అన్వేషించండి

2022 Range Rover: రోల్స్ రాయిస్‌‌ను కొట్టే రేంజ్ రోవర్ కారు ఇదే - రేటు చాలా హాటు!

కొత్త రేంజ్ రోవర్ డెలివరీలు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. దీని ధరలు కూడా కంపెనీ రివీల్ చేసింది.

మనదేశంలో కొత్త రేంజ్ రోవర్ డెలివరీలు ప్రారంభం అయ్యాయి. మోస్ట్ అవైటెడ్ లగ్జరీ కార్లలో 2022 రేంజ్ రోవర్ కూడా ముందంజలో ఉంది. ఎంఎల్ఏ ఫ్లెక్స్ బాడీ ఆర్కిటెక్చర్‌పై ఈ కారును కంపెనీ రూపొందించింది. ఇది స్టాండర్డ్, లాంగ్ వీల్ బేస్ ఆప్షన్లను అందించనుంది. దీంతో నాలుగు, ఐదు, ఏడు సీటర్ల కాన్పిగరేషన్లలో ఈ కారును కొనుగోలు చేయవచ్చు. 

3.0 లీటర్ల డీజిల్, 3.0 లీటర్ల పెట్రోల్, 4.4 లీటర్ల పెట్రోల్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఐదో తరం రేంజ్ రోవర్‌లో కొత్త ఫీచర్లు, కొత్త డిజైన్, కొత్త ఇంటీరియర్‌ను అందించారు.  ఈ కారులో 13.1 అంగుళాల కర్వ్‌డ్, ఫ్లోటింగ్ స్క్రీన్‌ను అందించారు. దీంతోపాటు 13.7 అంగుళాల ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది.

పవర్ అసిస్ట్ డోర్స్, 35 స్పీకర్ల ఆడియో సిస్టం, వెనకవైపు యాక్జిల్ స్టీరింగ్, టెర్రెయిన్ రెస్పాన్స్ 2 సిస్టం, ఇండిపెండెంట్ ఎయిర్ సస్పెన్షన్ వంటి హైలెట్స్ అందించారు. ఎస్ఈ, హెచ్ఎస్ఈ, ఆటో బయోగ్రఫీ, ఫస్ట్ ఎడిషన్ వేరియంట్లు ఈ కారులో ఉన్నాయి. వీటిలో ఫస్ట్ ఎడిషన్ మోడల్స్ ధర రూ.2.38 కోట్లు కాగా, ఆటో బయోగ్రఫీ మోడల్ ధర రూ.3.3 కోట్ల నుంచి ప్రారంభం కానుంది.

ఈ కొత్త రేంజ్ రోవర్ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీల్లో ఒకటి. ఇందులో సూపర్ లగ్జరీ స్పేస్ అందించారు. రోల్స్ రాయిస్, బెంట్లేల సరసన చేరడానికి రేంజ్ రోవర్‌కు ఇదే చక్కటి అవకాశం. దీని ఎక్స్‌టర్నల్ డిజైన్ ఒరిజినల్ రేంజ్ రోవర్ తరహాలోనే ఉంది. అయితే దీని షట్‌లైన్స్‌ను కంపెనీ తీసేసింది.

రేంజ్ రోవర్ స్పోర్ట్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఇది ఒక పెద్ద లగ్జరీ ఎస్‌యూవీ. ఈ కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్‌లో ఎయిర్ సస్పెన్షన్‌తో పాటు 48 వోల్ట్ ఎలక్ట్రానిక్ యాక్టివ్ రోల్ కంట్రోల్ సిస్టం అందించనున్నారు. ఆల్ వీల్ స్టీరింగ్ ద్వారా టర్నింగ్ సైకిల్ తగ్గనుంది. ఎయిట్ స్పీడ్ జెడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ స్టాండర్డ్‌గా ఉన్నాయి.

ఈ కారులో సాఫ్ట్ క్లోజ్ డోర్స్‌ను అందించారు. 22 వే అడ్జస్టబుల్, హీటెడ్, వెంటిలేటెడ్ ఎలక్ట్రిక్ మెమరీ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫికేషన్, 29 స్పీకర్లున్న మెరీడియన్ ఆడియో సిస్టం, ఫ్లోటింగ్ 13.1 ఇంచ్ కర్వ్‌డ్ టచ్ స్క్రీన్, 13.7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, అలెక్సా ఫంక్షన్ ఉన్న పివి ప్రో ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, కనెక్టెడ్ కార్ టెక్, 3డీ సరౌండ్ కెమెరా, ముందువైపు, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

మీ దగ్గర 1.82 లక్షలు ఉంటే చాలు, టాటా పంచ్ EV ని కొనేయొచ్చు! వడ్డీ రేట్లు, EMI పూర్తి లెక్కలు ఇవిగో!
కొత్త Tata Punch EV కొనడానికి లోన్‌ ఎంత ఇస్తారు? తక్కువ EMI కోసం ఎన్నేళ్ల టెన్యూర్‌ ఎంచుకోవాలి?
2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?
ఫుల్‌ ఛార్జ్‌తో టాటా పంచ్ EV నిజంగా ఎంతదూరం ప్రయాణిస్తుందో తెలుసా? అసలైన రేంజ్ ఇదే!
రూ.1.10 లక్షల ధరతో సింపుల్‌ వేవ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!
బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్‌కు పోటీగా కొత్త 'సింపుల్‌ వేవ్‌'.. రూ.1.10 లక్షలకే 243km రేంజ్!
బ్యాంక్‌ ఇచ్చే లోన్‌ను బట్టి కాదు.. మీ ఆదాయానికి తగ్గట్లు ఎంత విలువైన కారు కొనాలో ఇలా లెక్కించండి!
మీ జీతానికి మీరు ఎంత ఖరీదైన కారు కొనవచ్చు?, సింపుల్‌గా ఇలా లెక్కించండి!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Kadiri BJP Flexies Torn:కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
కదిరిలో పొత్తు చిచ్చు - బీజేపీ ఫ్లెక్సీల చించివేత.. ఎమ్మెల్యే కందికుంట వర్గీయులపై అనుమానాలు!
Embed widget