New Honda Amaze: మోస్ట్ అవైటెడ్ కొత్త అమేజ్ వచ్చేసింది - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Honda Amaze 2024: కొత్త హోండా అమేజ్ కారు మనదేశంలో లాంచ్ అయింది. దీని ఎక్స్ షోరూం ధర మనదేశంలో రూ.7.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. మూడు వేరియంట్లలో ఈ కారు కొనవచ్చు.
Honda Amaze Launched in India: హోండా కార్స్ ఇండియా భారతదేశంలో అప్‌డేట్ చేసిన అమేజ్ కారును విడుదల చేసింది. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ.7.99 లక్షలుగా ఉంచారు. ఈ అప్‌డేటెడ్ సెడాన్ మూడు వేరియంట్లలో, ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ కారులో అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లను కూడా చేర్చింది.
హోండా అమేజ్ ఆటోమేటిక్ సీవీటీ వేరియంట్ ధర రూ. 9.19 లక్షల నుంచి ప్రారంభం కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 10.89 లక్షలుగా ఉంది. ఇందులో మీరు ఆరు కలర్ ఆప్షన్లు, మూడు వేరియంట్‌లను పొందుతారు. కొత్త తరం అమేజ్ సిటీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే స్టైలింగ్‌లో ఎలివేట్... సిటీ నుంచి ప్రేరణ పొందింది.
Also Read: సింగిల్ ట్యాంక్ ఫుల్‌తో 1000 కిలోమీటర్లు నడిచే టాప్ 5 కార్లు - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయి?
హోండా అమేజ్ లుక్, డిజైన్
హోండా అమేజ్ లుక్, డిజైన్ పరంగా చాలా అప్‌డేట్ అయింది. కంపెనీ కారు కొలతలను కూడా మార్చింది. కారు కొలతలు కూడా కొద్దిగా మారాయని కంపెనీ పేర్కొంది. ఈ కారు మునుపటి తరం మోడల్ కంటే వెడల్పుగా మారింది. ఇది కాకుండా హోండా అమేజ్ 416 లీటర్ల టాప్ క్లాస్ బూట్ స్పేస్‌ను అందిస్తుంది.
కొత్త హోండా అమేజ్‌లో కంపెనీ 1.2 లీటర్ సామర్థ్యం గల 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ 90 పీఎస్ పవర్, 110 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి రానుంది.
కొత్త హోండా అమేజ్ మాన్యువల్ వేరియంట్ 18.65 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వేరియంట్ 19.46 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. హోండా అమేజ్ ఇంటీరియర్ కూడా అప్‌డేట్ అయింది. ఈ కారు ఏడు అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఎనిమిది అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
Honda Cars India Ltd. (HCIL) launched its much-awaited #AllNewHondaAmaze. This 3rd-generation sedan has been designed to offer an outclass premium experience with its elegant design, plush & spacious cabin and ADAS tech, making it the most affordable ADAS enabled car of India. pic.twitter.com/mibm7kGPXZ
— Honda Car India (@HondaCarIndia) December 4, 2024
Witness segment-first features that are a class above. Presenting the all-new Honda Amaze that's #HereToOutclass.#HondaCarsIndia #HondaCars #AllNewAmaze
— Honda Car India (@HondaCarIndia) December 4, 2024
Know more: https://t.co/5EjMhbNTSw
(1/2) pic.twitter.com/P2sXVvlLsV