New Hyundai Venueలో అప్‌గ్రేడ్ ఫీచర్లు, లాంచ్ డేట్ ఫిక్స్ - మునుపటి కంటే ఏం మారుతుందో తెలుసా?
Next-Gen Hyundai Venue: కొత్త హ్యుందాయ్ వెన్యూలో ఫీచర్ల పరంగా చాలా అప్‌గ్రేడ్స్ ఉండవచ్చు. కచ్చితంగా చెప్పాలంటే, ఈ SUV మరిన్ని హైటెక్ ఫీచర్లతో వస్తుంది.

New Hyundai Venue 2025 Price And Features In Telugu: హ్యుందాయ్ ఇండియా, నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ వెన్యూ లాంచ్ తేదీని వెల్లడించింది. ఈ వాహనం చాలా కాలంగా టెస్టింగ్‌లో ఉంది, కొత్త ఫీచర్లపై ప్రజల్లో ఆసక్తిని పెంచింది. చాలా కాలం ఊరించిన తర్వాత, ఎట్టకేలకు, ఈ పాపులర్ SUV 24 అక్టోబర్ 2025న (New Hyundai Venue 2025 Launch date) భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూ.. Maruti Brezza, Tata Nexon, Kia Sonet & Mahindra XUV 3XO వంటి డిమాండ్ ఉన్న SUVలతో పోటీ పడుతుంది.
కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ ఎలా ఉంటుంది?
కొత్త హ్యుందాయ్ వెన్యూ 2025 లుక్స్‌లో చెప్పుకోదగిన మార్పులు చేశారు. కీలకంగా గమనించాల్సిన విషయం - క్వాడ్-LED హెడ్‌ల్యాంప్‌లు & కనెక్టెడ్ DRLs. ప్రస్తుత హ్యుందాయ్ క్రెటా ప్రేరణతో వీటిని కొత్త వెన్యూలోకి తీసుకున్నారు. హెడ్‌ల్యాంప్ కింద L-ఆకారపు LED లైట్లు అందించారు, ఇది ఈ SUV కి ప్రీమియం అపీల్ ఇస్తుంది. దీనితో పాటు, కొత్తగా రూపొందించిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, మందపాటి వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఫ్లాట్ విండో లైన్ & పొడవైన రియర్ స్పాయిలర్ వంటి అప్‌డేట్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ, వెన్యూ స్టైల్‌ను ప్రస్తుత రూపం కంటే స్పోర్టియర్‌గా కనిపించేలా చేస్తుంది.
ఫీచర్లలోనూ భారీ అప్‌గ్రేడ్స్!
New Hyundai Venue 2025 ఫీచర్ల పరంగా పెద్ద అప్‌గ్రేడ్‌ను చూడవచ్చు. ఇప్పుడు, ఈ SUV లెవల్-2 ADAS టెక్నాలజీతో మరింత హైటెక్‌గా వస్తుంది, ఇది డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా & స్మార్ట్‌గా మారుస్తుంది. నాలుగు డిస్క్ బ్రేక్‌లు & ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా యాడ్ అయ్యాయి, ఇవి బ్రేకింగ్ పనితీరు & పార్కింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ప్రస్తుత వెన్యూలో లెవల్-1 ADAS మాత్రమే ఉంది, కాబట్టి ఈ అప్‌డేట్ చాలా ముఖ్యమైనది. అయితే, క్యాబిన్ ఫీచర్ల పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఇప్పటి వరకు ఉన్న లీక్స్‌ను బట్టి... హ్యుందాయ్ క్రెటా & అల్కాజార్‌లోని అనేక ప్రీమియం & అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కొత్త క్రెటాలోకి తీసుకుంటారని భావిస్తున్నారు.
హ్యుందాయ్ వెన్యూ ఇంజిన్
కొత్త హ్యుందాయ్ వెన్యూ అనేది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కాబట్టి దీని పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పులు ఉండవు. మునుపటిలాగే, ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.
మునుపటి నమ్మకమైన ఇంజిన్ & మోడ్రన్ ఫీచర్ల కలయికతో ఈ ఫోర్‌వీలర్ తన కస్టమర్లకు ప్రీమియం ఫీల్‌ను, మెరుగైన పనితీరును అందించగలదు.





















