Toyota Maruti SUV: లీటర్‌కు 20 కిలోమీటర్లకు పైగా మైలేజ్ - అదిరిపోయే ఫీచర్లు - కలిసి కార్లు రూపొందిస్తున్న మారుతి, టొయోటా!
హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌లకు పోటీగా మారుతి, టొయోటా కొత్త కార్లు లాంచ్ చేయనున్నాయి.
హోండా సిటీ హైబ్రిడ్ కారును ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు పెట్రోల్ రేట్లు కూడా ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. త్వరలో టొయోటా, మారుతి బ్రాండ్లు కలిసి రెండు కొత్త ఎస్‌యూవీలను మనదేశంలో లాంచ్ చేయనున్నాయి.
ఈ రెండూ కలిసి దీన్ని డిజైన్ చేసినా... వీటి ఉత్పత్తి మాత్రం బెంగళూరులోని టొయోటా ప్లాంట్‌లో జరగనుంది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్‌కి పోటీగా ఈ హైబ్రిడ్ కార్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ రెండు ఎస్‌యూవీల పొడవు నాలుగు మీటర్లకు పైగానే ఉండనుంది. వీటిలో టొయోటా ఎడిషన్ ముందు, మారుతి ఎడిషన్ తర్వాత లాంచ్ కానున్నాయని సమాచారం.
వీటి స్టైలింగ్ కూడా కొత్తగా ఉండనుంది. స్కోడా కుషాక్/ఫోక్స్‌వాగన్ టైగున్ తరహా లుక్‌ను ఈ ఎస్‌యూవీ కార్లకు అందించనున్నట్లు సమాచారం. 17 అంగుళాల వీల్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త తరహా గ్రిల్ డిజైన్‌లు ఈ కార్లలో ఉండనున్నాయి. ముందువైపు, వెనకవైపు బంపర్ డిజైన్ కూడా వినూత్నంగా ఉండనున్నట్లు సమాచారం.
అయితే ఈ రెండు కార్ల ఇంటీరియర్లు దాదాపు ఒకేలా ఉండనున్నాయి. 9 అంగుళాల టచ్ స్క్రీన్, సన్‌రూఫ్, కూల్డ్ సీట్లు, హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీల వ్యూ ఉన్న కెమెరా, ప్రీమియం ఆడియో సిస్టం ఇందులో ఉండనున్నాయి. ఇవి రెండూ బలమైన హైబ్రిడ్ కార్లుగా లాంచ్ కానున్నాయి.
ఈ ఎస్‌యూవీల్లో 1.5 లీటర్ల ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. పవర్‌ను పెంచడానికి చిన్న బ్యాటరీ ప్యాక్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించనున్నారు. ఇవి సెల్ఫ్ చార్జింగ్ బ్యాటరీ ప్యాక్‌తో రానున్నాయి. అంటే వీటికి ప్రత్యేకంగా చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదన్న మాట.
ఈ కార్ల మైలేజ్ 20 కిలోమీటర్లకు పైగా ఉండనుంది. ఆయా విభాగాల్లో ఇవే ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలు కానున్నాయి. వీటిని జులైలో ఆయా కంపెనీలు రివీల్ చేసే అవకాశం ఉన్నాయి. వీటితో స్మార్ట్ హైబ్రిడ్ 1.5 లీటర్ ఆప్షన్‌తో మరో ఎంట్రీ లెవల్ వేరియంట్ కూడా రానుంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?