అన్వేషించండి

కొత్త Mahindra Bolero నుంచి Thar వరకు - ఈ 6 కొత్త కార్లు ఈ నెలలోనే లాంచ్‌, ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో

పండుగ సీజన్ సందర్భంగా కార్ కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు & కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. Mahindra, Nissan, Skoda & Citroen నుంచి ఆరు కొత్త కార్లు అక్టోబర్ 2025లో లాంచ్‌ అవుతున్నాయి.

New Car Launches October 2025: GST తగ్గింపులు & పండుగ సీజన్ డిమాండ్ కారణంగా కార్ల అమ్మకాలు హై-స్పీడ్‌తో పెరిగాయి. ఈ అవకాశాన్ని అందుకోవడానికి ఆటోమొబైల్‌ కంపెనీలు కస్టమర్ల కోసం కొత్త & అప్‌డేటెడ్‌ మోడళ్లను పరిచయం చేస్తున్నాయి. ఈ నెలలో (అక్టోబర్ 2025) కొన్ని పవర్‌ఫుల్‌ మోడళ్లు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లపైకి వస్తాయి. వాటిలో Mahindra, Nissan, Skoda, Citroen & Mini  వంటి ప్రముఖ కంపెనీల వాహనాలు ఉన్నాయి.

అక్టోబర్ 2025 న్యూ లాంచ్‌లు:

Mahindra Bolero & Bolero Neo (2025 Update)
మహీంద్రా బొలెరో, తెలుగు ప్రజలకు చాలా ఇష్టమైన కార్లలో ఒకటి & ఇప్పుడు దీని అప్‌డేటెడ్‌ వెర్షన్ రానుంది. కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త ఎయిర్ డ్యామ్ & ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్‌ను కొత్త మోడల్‌లో చూసే అవకాశం ఉంది. ఇంటీరియర్ కూడా అప్‌గ్రేడ్ చేశారు, నలుపు & గోధుమ రంగు థీమ్, ఫాబ్రిక్ సీటింగ్‌ & 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్ ఉన్నాయి. బొలెరో & బొలెరో నియో రెండూ బెటర్ ఫీచర్లతో వస్తాయి. కంపెనీ వీటి ఇంకా ధరను ప్రకటించలేదు, అతి త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా థార్ (3-డోర్ల వెర్షన్ 2025)
బొలెరో తర్వాత, మహీంద్రా థార్ కొత్త 3-డోర్ల వెర్షన్ కూడా లాంచ్‌ అవుతుంది. ఈ SUV డ్యూయల్-టోన్ బంపర్లు, కొత్త గ్రిల్ & రివర్స్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇంకా, కస్టమర్ సౌలభ్యం కోసం ఫ్రంట్ ఆర్మ్‌ రెస్ట్ & కప్ హోల్డర్‌లు యాడ్ అవుతాయి. ఈ నెల ప్రారంభంలో ధరలను ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఈ కారును ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ అడ్వెంచరిస్ట్‌ల కోసం రూపొందించారు.

Nissan C-SUV (కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ)
నిస్సాన్ తన కొత్త C-SUVని అక్టోబర్ 7, 2025న ఇండియాలో లాంచ్‌ చేయనుంది. ఈ మోడల్‌ న్యూ-జెన్‌ రెనాల్ట్ డస్టర్ స్ఫూర్తితో రూపొందింది. Maruti Suzuki Grand Vitara, Kia Seltos, Hyundai Creta & Honda Elevate వంటి కార్లతో నేరుగా పోటీ పడనుంది. మెరుగైన ఇంజిన్ & ప్రీమియం ఫీచర్లతో ఈ కారు లాంచ్‌ అవుతుందని భావిస్తున్నారు.

Skoda Octavia RS (Limited Edition 2025)
స్కోడా, తన పాపులర్‌ ఆక్టేవియా RS ను మళ్లీ భారతీయ మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఈ పరిమిత ఎడిషన్ అక్టోబర్ 17, 2025న లాంచ్‌ అవుతుంది & 100 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉంటాయి. ఇది 261 bhp & 370 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది. 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానమైన ఈ కారు పెర్ఫార్మెన్స్‌, యంగ్‌స్టర్స్‌కు థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

Citroen Aircross X
సిట్రోయెన్ కూడా, తన పాపులర్‌ SUV Aircross లో X వెర్షన్‌ను పరిచయం చేయనుంది. ఈ కొత్త మోడల్‌లో గ్రీన్ పెయింట్ ఆప్షన్, ఆల్-LED లైటింగ్ & వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉంటాయి. AI వాయిస్ అసిస్టెంట్ & 360 డిగ్రీల కెమెరా కూడా ఉంటాయి. స్పెసిఫికేషన్లు ప్రస్తుత మోడల్‌ తరహాలోనే ఉన్నప్పటికీ, ఫీచర్లు & డిజైన్ మరింత ఆధునికంగా ఉండవచ్చు.

Mini Countryman JCW All4
మినీ ఇండియా, Countryman JCW All4 ను ఇండియాలోకి తీసుకువస్తోంది. ప్రి-బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి & ధరలు అక్టోబర్ 14, 2025న ప్రకటిస్తారు. ఈ SUV 300 bhp & 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ కారు కేవలం 5.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget