారణం.. విశాలమైన క్యాబిన్‌ & అద్భుతమైన ప్రాక్టికాలిటీ

పెట్రోల్‌ మోడల్‌లాగే సైరోస్‌ EVలో కూడా ప్రయాణికులకు విశాలమైన స్థలం లభిస్తుంది. డ్రైవ్‌ సెలెక్టర్‌ను స్టీరింగ్‌ కాలమ్‌పై అమర్చడంతో సెంటర్‌ కన్సోల్‌లో అదనపు స్టోరేజ్‌ స్పేస్‌ను అందించారు. కప్‌ హోల్డర్లు, పెద్ద స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్‌, వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, పెద్ద డోర్‌ పాకెట్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి.

ముందు సీట్లు సౌకర్యవంతంగా ఉండగా, వెనుక సీట్లలో కూడా కాళ్లకు & తలకు విస్తారమైన స్థలం లభిస్తుంది. బ్యాటరీ కారణంగా ఫ్లోర్‌ కొద్దిగా ఎత్తుగా ఉన్నప్పటికీ వెనుక బెంచ్‌ను వెనక్కి జరపడం ద్వారా మరింత సౌకర్యవంతంగా కూర్చోవడం సాధ్యమవుతుంది. 390 లీటర్ల బూట్‌ స్పేస్‌, వెనుక సీటును ముందుకు జరిపితే 465 లీటర్ల వరకు లగేజీ స్థలం లభిస్తుంది. అదనంగా 16 లీటర్ల ఫ్రంక్‌ కూడా ఉంది.

కొనడానికి మూడో కారణం.. ప్రీమియం ఫీచర్లు & భద్రత

సైరోస్‌ EVలో రెండు 12.3 అంగుళాల డిస్‌ప్లేలు, 5 అంగుళాల క్లైమేట్‌ కంట్రోల్‌ స్క్రీన్‌తో కూడిన ట్రినిటీ పనోరమిక్‌ డిస్‌ప్లేను అందించారు. వైర్‌లెస్‌ Android Auto, Apple CarPlay, హర్మాన్‌ కార్డన్‌ 8 స్పీకర్‌ ఆడియో సిస్టమ్‌, వెనుక AC వెంట్స్‌, సన్‌బ్లైండ్స్‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!

భద్రత కోసం స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, అన్ని చక్రాలకు డిస్క్‌ బ్రేకులు, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ISOFIX చైల్డ్‌ సీట్‌ మౌంట్స్‌ను అందించారు. టాప్‌ వేరియంట్‌లో 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, ఫార్వర్డ్‌ & రియర్‌ కొలిజన్‌ అవాయిడెన్స్‌, బ్లైండ్‌ స్పాట్‌ కెమెరా వంటి ADAS ఫీచర్లు కూడా ఉన్నాయి. అధికారిక క్రాష్‌ టెస్ట్‌ రేటింగ్‌ ఇంకా రాలేదు. అయితే పెట్రోల్‌ మోడల్‌కు ఇప్పటికే 5 స్టార్‌ భారత్‌ NCAP రేటింగ్‌ లభించినందున EV కూడా అదే స్థాయి భద్రతను అందించే అవకాశాలు ఉన్నాయి.

కొనేముందు ఆలోచించాల్సిన మొదటి కారణం.. కార్నర్లలో బాడీ రోల్‌

సైరోస్‌ EV సస్పెన్షన్‌ పెట్రోల్‌ మోడల్‌తో పోలిస్తే మరింత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ఎత్తైన & సన్నని బాడీ డిజైన్‌ కారణంగా కార్నర్లలో కొంత బాడీ రోల్‌ కనిపిస్తుంది. వేగంగా మలుపులు తిరిగే సమయంలో ఇది డ్రైవర్‌కు స్పష్టంగా అనిపించే అవకాశం ఉంది.

కొనేముందు ఆలోచించాల్సిన రెండో కారణం.. టాప్‌ వేరియంట్‌ ధర

42kWh వేరియంట్‌ ధర రూ.13.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే 51.4kWh ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ వేరియంట్‌ ధర రూ.17 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్‌ ఎక్స్‌ లైన్‌ వేరియంట్‌కు రూ.20 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధర వద్ద టాటా నెక్సాన్‌ EV, మహీంద్రా XUV 3XO EVతో పాటు MG విండ్సర్‌ EV, మారుతి ఈ విటారా వంటి పెద్ద ఎలక్ట్రిక్‌ SUVలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఈ ధరలో చాలామంది వినియోగదారులు మరింత పెద్ద SUV వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే కియా సైరోస్‌ EV మంచి పనితీరు, ఆకట్టుకునే రేంజ్‌, విశాలమైన క్యాబిన్‌, ఆధునిక ఫీచర్లతో బలమైన ఎంపికగా నిలుస్తోంది. అయితే టాప్‌ వేరియంట్‌ల అధిక ధర & కార్నర్లలో బాడీ రోల్‌ వంటి అంశాలను కూడా కొనుగోలు ముందు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవడం మంచిది. 42kWh వేరియంట్‌ మాత్రం ధరకు తగిన విలువను అందించే ఎంపికగా కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

చూడగానే ఆకట్టుకునే Honda 0 Alpha EV.. రెండు బ్యాటరీ ఆప్షన్లు, ఫ్యూచరిస్టిక్‌ డిజైన్‌తో రాబోతోంది!
ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో హోండా ఎలక్ట్రిక్ SUV.. దీనిని కొంటే అందరి కళ్లూ మీ మీదే!
స్కోడా కైలాక్, కుషాక్, స్లావియాపై ఫెస్టివ్‌ డిస్కౌంట్లు.. ఏ కారు కొన్నా రూ.వేలల్లో ఆదా చేయొచ్చు!
స్కోడా కారు కొనేవాళ్లకు బంపర్‌ డిస్కౌంట్లు.. రూ.90,000 వరకు మిగులుతుంది!
విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం
కార్లలోనూ విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌.. ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది!
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Advertisement

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Asian Para Dominance: బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత
బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత, జపాన్ గడ్డపై భారత్ ప్రభంజనం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Embed widget