అన్వేషించండి

Bike Maintenance Tips: మీ బైక్‌కి తప్పక చేయాల్సిన నెలవారీ నిర్వహణ – ఇంజిన్‌ నుంచి టైర్ల వరకు ఫుల్‌ గైడ్‌

Monthly Bike Checklist: ఇంజిన్‌ ఆయిల్‌ మార్పు నుంచి టైర్‌ ప్రెషర్‌ వరకు, మీ బైక్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు ప్రతీ నెలా తప్పనిసరిగా చెయ్యాల్సిన మెయింటెనెన్స్‌ చిట్కాలు ఇవి.

Bike Or Scooter Mileage Improvement Tips: బైక్‌ కొనడం ఒకసారి అయితే, దానిని శ్రద్ధగా నిర్వహించడం ఒక జీవితకాల బాధ్యత. చాలామంది బైక్‌ ఓనర్లు వాహనం కొనుగోలు తర్వాత దాని మెయింటెనెన్స్‌ పట్ల అలసత్వం చూపుతారు. కానీ, నెలకు ఒకసారి కొన్ని ముఖ్యమైన చెకింగ్స్‌ చేయడం వల్ల మీ బైక్‌ పనితీరు మెరుగవుతుంది, మైలేజ్‌ పెరుగుతుంది, అనవసర ఖర్చులు కూడా తగ్గుతాయి. అంటే, మీరు మీ బైక్‌పై నెలకు కనీసం ఒకసారి శ్రద్ధ పెడితే మీ డబ్బు ఆదా అవుతుంది.

1. ఇంజిన్‌ ఆయిల్‌ చెక్‌ చేయండి
ఇది బైక్‌ లేదా స్కూటర్‌ మెయింటెనెన్స్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. ప్రతి నెలా ఓసారి ఆయిల్‌ స్థాయి సరిగానే ఉందా, దాని రంగు మార్చిపోయిందా, లెవెల్‌ తగ్గిందా అని పరిశీలించాలి. అవసరమైతే ఆయిల్‌ మార్చాలి. వాడిన ఆయిల్‌ వలన ఇంజిన్‌ పనితీరు తగ్గిపోతుంది, మైలేజ్‌ కూడా పడిపోతుంది.

2. టైర్‌ ప్రెషర్‌ చెక్‌ చేయడం మర్చిపోకండి
తగిన టైర్‌ ప్రెషర్‌ లేకపోతే మైలేజ్‌ తగ్గుతుంది. అంతే కాదు, టైర్లు త్వరగా అరిగిపోతాయి, జారిపోతాయి. ప్రతీ నెలా కనీసం ఒకసారి, వీలైతే వారానికి ఒకసారి, పక్కా గేజ్‌తో రెండు టైర్ల ప్రెషర్‌ చెక్‌ చేయడం అలవాటు చేసుకోండి.

3. బ్రేకులు, కేబుల్స్‌ పనితీరు చూడండి
బ్రేక్‌లు సరిగానే పని చేస్తున్నాయా? బ్రేక్‌ లైన్లలో ఏవైనా పగుళ్లు, తెగిన గుర్తులు ఉన్నాయా? బ్రేక్‌ లైన్‌లన్నీ స్మూత్‌గా పని చేస్తున్నాయా అన్నది పరిశీలించండి. అలాగే క్లచ్‌, యాక్సిలరేటర్‌ కేబుల్స్‌ జామ్‌ అయ్యాయేమో కూడా చూసుకోవాలి.

4. చైన్‌ క్లీనింగ్‌ & ల్యూబ్రికేషన్‌
బైక్‌ చైన్‌కి సరైన ల్యూబ్రికేషన్‌ లేకపోతే సౌండ్‌ వస్తుంది, మైలేజ్‌ పడిపోతుంది. నెలకోసారి చైన్‌ను క్లీన్‌ చేసి, ప్రత్యేకమైన చైన్‌ ల్యూబ్‌ స్ప్రే వాడటం మంచిది. ఇది, రైడింగ్‌ సమయంలో మీ బైక్‌ తేలికగా, స్మూత్‌గా పరుగెత్తేలా చేస్తుంది.

5. బ్యాటరీ స్థితి పర్యవేక్షణ
ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్టార్టింగ్‌ ఉన్న బైక్‌లలో బ్యాటరీ తక్కువ వోల్టేజ్‌తో ఉంటుంది. నెలకోసారి వర్క్‌షాప్‌నకు తీసుకువెళ్లి లేదా మీరే బ్యాటరీ వోల్టేజ్‌ చెక్‌ చేయండి. లీకేజీ ఉందా? టెర్మినల్స్‌ తుప్పు పట్టాయా అన్నది చూసుకోవాలి.

6. లైటింగ్‌, హార్న్‌, సెల్ఫ్‌ స్టార్టర్‌
హెడ్‌ల్యాంప్స్‌, టెయిల్‌ల్యాంప్స్‌, ఇండికేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో, లేదో చూసుకోండి. హార్న్‌ వాల్యూమ్‌ తగ్గితే అది కూడా బ్యాటరీ లేదా కనెక్షన్‌ సమస్య కావచ్చు. ఈ చిన్న విషయాల్ని నిర్లక్ష్యం చేస్తే రోడ్డుపైకి వచ్చిన తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు.

7. వాషింగ్‌ & శుభ్రత
నెలకోసారి బైక్‌ను శుభ్రంగా కడగడం వల్ల తుప్పు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా అండర్‌క్యారేజ్‌, చైన్‌ ప్రాంతాల్లో గట్టిగా తుడవాలి. శుభ్రంగా ఉండే బైక్‌ ఇతరుల దృష్టిని ఆకర్షించడమే కాదు, దీర్ఘకాలికంగా ధన నష్టం నుంచి కాపాడుతుంది.

నెలవారీ నిర్వహణ అనేది కాస్త ఖర్చుతో కూడుకున్న పని. కానీ దీన్ని మనం సాధారణంగా చేసే మొబైల్‌ రీచార్జ్‌లా భావిస్తే, దీర్ఘకాలంగా మీ బండి మైలేజ్‌, ఇంజిన్‌ ఆరోగ్యం, భద్రత సహా ఆల్‌-రౌండ్‌ బెనిఫిట్‌లా మారుతుంది. పైగా, చిన్న జాగ్రత్తల వల్ల పెద్ద నష్టాలు తగ్గుతాయి, మీ డబ్బు పెద్ద మొత్తంలో ఖర్చు కాకుండా ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
హోండా రెబెల్ 300 vs రాయల్ ఎన్‌ఫీల్డ్‌ గోవాన్ క్లాసిక్ 350 - ఏది స్పెషల్‌ బైక్‌?
ఎలక్ట్రిక్‌ బైక్‌ లేదా స్కూటర్‌ కొనేవాళ్లకు పెద్ద శుభవార్త.. రాయితీ గడువు పొడిగించిన కేంద్రం
ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనేవాళ్ల కోసం బిగ్‌ న్యూస్‌.. సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం
Exter Sales Report: 27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
27 కిలోమీటర్ల మైలేజీ ఇస్తూ తక్కువ ధరకే లభించే కారు గురించి తెలుసా? అందుకే జనం ఎగబడుతున్నారా?
Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Ajay Devgn: బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
బుల్లితెరపైకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్... క్రైమ్ షోకి హోస్ట్‌గా
Embed widget