Royal Enfield Hunter 350 Vs TVS Ronin: ధర దాదాపు ఒకటే, ఫీచర్స్‌లో భారీ తేడా - ఏ బైక్ కొనడం బెటర్?
Royal Enfield Hunter 350 Vs TVS Ronin ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి, కానీ పెర్ఫార్మెన్స్ & ఫీచర్లలో గణనీయమైన తేడాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే, మీకు ఏ బైక్ మంచిదో అర్ధమవుతుంది.

Royal Enfield Hunter 350 Vs TVS Ronin Price Features Comparison: మోటార్ సైకిళ్ల ప్రపంచంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 & టీవీఎస్ రోనిన్ నేటి యువతను బాగా ఆకట్టుకున్న బండ్లు. రెండు బైక్‌ల ధర ఒకేలా ఉంటుంది, కానీ వాటి టార్గెట్ కస్టమర్స్ మాత్రం భిన్నంగా ఉంటారు. హంటర్ 350ను క్లాసిక్ స్టైలింగ్ & స్టెడీ రైడ్‌ను ఆస్వాదించే వారి కోసం రూపొందించారు. రోనిన్, తన ఆధునిక సాంకేతికత & తేలికైన బరువు కారణంగా యువతరంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు మోటార్ సైకిళ్లలో ఏది కొనాలన్న అయోమయంలో మీరు ఉంటే, ఫీచర్లు & ధర పరంగా మీకు ఏది మంచిదో అన్వేషిద్దాం.
ధరలో ఎంత తేడా ఉంది?
తెలుగు రాష్ట్రాల్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో వేరియంట్ ₹1,37,640 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దాని టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ అయిన మెట్రో రెబెల్ ట్రిమ్ ₹1.67 లక్షల వరకు ఉంటుంది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ గుర్తింపును నిలబెట్టే కాంపాక్ట్ & సిటీకి అనుకూలమైన బైక్.
TVS రోనిన్ ₹1,24,790 నుంచి ప్రారంభమవుతుంది & దాని టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్ ₹1.59 లక్షల వరకు ఉంటుంది.
ధరల్లో పెద్దగా తేడాలు లేవనప్పటికీ, వీటి రైడింగ్ అనుభవం & పనితీరు చాలా భిన్నంగా ఉంటాయి.
పనితీరు & ఇంజిన్‌లో ఏది ముందు?
హంటర్ 350, రాయల్ ఎన్‌ఫీల్డ్ పాపులర్ J-సిరీస్ 349cc ఇంజిన్‌తో శక్తినిస్తుంది, ఇది 20.2 bhp & 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేశారు. ఈ ఇంజిన్ స్మూత్ & టార్క్ రైడ్‌కు ప్రసిద్ధి చెందింది. లాంగ్ రైడ్స్ & సౌకర్యవంతమైన క్రూజింగ్‌కు ఈ బండి సరైనది. అయితే, దీని బరువు దాదాపు 181 కిలోలు, హ్యాండిల్ చేయడం కాస్త అసౌకర్యంగా ఉంటుంది.
TVS రోనిన్ బరువు 159 కిలోలు. ఇది 225.9cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 20 bhp & 19.93 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనిని కూడా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించారు.
ఈ రెండు బైక్‌లు దాదాపు 120 km/h గరిష్ట వేగాన్ని ఇస్తాయి. కానీ.. రైడింగ్ సౌకర్యంలో హంటర్ బాగుంటుంది, సిటీ పెర్ఫార్మెన్స్‌లో రోనిన్ రాణిస్తుంది.
ఫీచర్లలో ఏది ఎక్కువ ఆధునికం?
ఫీచర్ల విషయానికి వస్తే ఈ రెండు బైక్‌లు వేర్వేరు విధానాలను కలిగి ఉన్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 సరళత & క్లాసిక్ డిజైన్‌ను కొనసాగిస్తుంది. అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ (కొన్ని వేరియంట్‌లలో), డ్యూయల్-ఛానల్ ABS, USB పోర్ట్ & LED టెయిల్ లాంప్ వంటి ముఖ్యమైన లక్షణాలను అందిస్తుంది.
TVS రోనిన్ పూర్తిగా టెక్నాలజీ-ఫోకస్డ్ బైక్. బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్ నావిగేషన్ & మల్టీ రైడింగ్ మోడ్స్ (అర్బన్ & రెయిన్) అందిస్తుంది.
మీకు ఏ బైక్ సరైనది?
క్లాసిక్ లుక్ ఉన్న దృఢమైన బైక్, లాంగ్ రైడ్స్‌లో మరింత సౌకర్యం కోరుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మీకు మంచి ఎంపిక. టెక్నాలజీలో ముందుండి, నగరంలో కూడా నడపడానికి సులభంగా ఉండాలని మీరు కోరుకుంటే, TVS రోనిన్ ఒక స్మార్ట్ ఛాయిస్ అవుతుంది.





















