అన్వేషించండి

Road Trip Food Safety: హైవే జర్నీలో ఈ ఫుడ్స్ తింటున్నారా? జాగ్రత్త.. మీ ప్రయాణం కాస్తా హాస్పిటల్ పాలు కావచ్చు!

హైవే ప్రయాణాల్లో అనారోగ్యకరమైన ఆహారం వల్ల కలిగే ఇబ్బందులపై ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రయాణం సుఖమయంగా సాగాలంటే వేపుళ్లు, కట్ చేసిన పండ్లకు దూరంగా ఉండాలి.

HighwayRoad Trip Food Safety: రోడ్ ట్రిప్స్ అనగానే మనకు గుర్తొచ్చేది దారి పొడవునా ఉండే ధాబాలు, అక్కడ దొరికే రకరకాల స్నాక్స్. అయితే ప్రయాణ ఉత్సాహంలో మనం తినే ఆహారం కొన్నిసార్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సరైన ఫుడ్ ఎంచుకోకపోతే అసిడిటీ, కడుపునొప్పి లేదా విపరీతమైన నీరసం వచ్చే అవకాశం ఉంది. హైవే మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్న తరుణంలో, ప్రయాణికులు తమ ఆహారపు అలవాట్లపై కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు ఎటువంటి ఆహారానికి దూరంగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

నూనె పదార్థాలు - మసాలాలు..
హైవేలపై వేడివేడిగా దొరికే పకోడీలు, సమోసాలు, చోలే భటూరే వంటివి చూడగానే తినాలనిపిస్తుంది. కానీ ఇటువంటి అతిగా వేయించిన (Greasy) పదార్థాలు తింటే కడుపులో భారంగా అనిపించి, డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వచ్చేలా చేస్తాయి. అదేవిధంగా మితిమీరిన మసాలాలు ఉన్న ఆహారం ఖాళీ కడుపుతో తింటే అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల ప్రయాణం మధ్యలో అసౌకర్యం కలిగి అసలు మజా కోల్పోయే ప్రమాదం ఉంది.

కట్ చేసిన పండ్లు - పానీయాలు..
రోడ్డు పక్కన బండ్ల మీద అప్పటికప్పుడు కట్ చేసి అమ్మే పండ్లను తినడం అస్సలు సురక్షితం కాదు. అవి చూడటానికి తాజాగా అనిపించినా, వాటిపై పడే దుమ్ము, కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. పండ్లను ముందే కట్ చేయకుండా, నేరుగా తొక్క తీసి తినగలిగే వాటిని లేదా ప్యాక్ చేసిన పండ్లను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే కూల్ డ్రింక్స్, సోడాల వంటి చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు తాగితే వెంటనే ఎనర్జీ వచ్చినట్లు అనిపించినా, కొద్దిసేపటికే బాడీ డీహైడ్రేషన్ కు గురై నీరసం వస్తుంది. వీటికి బదులుగా సాధారణ నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలు తీసుకోవడం మేలు.

డైరీ ఉత్పత్తులు - ప్రాసెస్డ్ ఫుడ్..
లస్సీ, మజ్జిగ లేదా పన్నీర్ తో చేసిన వంటకాలు తినేటప్పుడు హైజీన్ చెక్ చేసుకోవాలి. ఎండ వేడికి ఇవి త్వరగా పాడైపోతాయి. సరిగ్గా నిల్వ చేయని డైరీ ఉత్పత్తులు తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సరిగ్గా ఉడకని మాంసం లేదా మళ్ళీ మళ్ళీ వేడి చేసిన ఆహారం వల్ల హానికర బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. వీలైనంత వరకు అప్పటికప్పుడు వండిన వేడి భోజనాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

అతిగా తినడం వల్ల కూడా డ్రైవింగ్ పై ఏకాగ్రత తగ్గుతుంది. ప్రయాణంలో లైట్ గా ఉండే ఆహారం తీసుకుంటే అలసట లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. మీరు సుదూర ప్రాంతాలకు ఒంట‌రిగా వెళ్తున్నా లేదా ఫ్యామిలీతో కారులో వెళ్తున్నా ఈ ఫుడ్ టిప్స్ పాటించడం చాలా ముఖ్యం. చిన్నపాటి ఆహార జాగ్రత్తలు మీ రోడ్ ట్రిప్ ను మధుర జ్ఞాపకంగా మార్చుతాయని విశ్లేష‌కులు అంటున్నారు. ఏదేమైనా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల లాండ్ డ్రైవ్స్ మరింత మధురంగా మిగిలి పోతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget