అన్వేషించండి

Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!

Ola Electric Offer: పండగ సందర్భంగా ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ ఆఫర్‌ను అందించింది. ఓలా స్కూటర్లపై ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపును అందించనున్నారు.

Navaratri-Diwali Offer On Electric Scooter: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఈ పండుగను ప్రజలతో కలిసి జరుపుకునేందుకు పలు బైక్‌లు, స్కూటర్ల తయారీ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. ఈ నవరాత్రి పండుగల ఉత్సాహంతో ఓలా తన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కూడా తగ్గించింది. రూ.75,000 ఉన్న ఓలా స్కూటర్ ధర ఏకంగా రూ.25 వేలు తగ్గింది. దీంతో ఇప్పుడు ఈ బైక్ ధర రూ.49,999 నుంచి ప్రారంభం కానుంది.

ఓలా సీజన్ సేల్ ఆఫర్
ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సీజన్ సేల్ ఆఫర్‌ను అక్టోబర్ 2వ తేదీన ప్రకటించారు. ఈ ఆఫర్ అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుందని భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఎస్1 అనేది ప్రముఖ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇప్పుడు రూ.49,999 నుంచి ప్రారంభం అవుతుంది.

ఏకంగా రూ.25 వేలు తగ్గింపు
అక్టోబర్ 2వ తేదీ రాత్రి వరకు ఓలా ఎస్1 ప్రారంభ ధర రూ.74,999గా ఉంది. ఇప్పుడు ఈ ఈవీ ప్రారంభ ధర రూ.25,000 తగ్గింది. ఈ ఆఫర్ నవరాత్రి నుంచి దీపావళి వరకు అందుబాటులో ఉండనుంది. మార్కెట్లో ఓలా ఎస్1కు సంబంధించి అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. నవరాత్రి దీపావళి ఆఫర్‌తో ఈ ఈవీ ధర రూ. 50,000 కంటే తక్కువకు వచ్చింది.

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే

ఓలా ఎస్1ఎక్స్ (Ola S1x)
ఓలా ఎస్1ఎక్స్X మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 95 కిలోమీటర్ల రేంజ్‌ను, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 151 కిలోమీటర్ల రేంజ్‌ని, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 193 కిలోమీటర్ల రేంజ్‌ని అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్1ఎక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.74,999 నుంచి ప్రారంభమవుతుంది.

ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air)
ఓలా ఎస్1 ఎయిర్ 6 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్టిఫైడ్ రేంజ్ 151 కిలోమీటర్లుగా ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,07,499 నుంచి ప్రారంభం అవుతుంది.

ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)
ఓలా ఎస్1 ప్రో 11 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 195 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఈవీ గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. ఆఫర్‌కు ముందు ఓలా ఎస్1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర ప్రారంభ ధర రూ.1,34,999గా ఉండేది.

Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

 

టాప్ హెడ్ లైన్స్

Skoda Slavia vs Honda City: కంపెనీ ప్రకటించిన మైలేజ్‌ ఈ కార్లు నిజంగా ఇస్తున్నాయా? ఒరిజినల్‌ కెపాసిటీ ఎంత?
స్కోడా స్లావియా vs హోండా సిటీ: ఏ కారు మైలేజ్ ఎక్కువ? రియల్ వరల్డ్ ఫలితాలు ఇవే!
Renault Duster, Kiger, Triber, Kwid కార్లపై రూ.2.10 లక్షల వరకు డిస్కౌంట్లు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?
రెనాల్ట్‌ డస్టర్‌ మీద రూ.2.10 లక్షలు, క్విడ్‌ మీద రూ.40,000 వరకు తగ్గింపు.. ఇంకొన్ని రోజులే!
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Engine Warm Up: పెట్రోల్, డీజిల్, CNG కార్లను నడిపే ముందు ఎంత సేపు ఆన్‌లో ఉంచాలి? కంపెనీలు ఏం చెబుతున్నాయి?
చలికాలంలో కారును స్టార్ట్ చేసిన వెంటనే డ్రైవ్ చేయొచ్చా? ఇంజిన్‌ వేడెక్కేవరకు వెయిట్‌ చేయాలా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Tragedy Story: బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Cashews For Health : జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Embed widget