అన్వేషించండి

Iran War Effect: ఇరాన్‌ యుద్ధంతో ఆటోమొబైల్ రంగానికి ముంచుకొస్తున్న ముప్పు! భారత్‌లో 50శాతానికిపైగా పెరగనున్న విడిభాగాల ధరలు!

Iran War Effect: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం భారత్‌లోని సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. అంతర్జాతీయ సరఫరా చైన్ దెబ్బతినడంతో వాహనాల విడి భాగాలు 25 శాతం నుంచి 50 వరకు పెరగబోతున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోర్మూజ్ జలసంధిలో యుద్ధ భయాలు, షిప్పింగ్ కార్యకలాపాలు స్తంభించాయి.
  • రవాణా ఖర్చులు పెరిగి, సరుకుల చేరడానికి ఆలస్యం అవుతోంది.
  • ముడి చమురు ధరల పెరుగుదలతో విడిభాగాల తయారీ ఖర్చు పెరిగింది.
  • వినియోగదారులపై ధరల భారం, పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి.

Iran War Effect: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాలేదు.అవి గ్లోబల్ సప్లై చైన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం, భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో 50 శాతం వాటా కలిగిన హోర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఒ ప్రమాదకరమైన మలుపులో ఉంది. జల సంధి అధికారికంగా మూసివేయకపోయినా అక్కడ పెరిగిన ఇన్సూరెన్స్ రేట్లు, దాడులకు భయంతో షిప్పింగ్ కార్యాకలాపాలు స్తంభించిపోయాయి. 

దాదాపు 4500 భారతీయ ఎగుమతిదారులు, 1800 మంది దిగుమతిదారులు ఈ మార్గంపై ఆధారపడి ఉన్నారు. షిప్పింగ్ కంపెనీలు ఇప్పుడు వార్ రిస్క్ సర్ఛార్జ్‌, ఎమర్జెన్సీ ఫ్యూయల్‌ సర్ఛార్జ్ వంటి కొత్త పన్నులను విధిస్తున్నాయి. దీని వల్ల కంటైనర్‌ రవాణా ఖర్చు ఏకంగా రెండు వేల నుంచి మూడు వేల డాలర్ల వరకు పెరిగింది షిప్పింగ్ ఆలస్యం వల్ల వస్తువులు చేరడానికి పట్టే సమయంలో మరో పది నుంచి ఇరవై రోజులు పెరుగుతోంది.  

విడిభాగాల కొరత ప్రారంభం 

ఆసియాలోనే అతి పెద్ద ఆటోమొబైల్‌ విడిభాగాల మార్కెట్‌ అయిన ఢిల్లీలోని కశ్మీర్‌ గేట్‌లోని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్‌, రబ్బర్, ప్యాకేజింగ్ మెటీరియల్స్‌ ధరలు పెరిగాయి. మార్కెట్‌ నిపుణుల ప్రకారం విడిభాగాల తయారీ ఖర్చు 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగింది. 

మరోవైపు ఇంధన ధరల పెరుగుదల వల్ల ఫ్యాక్టరీల్లో కార్మికులు స్వగ్రామాలకు తరలిపోతుండటంతో ఉత్పత్తి కుంటుపడింది. రబ్బర్ విడిభాగాల తయారీ ఖర్చు పది నుంచి 16 రూపాయలకి పెరగగా, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ప్లాస్టిక్‌ వస్తువుల ధరలు రెట్టింపు అవుతున్నాయి. దీనికి తోడు హుర్మూజ్ జలసంధి వద్ద సుమారు 2,300 పెట్రోలియం కంటైనర్లు నిలిచిపోవడం వల్ల సప్లై పూర్తిగా దెబ్బతింది. 

ధరల మోత వినియోగదారులపై ప్రభావం 

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి తయారీదారులు ధరలను పెంచడం అనివార్యమని ప్రకటించారు. ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల కార్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు ఐదు శాతం నుంచి ఆరు శాతం వరకు పెరగనున్నాయి. మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి వంటి సంస్థలు ఇప్పటికే రెండు శాతం ధరల పెంపును ప్రకటించాయి. షూస్‌, ప్లాస్టిక్ ఆధారిత దుస్తుల ధరల 8 శాతం నుంచి 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

వార్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్న కంపెనీలు 

వాహన తయారీ సంస్థలు పాండమిక్‌ సమయంలో చేసినట్టుగానే క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అల్యూమినియం, కాపర్, ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. అయినప్పటికీ భారత్ విడిభాగాలు దిగుమతుల్లో చైనా వాటా 30 శాతంగా ఉంది. జర్మనీ, దక్షిణ కొరియా నుంచి కూడా దిగుమతులు పెరుగుతున్నప్పటికీ, ప్రస్తుతం పరిస్థితుల్లో ధరల నియంత్రణ అనేది తయారీదార్లకు ఒక సవాల్‌గా మారింది.  

నేటి పరిస్థితులు చూస్తుంటే 1970 నాటి అంతర్జాతీయ సంక్షోభాన్ని గుర్తు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం చమురు మాత్రమే కాదు, టైల్స్, పేపర్, పెట్రోకెమికల్ ఉత్పత్తులపై ఆధారపడిన పరిశ్రమలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 

Frequently Asked Questions

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌పై ఎలాంటి ప్రభావం పడుతోంది?

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల గ్లోబల్ సప్లై చైన్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా హోర్మూజ్ జలసంధిలో షిప్పింగ్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి.

హోర్మూజ్ జలసంధిలో సమస్యల వల్ల భారతీయ ఎగుమతిదారులు, దిగుమతిదారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది?

హోర్మూజ్ జలసంధిలో సమస్యల వల్ల దాదాపు 4500 భారతీయ ఎగుమతిదారులు, 1800 మంది దిగుమతిదారులు ప్రభావితం అవుతున్నారు. షిప్పింగ్ ఖర్చులు, రవాణా సమయం పెరిగాయి.

ఆటోమొబైల్ విడిభాగాల మార్కెట్‌లో ప్రస్తుత పరిస్థితి ఏమిటి?

ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్, రబ్బర్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు పెరిగాయి. విడిభాగాల తయారీ ఖర్చు 25-50% వరకు పెరిగింది, ఉత్పత్తి కుంటుపడింది.

వినియోగదారులపై ధరల పెరుగుదల ప్రభావం ఎలా ఉండబోతోంది?

ముడిసరుకుల ధరల పెరుగుదల వల్ల కార్లు, టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ధరలు 5-6% వరకు పెరగనున్నాయి. షూస్, ప్లాస్టిక్ దుస్తుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

వాహన తయారీ సంస్థలు ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?

వాహన తయారీ సంస్థలు క్రైసిస్ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. అల్యూమినియం, కాపర్, ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం ఇతర దేశాల నుంచి దిగుమతి మార్గాలను అన్వేషిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

How To Protect Bike During Heavy Rain:వర్షాకాలంలో మీ డ్రీమ్‌ బైక్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి?
వర్షాకాలంలో మీ డ్రీమ్‌ బైక్ పాడవకుండా ఎలా కాపాడుకోవాలి?
Maruti Brezza Hyderabad On Road Price:హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా కొంటే ఆన్‌రోడ్ ప్రైస్‌ ఎంత? నెలకు ఎంత EMI చెల్లించాలి?
హైదరాబాద్‌లో మారుతి బ్రెజ్జా కొంటే ఆన్‌రోడ్ ప్రైస్‌ ఎంత? నెలకు ఎంత EMI చెల్లించాలి?
Upcoming SUVs List: మూడు నెలల్లో అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న  శక్తివంతమైన SUVలు!
మూడు నెలల్లో అద్భుతమైన ఫీచర్లతో విడుదల కానున్న  శక్తివంతమైన SUVలు!
అథర్‌ స్కూటర్లలో 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ప్రారంభం.. రోడ్డుపై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందే హెచ్చరికలు
రోడ్డుపై గుంతల గురించి ముందే హెచ్చరించే కొత్త ఫీచర్‌ - అథర్‌ Gen 2 స్కూటర్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget