అన్వేషించండి

Rolls Royce: రోల్స్ రాయిస్ ‘ఘోస్ట్’ కొత్త ఎడిషన్ - కేవలం 25 యూనిట్లు మాత్రమే!

రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ లిమిటెడ్ ఎడిషన్ మార్కెట్లో విడుదల అయింది.

Rolls Royce Black Badge Ghost Eclipse Edition: రోల్స్ రాయిస్ తన ఘోస్ట్ సెలూన్ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. అక్టోబర్ 14వ తేదీన సంవత్సరానికి ఒకసారి పశ్చిమ అర్ధగోళంలో ఏర్పడే సూర్య గ్రహణం నుంచి ఇన్‌స్పైర్ అయి దీన్ని రూపొందించారు. రోల్స్ రాయిస్ దీనిని బ్లాక్ బ్యాడ్జ్ అని పిలుస్తోంది. ఘోస్ట్ ఎక్లిప్స్ మోడల్‌లో కేవలం 25 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది.

ప్రత్యేకతలు ఇవే...
ఘోస్ట్ ఎక్లాప్సిస్‌కు సంబంధించిన అత్యంత ప్రత్యేక ఫీచర్లలో ఒకటి ఇంటిగ్రేటెడ్ పౌడర్ కాపర్ పిగ్మెంట్‌తో కూడిన కస్టమ్ లిరికల్ కాపర్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్. ఇది బ్లాక్ అవుట్ పాంథియోన్ గ్రిల్ క్రింద మాండరిన్ కలర్ యాక్సెంట్‌లను కూడా పొందుతుంది. బ్రేక్ కాలిపర్స్, హ్యాండ్ పెయింటెడ్ కోచ్‌లైన్ కూడా మాండరిన్ కుంకుమ రంగు ఫినిషింగ్‌ను పొందుతాయి. వీటిలో అల్లాయ్ వీల్స్ తెల్లటి వాల్ టైర్లతో చుట్టి ఉంటాయి.

ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి?
ఘోస్ట్ ఎక్లిప్స్ లోపల స్టార్‌లైట్ హెడ్‌లైనర్‌ను ప్రత్యేక ఎడిషన్‌గా క్రియేట్ చేశారు. ఇది సూర్యగ్రహణాన్ని కాపీ చేసే కస్టమ్ యానిమేషన్‌ను కలిగి ఉంది. సూర్యగ్రహణానికి సంబంధించిన గరిష్ట వ్యవధికి సమానంగా సరిగ్గా 7 నిమిషాల 31 సెకన్లు ఉండేలా ఈ యానిమేషన్‌ను ప్రోగ్రామ్ చేశారు. ఇతర ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే... 0.5 క్యారెట్ డైమండ్ కూడా ఉంది. ఇది డాష్‌బోర్డ్ టైమ్‌పీస్‌లో ఉంది.

ఇంజిన్ ఎలా?
రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ కారులో 6.7 లీటర్ ట్విన్ టర్బో వీ12 పెట్రోల్ ఇంజన్‌లో అందించారు. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. నాలుగు చక్రాలకు కూడా ఈ ఇంజిన్ శక్తిని ఇవ్వనుంది. పనితీరు పరంగా వీ12 1,600 ఆర్పీఎం వద్ద 563 హెచ్‌పీ పవర్‌ని, 850 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్టాండర్డ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.95 కోట్ల నుంచి రూ.7.95 కోట్ల మధ్య ఉంది. అయితే ఈ లిమిటెడ్ ఎడిషన్ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ ఎక్లిప్సిస్ ధర దీని కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఎంత ఉండనుంది అనేది మాత్రం తెలియరాలేదు.

మరోవైపు లాంచ్ అయిన దగ్గర నుంచి, హ్యుందాయ్ ఎక్స్‌టర్ నిరంతరం రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. ఈ మైక్రో ఎస్‌యూవీ ఐదు ట్రిమ్‌లలో మార్కెట్లోకి వచ్చింది. EX, S, SX, SX (O), SX (O) Connect... మోడల్స్‌లో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో ఉంది. మార్కెట్లో దీనికి అతిపెద్ద పోటీ టాటా పంచ్ నుంచి ఎదురు అవుతోంది. ఎక్స్‌టర్ కారు ధర ఇటీవల రూ. 16,000 పెరిగింది. వేరియంట్, నగరాన్ని బట్టి హ్యుందాయ్ ఎక్స్‌టర్ వెయిటింగ్ పీరియడ్ 18 నెలల వరకు ఉంది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
District App: ‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
RS Praveen: అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Tirumala News: తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
తిరుపతి స్థానికులకు శ్రీనివాసుడి దర్శనం - టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే?
Embed widget