Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ సూపర్ హిట్ - ఆరు నెలల్లోనే అదిరిపోయే సేల్స్ రికార్డు!
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 లాంచ్ అయిన ఆరు నెలల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడు పోయింది.
Royal Enfield Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చవకైన బైక్ హంటర్ 350ని గత సంవత్సరం ఆగస్టులో రూ. 1.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ధర విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఒకటిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నిలిచింది.
హంటర్ 350 రెండు వేరియంట్‌లలో వస్తుంది. వీటిలో మొదటిది హంటర్ రెట్రో కాగా మరొకటి హంటర్ మెట్రో. రెండూ వేర్వేరు రంగులు, ఎక్విప్‌మెంట్ ఆప్షన్లతో రానున్నాయి. ఈ రెండిట్లో హంటర్ రెట్రో తక్కువ బడ్జెట్‌తో వినియోగదారులను ఆకర్షిస్తుంది. అయితే మెట్రో వేరియంట్ మరిన్ని లేటెస్ట్ ఫీచర్‌లను అందిస్తుంది. అందుకే దీనికి కొంచెం అధిక ధర ట్యాగ్ వేసింది. హంటర్ 350 విక్రయాలు గత ఆరు నెలల్లోనే ఒక లక్ష యూనిట్ల మార్కును దాటాయి. ఇది క్లాసిక్ 350 తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్.
స్థిరంగా అమ్మకాలు
2022 ఆగస్టులో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 అత్యధికంగా 18 వేల కంటే ఎక్కువ యూనిట్లు కంటే అమ్ముడు పోయింది. అక్టోబర్, నవంబర్‌ల్లో హంటర్ అమ్మకాలు దాదాపు నెలకు 15.5 వేల యూనిట్ల వరకు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే నెలకు 16.7 వేల యూనిట్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయించింది.
ఏ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మార్కెట్లో రెబెల్ బ్లూ, రెబెల్ రెడ్, రెబెల్ బ్లాక్, డాపర్ యాష్, డాపర్ వైట్, డాపర్ గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. డిజైన్ గురించి చెప్పాలంటే ఓవల్ షేప్‌లో ఉన్న టర్నింగ్ ఇండికేటర్లు ఉన్న రౌండ్ హాలోజన్ టెయిల్ ల్యాంప్, బ్లాక్ అల్లాయ్ వీల్ రౌండ్ హెడ్‌ల్యాంప్, స్ప్లిట్ గ్రాబ్ రైల్స్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో అందించారు. ఇంధన ట్యాంక్‌కు ఇరువైపులా 'రాయల్ ఎన్‌ఫీల్డ్' బ్రాండింగ్ అందించారు. ఈ బైక్‌ను ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌పై రూపొందించారు.
ఇంజిన్ ఎలా ఉంది?
ఈ బైక్ 150ఎమ్ఎమ్, 800ఎమ్ఎమ్ హై సీట్లు, 1,370ఎమ్ఎమ్ వీల్ బేస్ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 114 కిలోమీటర్లుగా ఉంది. ఇది 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్, 102 mm రేర్ సస్పెన్షన్ పొందుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో క్లాసిక్ 350లో అందించిన సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, SOHC ఇంజిన్‌నే అందించారు. ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానుంది.
దీని లుక్ చూడటానికి కూడా స్పోర్ట్స్ మోడల్ తరహాలో ఉంది. దీని మ్యాక్స్ పవర్ 20.2 బీహెచ్‌పీ కాగా... పీక్ టార్క్ 27 ఎన్ఎంగా ఉంది. 349 సీసీ ఇంజిన్‌ను ఇందులో అందించారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇందులో ఉంది. ముందుగా చెప్పినట్లు దీని స్టైలింగ్ ప్రకారం చూస్తే ఇది స్పోర్ట్స్ లుక్‌తో లాంచ్ కానుంది.
రౌండ్ టర్న్ ఇండికేటర్స్, రౌండ్ టెయిల్ లైట్ కూడా ఇందులో ఉంది. దీని లుక్ రెట్రో తరహాలో ఉండటం మరో ప్లస్ పాయింట్. తక్కువ ధరలో రెట్రో లుక్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ దక్కించుకోవడం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. అక్కడే రాయల్ ఎన్‌ఫీల్డ్ దృష్టి పెట్టనుంది.