అన్వేషించండి

బైక్‌లకే కాదు, ఇప్పుడు స్కూటర్లకు కూడా ABS: కేవలం రూ.92,000 నుంచే బెస్ట్‌ ఆప్షన్లు

భారతదేశంలో ABS ఉన్న చౌకైన స్కూటర్లు ఏవి? రూ.92 వేల నుంచి లభించే సుజుకి యాక్సెస్‌ నుంచి యమహా ఏరాక్స్‌ వరకు ధర, ఫీచర్లు, భద్రత వివరాలు ఇక్కడ చదవండి.

Affordable ABS Scooters India 2026: తెలుగు రాష్ట్రాల్లో స్కూటర్‌ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజువారీ వాడకానికి, సరుకులు తెచ్చుకోవడానికి స్కూటర్లు చాలా అనుకూలంగా ఉండడమే దీనికి కారణం. అయితే,  ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ఊహించని రోడ్డు పరిస్థితుల్లో స్కూటర్‌ నడిపేటప్పుడు భద్రత అత్యంత ముఖ్యం. ఇలాంటి సమయంలో ABS (యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌) పెద్ద రక్షణగా మారుతుంది. ఒకప్పుడు ప్రీమియం బైక్‌లకే పరిమితమైన ABS, ఇప్పుడు స్కూటర్ల సెగ్మెంట్‌లోనూ కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం, భవిష్యత్తులో అన్ని టూ వీలర్లకు ABS తప్పనిసరి చేయొచ్చనే చర్చ నడుస్తోంది. అయితే ప్రస్తుతానికి, ABS ఎక్కువగా హైఎండ్‌ స్కూటర్లకే పరిమితమైంది. అయినప్పటికీ, కొన్ని చవక మోడళ్లు ఈ ట్రెండ్‌ను మార్చుతున్నాయి. ఇప్పుడు, మన మార్కెట్‌లో ABS ఉన్న బడ్జెట్‌ ధర స్కూటర్లు ఏవో చూద్దాం.

6. Yamaha Aerox 155

యమహా ఏరాక్స్‌ 155 ధర రూ.1.41 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).
స్పోర్టీ డిజైన్‌తో ప్రత్యేకంగా కనిపించే ఈ స్కూటర్‌, R15 నుంచి తీసుకున్న శక్తిమంతమైన ఇంజిన్‌తో వస్తుంది. 155సీసీ ఇంజిన్‌ 14.75hp శక్తి ఇస్తుంది. సింగిల్‌ ఛానల్‌ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది. ట్రాక్షన్‌ కంట్రోల్‌, కీ లెస్‌ ఇగ్నిషన్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

5. Hero Xoom 160

హీరో జూమ్‌ 160 ధర రూ.1.37 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).
ఆటో ఎక్స్‌పో 2025లో పరిచయమైన ఈ స్కూటర్‌, మ్యాక్సీ స్కూటర్‌ సెగ్మెంట్‌లో హీరో వేసిన తొలి అడుగుగా మారింది. 156సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ 14.6hp శక్తి ఇస్తుంది. సింగిల్‌ ఛానల్‌ ABSతో పాటు, హైవే వేగాల్లోనూ స్థిరమైన పనితీరు చూపిస్తుంది.

4. VLF Mobster 135

VLF మాబ్‌స్టర్‌ ధర రూ.1.30 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).
భారతదేశంలో డ్యూయల్‌ ఛానల్‌ ABS ఉన్న ఏకైక 125సీసీ స్కూటర్‌ ఇదే. ఇటాలియన్‌ డిజైన్‌, 125సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, 5 ఇంచ్‌ TFT డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

3. Aprilia SR 175

అప్రిలియా SR 175 ధర రూ.1.18 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర) నుంచి ప్రారంభం.
174.7సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ స్కూటర్‌, సింగిల్‌ ఛానల్‌ ABS కలిగి ఉంది. స్పోర్టీ రైడింగ్‌ ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపిక.

2. TVS Ntorq 150

టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ 150 ధర రూ.1.09 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌ ధర).
149.7సీసీ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తుంది. తక్కువ ధరలో ABS ఇవ్వడం దీని పెద్ద ప్లస్‌. TFT డిస్‌ప్లే ఉన్న హై వేరియంట్‌కు అదనంగా రూ.9,000 చెల్లించాలి.

1. Suzuki Access - అత్యంత చౌక ABS స్కూటర్‌

సుజుకి యాక్సెస్‌ ABS ధర రూ.92,328 (ఎక్స్‌-షోరూమ్‌ ధర) నుంచి మొదలవుతుంది.
125సీసీ సెగ్మెంట్‌లో ప్రభుత్వ నిబంధన లేకపోయినా, స్వచ్ఛందంగా ABS అందిస్తున్న స్కూటర్‌ ఇది. టాప్‌ రెండు వేరియంట్లలో ABS లభిస్తుంది. తక్కువ ధర, మంచి మైలేజ్‌, నమ్మకమైన పనితీరుతో ఇది బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది.

మీకు తక్కువ బడ్జెట్‌లో అదనపు భద్రత కావాలంటే, సుజుకి యాక్సెస్‌ ABS ప్రస్తుతం భారత మార్కెట్‌లో బెస్ట్‌ ఆప్షన్‌గా నిలుస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget