అన్వేషించండి

6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజ్‌.. Maruti Suzuki Baleno Facelift అతి తక్కువ ధరకే.. త్వరలో మార్కెట్లోకి

Maruti Baleno Facelift: మారుతి బలెనో అల్లాయ్ వీల్స్, బాడీ డిజైన్‌లోనూ పలు మార్పులు ఉండనున్నాయి. 6 ఎయిర్ బ్యాగ్స్, 30 కి.మీ మైలేజీతో త్వరలో భారత్‌లో లాంచ్ కాబోతోంది.

ప్రస్తుతం భారత ఆటో మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో నిరంతరం కొత్త అప్‌డేట్స్, ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ వస్తున్నాయి. దాంతో వినియోగదారులకు మెరుగైన డిజైన్, మరిన్ని ఫీచర్లు, మంచి మైలేజ్ అందించడమే కార్ల కంపెనీల ప్రధాన ఉద్దేశ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మారుతి సుజుకి బలెనో (Maruti Suzuki Baleno) కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో అనేక కొత్త మార్పులు, అప్‌డేట్స్ ఉంటాయని వాహనదారులు భావిస్తున్నారు. ఈ కారు ఇప్పటికే తన సెగ్మెంట్‌లో చాలా పాపులర్‌. ఇప్పుడు కంపెనీ దీనిని మరింత మెరుగుచేసి ఫేస్‌లిఫ్ట్ రూపంలో రావడానికి సిద్ధమవుతోంది.

మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు దాని డిజైన్‌లో కనిపించవచ్చు. కారు ఎక్స్‌టీరియర్ మునుపటి కంటే మరింత మోడ్రన్‌గా మరియు స్టైలిష్‌గా రూపొందించబడుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేట్ చేసిన  బంపర్, LED లైట్ల వంటి మార్పులు ఉండవచ్చు. దీనివల్ల కారు లుక్ మరింత ఆకర్షణీయంగా,  ప్రీమియంగా కనిపిస్తుంది. ఇవి కాకుండా అల్లాయ్ వీల్స్, బాడీ డిజైన్‌లో కూడా పలు మార్పులు చూడవచ్చు. ఇది దీని ఓవరాల్ రోడ్ ప్రెజెన్స్‌ను మెరుగుపరుస్తుంది.

కొత్త మారుతి బలెనో ఇంటీరియర్ ఎలా ఉంటుంది?
ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త బలెనోలో పలు మార్పులు చేయనుంది. కేబిన్‌ను మరింత ప్రీమియంగా మార్చడానికి నాణ్యత కలిగిన మెటీరియల్, కొత్త డిజైన్ ఇవ్వవచ్చు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు  డిజిటల్ డిస్‌ప్లే వంటి అప్‌డేట్స్ లభిస్తాయని భావిస్తున్నారు. దీంతో పాటు డ్రైవర్, ప్యాసింజర్లకు కంఫర్టబుల్‌గా ఉండేలా సీటింగ్,  స్పేస్‌ను కూడా మెరుగ్గా ఇవ్వనుంది.

ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో భద్రత (Safety), టెక్నాలజీ రెండింటిపై ఫోకస్ పెంచారు.  ఉదాహరణకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ ఫీచర్లు లభిస్తాయని అంచనా వేశారు. దీనివల్ల కారు గతంలో  కంటే మరింత సురక్షితంగా,  స్మార్ట్‌గా మారుతుంది.

మారుతి బలెనో పవర్‌ట్రెయిన్
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్ విషయంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం తక్కువ. నివేదికల ప్రకారం, ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ రావొచ్చు. గతంలో మోడల్ లాగే మంచి మైలేజ్, స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. దీంతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండూ లభించవచ్చు.

బెస్ట్ మైలేజ్ కార్లలో ఒకటి

మైలేజ్ విషయంలో కూడా ఈ కారు తన ప్రత్యేకతను చాటుకుంటుంది. పెట్రోల్ వేరియంట్‌లో దాదాపు లీటరుకు 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు మైలేజ్ లభిస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే CNG వేరియంట్‌లో మైలేజీ ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల రోజువారీ అవసరాలకు ఈ కారు ఎంతో పొదుపైనదిగా, మీ ఖర్చులు తగ్గించేదిగా ఉండనుంది. 

ధర, లాంచింగ్ వివరాలు..
మారుతి కంపెనీ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీని ప్రారంభ ధర సుమారు రూ. 6.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ధర ఆయా రాష్ట్రాలు, నగరాల్లో వేర్వేరుగా ఉంటుందని తెలిసిందే. 2026లోనే మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయవచ్చని సమాచారం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
కొత్త SUVల దెబ్బకు పడిపోతుందన్నారు.. కానీ ఈ కారు జోరు తగ్గలేదు, ఇప్పటికీ టాప్‌ ప్లేస్‌!
5,600 కి.మీ. నడిచిన Hero Xpulse 210.. డైలీ జర్నీలో ఈ బండిలో బయటపడిన మైనస్‌లు ఏంటి?
Wagon R CNGతో కిలో గ్యాస్‌తో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేయవచ్చు? సిటీ, హైవే మైలేజ్ వివరాలు ఇవిగో
Maruti Wagon R CNG నిజంగా ఎంత మైలేజ్ ఇస్తుంది? రియల్ వరల్డ్ టెస్ట్‌లో వచ్చిన ఫలితం ఇదే!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget