అన్వేషించండి

Cheap Office Cars: ఆఫీసుకు వెళ్లడానికి 5 పర్‌ఫెక్ట్‌ బడ్జెట్‌ కార్లు, 3.49 లక్షల నుంచే! - ధర తక్కువ, దర్జా ఎక్కువ

GST రేట్లు తగ్గాక, మీ ఆఫీసు ప్రయాణానికి అందుబాటు ధర కారు కోసం చూస్తున్నారా?. మారుతి ఎస్-ప్రెస్సో నుంచి రెనాల్ట్ క్విడ్ వరకు చవకైన కార్లు ఈ కథనంలో ఉన్నాయి.

Cars Under Rs 5 Lakh After GST 2025: భారతదేశంలో ప్రతి ఒక్కరూ సొంత కారు కొనాలని కలలు కంటారు. కానీ, చాలా మంది విషయంలో ఈ కల నిజం కాకుండా అధిక ధరలు అడ్డుపడుతుంటాయి. అదృష్టవశాత్తూ, ఇప్పుడు చిన్న కార్ల మీద GST రేటు తగ్గింది, చాలా కార్లు కామన్‌ మ్యాన్‌కు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆఫీసుకు వెళ్లడం నుంచి దూర ప్రయాణాల వరకు ప్రతి అవసరానికీ సరిపోయే బడ్జెట్‌-ఫ్రెండ్లీ కార్లు ఇప్పుడు మన మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి, ఇప్పుడు వాటి ధరలు కూడా 5 లక్షల రూపాయల కంటే తక్కువే ఉన్నాయి.

1. Maruti Suzuki S-Presso 
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్‌ దేశంలోనే అత్యంత తక్కువ దర కార్లలో ఒకటి. దీని ప్రారంభ ధర కేవలం ₹3,49,900 (ఎక్స్-షోరూమ్). ఇది 66.1 bhp & 89 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. ఇది మాన్యువల్ & AMT గేర్‌బాక్స్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. డిజైన్ పరంగా... ఈ కారుకు 180mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది, దీనివల్ల నగరాల బయట & కఠినమైన రోడ్లపైన ప్రయాణించడానికి సులభంగా ఉంటుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, రెండు ఎయిర్‌ బ్యాగులు, EBDతో ABS & వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

2. Maruti Suzuki Alto K10
మారుతి ఆల్టో K10 ఎప్పుడూ మధ్య తరగతి ప్రజలకు ఇష్టమైన కారు. దీని ప్రారంభ ధర కేవలం ₹3,69,900. ఇది 65.7 bhp & 89 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. దీనిలో మాన్యువల్ & AMT ఎంపికలు రెండూ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ప్రకారం, ఆల్టో K10 లీటరుకు 33.85 కిమీ/లీ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. హైలైట్‌ ఏంటంటే, ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ సిటీ డ్రైవింగ్‌కు సరైన ఆప్షన్‌ అవుతుంది.

3. Renault Kwid
స్టైల్ & బడ్జెట్ రెండింటినీ కోరుకునే వారి కోసం పర్‌ఫెక్ట్ మ్యాచ్‌ రెనాల్ట్ క్విడ్. దీని ధర ₹4,29,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇది 67 bhp & 91 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ SCe పెట్రోల్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది. SUV లాంటి రూపం & 184 mm గ్రౌండ్ క్లియరెన్స్ దీనిని ప్రత్యేకంగా చూపిస్తాయి. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD & ట్రాక్షన్ కంట్రోల్ వంటి లక్షణాలు ఈ కారు సొంతం. దీని మైలేజ్ 22 కి.మీ./లీ వరకు ఉంటుంది.

4. Tata Tiago
మీరు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే, టాటా టియాగో ఒక ఉత్తమ ఎంపిక. దీని ప్రారంభ ధర ₹4,57,490 & దీనికి 4-స్టార్ GNCAP భద్రతా రేటింగ్ ఉంది. ఇది 84.8 bhp & 113 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. టియాగోలో ప్రీమియం ఇంటీరియర్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ వంటివి కనిపిస్తాయి. ఎక్కువ స్పేస్‌ కూడా అందిస్తుంది, ఇది ఫ్యామిలీకి సరైన కారు.

5. Maruti Suzuki Celerio 
మారుతి సుజుకి సెలెరియో ప్రారంభ ధర ₹4,69,900. ఇది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, 66.1 bhp & 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని AMT వేరియంట్ లీటరుకు 26.68 km ఇస్తుంది, డబ్బు ఆదా చేస్తుంది. సెలెరియో CNG వేరియంట్ 34.43 km/kg ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. సెలెరియోలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు & EBDతో కూడిన ABS ఉన్నాయి. దీని కాంపాక్ట్ డిజైన్ సిటీ & గ్రామీణ ప్రాంతాలలోనూ ఉపయోగపడుతుంది.

ఈ ధరలన్నీ ఎక్స్‌-షోరూమ్‌ రేట్లు. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, బీమా, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుంటే ఆన్‌-రోడ్‌ ధర వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

డ్యూక్‌ నుంచి RC వరకు ధరల బాదుడు.. KTM బైక్‌ కొంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చెల్లించాల్సిందే
మైగాడ్‌, KTM బైక్‌ కొనేవాళ్లకు షాకింగ్‌ న్యూస్‌! 7 మోడళ్ల రేట్లు అమాంతం పెరిగాయి
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
నిస్సాన్ గ్రావైట్ CNG రియల్‌ మైలేజ్‌ టెస్ట్‌.. కేజీకి ఎంత దూరం వెళ్లిందంటే?
కేవలం రూ.83,000 కే CNG కిట్.. నిస్సాన్ గ్రావైట్ నిజమైన మైలేజీ ఎంతో తెలుసా?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget