MG Cyberster Launch: ఎంజీ సైబర్‌స్టర్ ప్రీమియం కారు త్వరలో లాంచ్ - మరో నెల రోజుల్లోనే!
MG Cyberster: ప్రముఖ కార్ల బ్రాండ్ ఎంజీ తన కొత్త ప్రీమియం కారు సైబర్‌స్టర్‌ను త్వరలో మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. 2025 జనవరిలో దీన్ని లాంచ్ చేయనున్నారని సమాచారం.
MG Cyberster Electric Sports Car: ఎంజీ కార్ల కంపెనీకి చెందిన ప్రీమియం సేల్స్ ఛానెల్ ఎంజీ సెలెక్ట్ 2025 జనవరిలో కొత్త కారును ప్రదర్శించనుంది. ఈ సేల్స్ ఛానెల్ ద్వారా విక్రయించే మొదటి కారు ఎంజీ సైబర్‌స్టర్. సైబర్‌స్టర్‌ను ఇప్పటికే భారతదేశంలో ప్రదర్శించారు. ఇప్పుడు దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఎంజీ సైబర్‌స్టర్ అనేది ఫ్యూచరిస్టిక్, హై పెర్ఫార్మెన్స్ ఈవీ. ఇది మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. ఈ కారు లాంచ్ అయ్యాక దీని గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎంజీ సెలెక్ట్ ఈవీలతో పాటు హైబ్రిడ్‌లు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌లను కలిగి ఉండే ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది.
ఎంజీ సైబర్‌స్టర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా, ఆధునికంగా ఉంది. ఇది 77 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్‌లో 500 నుంచి 580 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు బరువు 1,984 కిలోలుగా ఉంది. దీని పొడవు 4,533 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1,912 మిల్లీమీటర్లు గానూ, ఎత్తు 1,328 మిల్లీమీటర్లుగానూ ఉంది. ఈ కారు 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు మార్కెట్లో ఎంత సక్సెస్ అవుతుందో లాంచ్ అయితేనే గానీ చెప్పలేం.
Also Read: కోటి రూపాయల వోల్వో ఎక్స్‌సీ90 - ఈఎంఐలో కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి?
ఎంజీ సైబర్‌స్టర్ డిజైన్, ఫీచర్లు
ఈ కొత్త సైబర్‌స్టర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో స్పోర్ట్స్ కారు డిటైల్స్‌తో పాటు ఫ్యూచరిస్టిక్ టచ్ కూడా ఉంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే మీరు షార్ప్ లైన్స్, లెస్ స్వారీ ప్రొఫైల్, అధునాతన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, ఏరోడైనమిక్ షేప్‌ని పొందుతారు. ఎంజీ సైబర్‌స్టర్ కన్వర్టిబుల్ డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. ఇది స్పోర్టీ, లగ్జరీ లుక్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన ఎరుపు రంగులో రానున్న ఈ స్పోర్ట్స్ కారు లుక్, డిజైన్ అనేక సాంప్రదాయ స్పోర్ట్స్ కార్లను పోలి ఉంటుంది.
కేవలం రెండు సీట్లతో వస్తున్న ఈ స్పోర్ట్స్ కారు క్యాబిన్‌లో మీరు తగినంత స్థలాన్ని పొందనున్నారు. ఇందులో 19 నుంచి 20 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఎంజీ ఈ స్పోర్ట్స్ కారు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం మూడు స్క్రీన్‌లను కలిగి ఉంది. వర్టికల్‌గా ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.
Also Read: రూ.10 లక్షల్లో బెస్ట్ సీఎన్‌జీ కార్లు ఇవే - ఆల్టో కే10 నుంచి పంచ్ వరకు!
#MG have confirmed the launch of the #Cyberster convertible EV through their new retail channel, Select, in January 2025.
— V3Cars (@v3cars) December 2, 2024
🔹 0-100 km/h in 3.2 seconds
🔹 544 PS & 750 Nm torque
🔹 Electric scissor doors
MG is yet to reveal the India-specific specs and features.#V3Cars pic.twitter.com/MR8ds7TPt7