iPhone 17 Pro Max ధరకే Royal Enfield Bullet 350 కి మీరు ఓనర్ కావచ్చు!
GST Reforms 2025: మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే, GST తగ్గింపు తర్వాత ఈ బైక్ కొత్త ధర గురించి తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన విషయం ఇది.

Royal Enfield Bullet 350 New Price After GST: జీఎస్‌టీ తగ్గింపు తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కొనడం మరింత సులభంగా మారింది. 350 సిసి వరకు ఉన్న బైక్‌లపై GST రేటును ప్రభుత్వం 28% నుంచి 18% కి తగ్గించింది. తత్ఫలితంగా, బుల్లెట్ 350 ధర సుమారు 8.2% లేదా రూ. 14,000 నుంచి రూ. 20,000 మధ్య తగ్గింది. కాబట్టి, మీరు ఈ పండక్కి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 కొనాలనుకుంటే, GST తగ్గింపు తర్వాత ఈ మోటారు బండి ఎంత చౌకగా ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం.
బుల్లెట్ 350 లుక్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 లుక్, క్లాసిక్ DNAని సరికొత్త శైలిలో రీడిజైన్ చేసినట్లు ఉంటుంది. మస్క్యులర్ ట్యాంక్ లైన్, స్పోక్స్‌తో కూడిన వీల్స్, తాజా హెడ్‌ల్యాంప్ డిజైన్ వంటివి ఈ బైక్‌కి అదనపు ఆకర్షణలు. డిజిటల్-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త టచ్‌ను అందిస్తోంది. బ్లాక్‌డ్-ఔట్ ఫినిష్ & క్రోమ్ ఆక్సెంట్స్ మిళితమై, పూర్తి లుక్స్ యువతను ఒక్క చూపులోనే ఆకర్షించేలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధర
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలోని షోరూముల్లో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర ఇప్పుడు రూ. 1.62 లక్షలు (Royal Enfield Bullet 350 ex-showroom price, Hyderabad Vijayawada) . ఐఫోన్ 17 ప్రో మాక్స్ (iPhone 17 Pro Max Price) కంటే ఈ బండి కొంచెం ఖరీదైనది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర ఇప్పుడు దాదాపు రూ. 1.50 లక్షలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎక్స్ - షోరూమ్ ధరకు (రూ. 1.62 లక్షలు)... రిజిస్ట్రేషన్ ఛార్జీలు దాదాపు రూ. 21,000 + బీమా దాదాపు రూ. 12,000 + ఇతర అవసరమైన ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 1.95 లక్షలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో అతి స్వల్ప తేడాతో ఇదే ఆన్-రోడ్ ధర (Royal Enfield Bullet 350 on-road price, Hyderabad Vijayawada) వర్తిస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 రేటు ఎంత తగ్గింది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మిలిటరీ బ్లాక్ / రెడ్ వేరియంట్ పాత ఎక్స్-షోరూమ్ ధర రూ . 1.76 లక్షలు & కొత్త ధర కొత్త ధర రూ. 1.62 లక్షలు కాబట్టి, ఈ వేరియంట్‌పై ఇప్పుడు (కొత్త GST తర్వాత) రూ. 13,775 ఆదా అవుతుంది. బుల్లెట్ 350 స్టాండర్డ్ (బ్లాక్) వేరియంట్ పాత ధర రూ. 2,950 తగ్గింపు తర్వాత, ఈ వేరియంట్ కొత్త ధర రూ. 1,85,000 అయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 స్టాండర్డ్ మెరూన్ వేరియంట్ కొత్త ధర రూ. 1,85,000 కాగా, బ్లాక్ గోల్డ్ వేరియంట్ కొత్త ధర దాదాపు రూ. 2,02,000.
ఇది ఏ బైక్‌లతో పోటీ పడుతుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350... Honda H'ness CB350 & CB350 RS వంటి బైక్‌లతో పోటీపడుతుంది. ఈ విభాగంలోని ఇతర బైక్‌లలో Java 42, Yezdi Roadking & BSA Gold Star 650 కూడా ఉన్నాయి.






















