By: ABP Desam | Updated at : 10 Nov 2021 04:43 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
కొత్త మారుతి విటారా బ్రెజా
కొత్త జనరేషన్ విటారా బ్రెజా వచ్చే సంవత్సరం మార్కెట్లోకి రానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రెజాతో పోలిస్తే.. ఇది పూర్తిగా కొత్త మోడల్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రెజా చాలా కాలం నుంచి మార్కెట్లో ఉంది. గత సంవత్సరం ఇందులో పెట్రోల్ ఇంజిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.
ఈ కొత్త జనరేషన్ విటారా బ్రెజాలో తేలికైన హార్టెక్ట్ ప్లాట్‌ఫాంను అందించారు. ప్రస్తుతం మారుతి కార్లు అన్నిటిలో ఇదే అందుబాటులో ఉంది. త్వరలో లాంచ్ కానున్న మారుతి సుజుకి సెలెరియోలో కూడా ఇదే ఉండనుంది. దీని బరువు తక్కువగా ఉండనుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బ్రెజా కంటే కొంచెం కొత్తగా ప్రీమియం లుక్‌తో ఈ కార్ లాంచ్ కానుంది.
కారు పొడవు అలాగే ఉండనుంది. ఇందులో కొత్త గ్రిల్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉండనున్నాయి. అయితే ఎస్‌యూవీ తరహా లుక్ మాత్రం అలాగే ఉండనుంది. ఇందులో 17 అంగుళాల అలోయ్ వీల్స్ ఉండనున్నాయి. ఇంటీరియర్ కూడా పూర్తిగా కొత్త తరహాలో ఉండనుంది.
ఇందులో స్మార్ట్ ప్లే స్టూడియో ఇన్‌ఫోటెయిన్ మెంట్ సిస్టం ఉండనుంది. పెద్ద యూనిట్, కొత్త ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. కనెక్టెడ్ టెక్, సన్‌రూఫ్, వెనకవైపు ఏసీ వెంట్స్ ఇలా మంచి ప్రీమియం లుక్‌తో ఈ కార్ లాంచ్ కానుంది. వీల్ బేస్ కూడా కొంచెం పెద్దగా ఉంది.
అయితే కొత్త బ్రెజాలో డీజిల్ వేరియంట్ ఉండబోదని, కేవలం పెట్రోల్ ఇంజిన్ మాత్రమే అందించనున్నారని తెలుస్తోంది. ఇందులో 6-స్పీడ్ ఆటో వేరియంట్ ఉండనుందని సమాచారం. మరింత మెరుగైన సామర్థ్యం కోసం, ఇందులో పెద్ద మైల్డ్ హైబ్రిడ్ సిస్టం ఉండనుంది. దీని మైలేజ్ కూడా మెరుగ్గా ఉండనుంది. వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో కొత్త మారుతి విటారా బ్రెజా కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!
Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?
Honda Activa Electric: యాక్టివా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Tata Punch EV: టాటా పంచ్ ఈవీ లాంచ్ డేట్ ఇదే - ఈ నెలలోనే ఎంట్రీ - ఫీచర్లు ఇలా!
Car Sales Report November: నవంబర్‌లో ఏ కంపెనీ విక్రయాలు ఎలా ఉన్నాయి? - హోండా, కియా పెర్ఫార్మెన్స్ పరిస్థితి ఏంటి?
What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది ?
Bandlagooda Private School: ప్రైవేట్ స్కూల్ అత్యుత్సాహం - అయ్యప్ప మాల ధరించిన బాలికను అనుమతించని యాజమాన్యం
Chittoor District News: చిత్తూరు జిల్లా ప్రజలను వణికిస్తున్న ఏనుగుల గుంపు- కుప్పంలో హై అలర్ట్
Nelson Dilipkumar: రజనీకాంత్‌ను అలా చూపించొద్దన్నారు, భయమేసినా వెనక్కి తగ్గలేదు: ‘జైలర్’ దర్శకుడు నెల్సన్
/body>