అన్వేషించండి

160 km రేంజ్‌, 56 లీటర్ల స్టోరేజ్‌తో Ather Rizta – బుకింగ్ కేవలం ₹10 వేలకే!, EMI ఎంత కట్టాలంటే?

Ather Rizta Loan &EMI Plans: ఏథర్ రిజ్టా, కుటుంబానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌లు & 56 లీటర్ల స్టోరేజ్‌ స్పేస్‌తో ప్రయోజనకరంగా ఉంటుంది.

Ather Rizta Price, Range And Features In Telugu: ఏథర్ రిజ్టా లుక్స్‌ చాలా ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తూ రోడ్డు మీద ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముందు భాగంలో ఉన్న షార్ప్‌ LED హెడ్‌ల్యాంప్స్‌ దానికి అగ్రెసివ్‌ లుక్‌ ఇస్తాయి. స్కూటర్‌లోని స్లీక్‌ బాడీ లైన్స్‌ & పెద్దగా ఉండే సీటు డిజైన్‌ రైడర్‌కి ప్రీమియం స్కూటర్‌ను నడుపుతున్న అనుభూతిని ఇస్తాయి. కలర్‌ ఆప్షన్లు & ఫినిషింగ్‌ క్వాలిటీ చూస్తే ఇది నిజంగా ఒక గల్జరీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అనిపిస్తుంది. మీరు స్టైలిష్, అందుబాటు ధర & ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఏథర్ రిజ్టా మీ ఆలోచనలకు చక్కగా సరిపోవచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో, Ather Rizta ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.15 లక్షల (Ather Rizta ex-showroom price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభం అవుతుంది. మీరు కేవలం రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ బండిని ఫైనాన్స్‌లో తీసుకోవచ్చు.

ఆన్-రోడ్ ధర & ఫైనాన్స్‌ ప్లాన్‌
హైదరాబాద్‌లో, ఏథర్ రిజ్టా బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు 1.25 లక్షలు. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు 1.24 లక్షలు. ఆన్-రోడ్ ధరలో RTO ఛార్జీలు & బీమా, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. మీరు, విజయవాడలో డౌన్ పేమెంట్ గా 10,000 చెల్లిస్తే, మిగిలిన 1.14 లక్షలను బ్యాంకు నుంచి లోన్‌ తీసుకోవచ్చు. రుణం పొందడానికి, వడ్డీ రేటు నిర్ణయించడానికి మీ క్రెడిట్ స్కోరు బాగా ఉండాలి. ఉదాహరణకు, బ్యాంక్ మీకు 9% వడ్డీ రేటుతో లోన్‌ మంజూరు చేసిందనుకుందాం. 

4 సంవత్సరాల కోసం లోన్‌ తీసుకుంటే, మీ EMI నెలకు రూ. 3,186 అవుతుంది. ఈ 48 నెలల్లో మీరు మొత్తం వడ్డీగా రూ. 40,494 చెల్లించాలి.

3 సంవత్సరాల కోసం రుణం మంజూరైతే, మీ EMI నెలకు రూ. 3,966 అవుతుంది. ఈ 36 నెలల్లో మీరు మొత్తం వడ్డీగా రూ.  30,342 చెల్లించాలి.

2 సంవత్సరాల టెన్యూర్‌ ఎంచుకుంటే, మీ EMI నెలకు రూ. 5,528 అవుతుంది. ఈ 24 నెలల్లో మీరు మొత్తం వడ్డీగా రూ. 20,238 చెల్లించాలి.

1 సంవత్సరంలో లోన్‌ తీర్చాలంటే, మీ EMI నెలకు రూ. 10,213 అవుతుంది. ఈ 12 నెలల్లో మీరు మొత్తం వడ్డీగా రూ. 10,122 చెల్లించాలి.

బ్యాటరీ & పరిధి
ఏథర్ రిజ్టా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది, అవి - 2.9 kWh & 3.7 kWh. 2.9 kWh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 123 కి.మీ. & 3.7 kWh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 160 కి.మీ. రేంజ్‌ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది & కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గ్రేడబిలిటీ 15 డిగ్రీలు, ఏటవాలుగా ఉన్న రోడ్డును సులభంగా ఎక్కగలదు. & ఇది 400 మి.మీ. వరకు నీటిలో కూడా ప్రయాణించగలదు.

భద్రత & ఫీచర్లు
ఏథర్ రిజ్టా ఒక మోడ్రన్‌ స్కూటర్‌, దీనిలో చాలా అధునాతన ఫీచర్లు లభిస్తాయి. వేరియంట్‌ను బట్టి ఇది 7-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేతో వస్తుంది, ఇది బ్లూటూత్, నావిగేషన్ & స్మార్ట్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఈ డిస్‌ప్లే వాట్సాప్ నోటిఫికేషన్‌లు & లైవ్ లొకేషన్ ట్రాకింగ్‌ను కూడా చూపిస్తుంది. ఇతర ఫీచర్లలో... మ్యాజిక్ ట్విస్ట్, మల్టీ-డివైస్ ఛార్జర్ & మొత్తం 56 లీటర్ల నిల్వ స్థలం (సీటు కింద 34 లీటర్లు & ముందు ట్రంక్ 22 లీటర్లు) ఉన్నాయి. ఇది కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ను కలిగి ఉంది, ఇది రైడర్‌ భద్రతను పెంచుతుంది. 

రిజ్టా ఆన్-రోడ్ ధర, లోన్ మొత్తం & EMI వంటివి మీ నగరం, వేరియంట్ & బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి. ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు ఖచ్చితంగా మీ సమీప డీలర్ & బ్యాంకు నుంచి సమాచారం పొందండి.

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget