Best Safety Cars: కారు కొనేటప్పుడు సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తున్నారా? - ఈ టాప్-5 సేఫెస్ట్ కార్లపై ఓ లుక్కేయండి!
Top 5 Safest Cars in India: మనదేశంలో సేఫ్టీ విషయంలో మంచి రేటింగ్ ఉన్న కార్లు ఉన్నాయి. వీటిలో టాప్-5 లిస్ట్ ఏదో చూద్దాం.
Safest Cars in 2023: భారతీయ మార్కెట్లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. కానీ మార్కెట్లో ఉన్న కార్లలో ప్రజలు లుక్, స్టైల్‌తో పాటు సెక్యూరిటీ ఫీచర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అందువల్ల మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే దేశంలోని ఐదు సురక్షితమైన కార్ల గురించి తెలుసుకుందాం.
ఫోక్స్‌వ్యాగన్ టైగూన్/స్కోడా కుషాక్
ఫోక్స్‌వ్యాగన్ టైగూన్/స్కోడా కుషాక్ భారతదేశంలోని సురక్షితమైన కార్లలో ఒకటి. ఇది గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఈ రెండు కార్లలో టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజ్, ఈఎస్సీ, ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. స్కోడా కుషాక్ ఎక్స్ షోరూం ధర రూ.10.89 లక్షల నుంచి, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.11.62 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
టాటా అల్ట్రోజ్
ఈ కారు 5 స్టార్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, 3 స్టార్ చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, బ్రేక్ స్వే కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.6,59,900గా ఉంది.
టాటా పంచ్
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇదొకటి. ఇది గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. ఇందులో ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎయిర్ కండిషనింగ్ సహా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. సెక్యూరిటీ కోసం రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఐసోఫిక్స్ యాంకర్లు, ఏబీఎస్, రియర్ డీఫాగర్ వంటి ఫీచర్లు ఈబీడీతో అందుబాటులో ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల నుంచి రూ.9.52 లక్షల మధ్య ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300
మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా సేఫ్టీ విషయంలో మంచి స్కోరు సాధించింది. ఈ కారు 5 స్టార్ రేటింగ్‌తో వస్తుంది. రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డబుల్ కిక్ డౌన్ షిఫ్ట్, అడ్వాన్స్‌డ్ క్రీప్ ఫంక్షన్, సన్‌రూఫ్ వంటి అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8.41 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!