అన్వేషించండి

Hero Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ గురూ - పెట్రోల్‌ బండి కంటే రేటు తక్కువ, రేంజ్‌ ఎక్కువ!

Vida VX2 Launch Date: హీరో సబ్-బ్రాండ్ Vida, తన కొత్త స్కూటర్ VX2ను జులై 1న లాంచ్‌ చేయబోతోంది. ఈ బండికి సంబంధించి ఈ కంపెనీ చాలా టీజర్‌లు విడుదల చేసింది.

Vida VX2 Electric Scooter Price Range And Features: ప్రస్తుతం, ఇండియన్‌ మార్కెట్‌లో, ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (EVs) ట్రెండ్‌ నడుస్తోంది. 'హీరో మోటోకార్ప్' ఎలక్ట్రిక్ సబ్-బ్రాండ్ 'విడా' కూడా పూర్తి సన్నాహాలతో ఈ రేసులో పాల్గొంటోంది. ఈ కంపెనీ, తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడా VX2 ను రేపు (మంగళవారం, జులై 1, 2025‌) మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఈ లాంచ్‌కు ముందే, విడా, తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ నుంచి అనేక టీజర్లను విడుదల చేసింది, ఈ స్కూటర్‌లో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయన్న విషయంపై ఒక ఓవర్‌లుక్‌ అందించింది.

Vida VX2 లో మొదట చెప్పుకోవాల్సిన విషయం - ఈ స్కూటర్‌ చాలా వేరియంట్లలో లాంచ్‌ కాబోతోంది & ప్రారంభ ధర పెట్రోల్ స్కూటర్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. 

మూడు రంగుల్లో విడా VX2 
విడా కంపెనీ, VX2 ను మూడు ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల చేస్తోంది, అవి - నలుపు, తెలుపు & ఎరుపు. యంగ్‌ కస్టమర్లను & స్టైలింగ్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టే వాళ్లను ఆకర్షించడానికి ఈ కలర్స్‌ ఎంచుకున్నారు. ఈ మూడు రంగుల లుక్‌ ఎలా ఉంటుందన్నది సోషల్ మీడియాలో విడుదలైన టీజర్‌లలో కనిపించింది.

డ్రమ్ & డిస్క్ బ్రేక్ వేరియంట్లు 
విడా VX2 లో భద్రతపైనా ఫోకస్‌ పెట్టారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్ల ఆధారంగా, ఈ స్కూటర్‌లో ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ & డిస్క్ బ్రేక్ ఆప్షన్స్‌ రెండూ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఈ లెక్కన, విడా VX2 చాలా వేరియంట్లలో విడుదల అవుతుందని, బేస్ మోడల్‌లో డ్రమ్ బ్రేక్ & టాప్ వేరియంట్‌లో డిస్క్ బ్రేక్ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు.

విడా VX2 ప్రో, ప్లస్, గో 
విడా కంపెనీ.. VX2 PRO, VX2 PLUS & VX2 GO వంటి పేర్ల కోసం ట్రేడ్‌మార్క్‌లను దాఖలు చేసింది. దీని అర్థం ఈ వేరియంట్‌లలో బ్యాటరీ పరిమాణం, మోటారు శక్తి, పరిధి & వేగంలో తేడాలు ఉండవచ్చు. కస్టమర్లకు, తమ అవసరాలు & బడ్జెట్ ప్రకారం వీటిలో ఒక ఆప్షన్‌ ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది.

విడా వీఎక్స్2 ధర 
విడా VX2 రేటు, ప్రస్తుతం ఉన్న విడా V2 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. రిపోర్ట్స్‌ ప్రకారం, విడా VX2 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 70,000 వరకు ఉండవచ్చు, ఇది భారత మార్కెట్లో అత్యంత తక్కువ ధర ఉన్న బ్రాండెడ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తుంది. ఫుల్‌ ఛార్జ్‌తో దీని రేంజ్‌ ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది.

ఏ బండ్లకు పోటీగా వస్తోంది?
భారతదేశంలో ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు Ather Rizta, Bajaj Chetak 3001, TVS iQube, Ola S1X & Honda QC1 EVలకు పోటీగా Vida VX2 రంగంలోకి దిగుతోంది. విడా VX2 ధర తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది మార్కెట్‌లో చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget