అన్వేషించండి

₹10 లక్షల్లో మోడ్రన్‌ ఆటోమేటిక్ కార్ ఏది? - బూట్ స్పేస్‌, 1.2 ఇంజిన్‌ కూడా కావాలనుకుంటే Tata Nexon ఎందుకు బెస్ట్‌?

రూ.10 లక్షల బడ్జెట్‌లో మంచి బూట్ స్పేస్‌, 1.2 లీటర్ ఇంజిన్‌, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న బెస్ట్ కార్ కోసం చూస్తున్నారా? టాటా నెక్సాన్ Smart Plus S AMT ఎందుకు సరైన ఆప్షనో వివరంగా తెలుసుకుందాం.

Best Automatic Car Under Rs 10 Lakhs: రూ.10 లక్షల బడ్జెట్‌లో మీకు సరిపోయే బూట్ స్పేస్‌ ఉండే, పవర్ కూడా తగ్గకుండా, పైగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే కార్ కావాలంటే ఆప్షన్లు చాలా ఎక్కువగా ఉండవు. కానీ ఈ అన్ని అవసరాలను ఒకేసారి తీర్చగల మోడల్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది, అది - Tata Nexon Smart + S AMT.

ఈ వేరియంట్‌ ధర 10 లక్షల పరిధిలో ఉండటంతో పాటు, ధర–ఫీచర్లు–పర్ఫార్మెన్స్ పరంగా బాగా బ్యాలెన్స్ అవుతుంది. ముఖ్యంగా, 1.2 లీటర్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, మంచి బూట్ స్పేస్ - ఈ మూడు కూడా ఇందులో లభిస్తాయి.

బూట్ స్పేస్ ఎందుకు ముఖ్యమంటే?
కుటుంబ ప్రయాణాల కోసం, వీకెండ్‌ ట్రిప్స్‌ కోసం చాలా మంది ఎంచుకునేది కార్‌నే. ఇలాంటప్పుడు బూట్ స్పేస్ కీలకం అవుతుంది. టాటా నెక్సాన్‌లో 382 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ సైజ్‌లోని కార్లలో ఇది మంచి ఫిగర్‌. పెద్ద ట్రావెల్ బ్యాగులు, వారాంతపు సామాను, చిన్న కుటుంబం లగేజ్ వంటివన్నీ సులభంగా పెట్టుకోవచ్చు.

1.2 L టర్బో ఇంజిన్ – పవర్ కూడా తగ్గదు
డీసెంట్‌ పవర్‌ కోసం 1.2 లీటర్ ఇంజిన్ కచ్చితంగా ఉండాలి అని కోరుకునేవాళ్ల కోసమే తయారైంది నెక్సాన్. ఇందులో ఉన్న 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ శక్తిమంతమైన పికప్ ఇస్తుంది. ఓవర్‌టేక్‌లు చేయడానికి, హైవే డ్రైవింగ్‌కి అవసరమైన పవర్‌ మాత్రమే కాకుండా, స్పోర్టీ ఫీలింగ్ కూడా ఇస్తుంది. డ్రైవర్‌కు డ్రైవింగ్‌ బోర్ రాకుండా చూసుకుంటే, మంచి ఫీలింగ్ ఇవ్వడం ఈ ఇంజిన్‌ ప్రత్యేకత.

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ – సిటీ డ్రైవ్‌లో కంఫర్ట్
ఇందులో AMT గేర్‌బాక్స్‌ ఉంటుంది. AMT ఎక్కువగా స్మూత్ కాకపోయినా, సిటీ ట్రాఫిక్‌లో మాత్రం డ్రైవింగ్ చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. నెక్సాన్ Smart + S AMT ఈ ప్రయోజనాన్ని మీ బడ్జెట్‌లోనే అందిస్తుంది.

భద్రత – ఇదే నెక్సాన్ USP
మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, టాటా నెక్సాన్ భారత మార్కెట్లో భద్రత పరంగా బెస్ట్ క్రాష్ రేటింగ్ సాధించిన కార్లలో ఒకటి. ఇది మీ కుటుంబ ప్రయాణానికి అదనపు విశ్వాసం ఇస్తుంది.

ఎందుకు ఇదే బెస్ట్ ఆప్షన్?

  • రూ.10 లక్షల బడ్జెట్‌
  • పెద్ద బూట్ స్పేస్
  • 1.2 టర్బో ఇంజిన్‌ శక్తి
  • ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
  • టాటా బ్రాండ్ భద్రత
  •  స్టైలిష్ డిజైన్

ఇవన్నీ ఒకేసారి ఇచ్చే కార్ చాలా అరుదు. అందుకే నెక్సాన్ Smart + S AMT మీ అవసరాన్ని కచ్చితంగా తీర్చగల బెస్ట్ ఎంపికగా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget