లీటరు 34 km మైలేజ్ ఇచ్చే Maruti Wagon R అమ్మకాల్లో నంబర్ 1 - రేటు ₹6 లక్షల కన్నా తక్కువే బాస్!
Maruti Wagon R Features: మారుతి వ్యాగన్ ఆర్ మూడు రకాల పవర్‌ట్రెయిన్ ఎంపికలతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అన్ని రకాల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా దీని పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఇచ్చారు.

Maruti Wagon R - Best Selling Car In India: మన తెలుగు రాష్ట్రాల్లో, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లకు చాలా డిమాండ్ ఉంది. గత నెలలో, అంటే జులై 2025లో, దేశవ్యాప్తంగా ఈ సెగ్మెంట్ అమ్మకాల్లో మారుతి సుజుకి వ్యాగన్ R టాప్ ప్లేస్‌లో ఉంది. అంటే, తెలుగు ప్రజలే కాదు, దేశంలో ఎక్కువ మంది కస్టమర్లు Wagon R ను ఇష్టపడ్డారు. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, గత నెలలో, దేశవ్యాప్తంగా 14,710 కొత్త కస్టమర్లను (Maruti Wagon R Sales July 2025) సంపాదించుకుంది. 2024 జులైలోని సేల్స్‌తో పోలిస్తే ఈసారి (వార్షిక ప్రాతిపదికన) మారుతి వ్యాగన్ ఆర్ అమ్మకాలు 9 శాతం తగ్గినప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలోనే ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంత రేటుకు కొనవచ్చు?
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో మారుతి వ్యాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.79 లక్షల (Maruti Wagon R ex-showroom price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభమైంది, టాప్ వేరియంట్ రేటు రూ. 8.50 లక్షల వరకు ఉంటుంది. దీని CNG వేరియంట్ ధర రూ. 7.15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న ఖరీదైన కార్లతో పోలిస్తే, ఈ రేటు దగ్గర ఇది మధ్య తరగతి కుటుంబాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్. 2025లో చౌకైన & సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్ ఇది. ధర తక్కువైనా ఫీచర్లలో ఆధునికతకు ఏ మాత్రం తగ్గదు.
విజయవాడలో వ్యాగన్ ఆర్ బేస్ వేరియంట్‌ను దాదాపు రూ. 6.85 లక్షల ఆన్-రోడ్ ధరకు (Maruti Wagon R on-road price, Vijayawada) కొనవచ్చు. ఆన్-రోడ్ రేటులో, రిజిస్ట్రేషన్ ఖర్చులు దాదాపు రూ.84,000, బీమా దాదాపు రూ. 23,000, ఇతర అవసరమైన ఖర్చులు కలిసి ఉంటాయి. హైదరాబాద్‌లో వ్యాగన్ ఆర్ బేస్ వేరియంట్‌ను దాదాపు రూ. 6.93 లక్షల ఆన్-రోడ్ ధరకు (Maruti Wagon R on-road price, Hyderabad) కొనవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లోనూ స్వల్ప మార్పులతో దాదాపు ఇదే రేటు ఉంటుంది.
మారుతి వ్యాగన్ R ఫీచర్లు & వేరియంట్లు
వ్యాగన్ R లో.. ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీనితో పాటు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఆటో AC & ఎత్తు సర్దుబాటు చేసుకోగల డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
మారుతి వ్యాగన్ R ను కొనడానికి 3 పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 65.68 bhp పవర్ & 89 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండో ఎంపిక 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 88.5 bhp శక్తిని & 113 Nm టార్క్‌ను ఇస్తుంది. మూడో ఎంపిక 1.0-లీటర్ CNG ఇంజిన్, ఇది 88 PS పవర్ & 121.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్ అవసరాన్ని బట్టి ఒక పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
రెండు పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లను 5-స్పీడ్ మాన్యువల్ & AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో కొనవచ్చు. CNG వేరియంట్ మాత్రం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఈ ఇంజిన్లన్నీ గొప్ప పనితీరును ప్రదర్శించడమే కాదు, ఇంధనాన్ని కూడా ఆదా చేస్తాయి.
34 km మైలేజీ
ARAI డేటా ప్రకారం, వ్యాగన్ ఆర్ ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్ రకాన్ని బట్టి 23.56 నుంచి 25.19 కి.మీ.ల మైలేజీని అందిస్తుంది. ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 25.19 కి.మీ.ల మైలేజీ ఇస్తుండగా, మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.35 కి.మీ.ల దూరం ప్రయాణిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభించే CNG వేరియంట్లు దాదాపు 33.54 కి.మీ/కి.గ్రా. మైలేజీని అందిస్తాయి.




















