Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
Maruti Suzuki Wagon R CNG: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ వేరియంట్ 32 నుంచి 34 కిలోమీటర్ల మధ్య మైలేజీని అందిస్తుంది. దీన్ని రూ. లక్ష డౌన్‌పేమెంట్ చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
Maruti Suzuki Wagon R on EMI: మారుతి సుజుకి కార్లు తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో పాటు మంచి మైలేజీని ఇస్తాయి. ఇండియన్ మార్కెట్లో బాగా పాపులర్ అయిన మారుతి సుజుకి కార్లలో వివిధ మోడల్స్ ఉన్నాయి. ఈ కార్లలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్ఆర్. కంపెనీ ఈ కారుకు సంబంధించిన సీఎన్‌జీ వెర్షన్‌ను కూడా విక్రయిస్తుంది. మీరు ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే పూర్తి మొత్తాన్ని చెల్లించే బదులు మీరు ఈఎంఐ ద్వారా కూడా కొనవచ్చు. దీని కోసం మీరు డౌన్ పేమెంట్, ఈఎంఐ లెక్కలను అర్థం చేసుకోవాలి.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీ బేస్ మోడల్ ఎల్ఎక్స్ఐ ఆన్ రోడ్ ధర రూ. ఏడు లక్షల వరకు ఉంది. మీరు కారును కొనుగోలు చేసే నగరాన్ని బట్టి ఈ ధర మారవచ్చు. దీని బేస్ మోడల్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. లక్ష డౌన్ పేమెంట్ చెల్లించాలి.
ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాలి?
ఈ కారును కొనుగోలు చేయడానికి మీరు 9.8 శాతం వడ్డీ రేటుతో ఐదు సంవత్సరాల పాటు బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణం తీసుకుంటే 5.45 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ లేదా కంపెనీ నుంచి తీసుకున్న ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లించాలి. మీరు ఐదు సంవత్సరాల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.6.91 లక్షలు బ్యాంకుకు చెల్లించాలి.
Also Read: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలంటే ప్రతి నెలా రూ.11 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. రుణం, వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు మంచి వడ్డీ రేటుతో రుణం రావాలంటే మంచి క్రెడిట్ స్కోరు మెయింటెయిన్ చేయడం తప్పనిసరి.
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఇంజిన్ ఇదే...
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సీఎన్‌జీలో మీరు 1.0 లీటర్ ఇంజన్‌ని పొందుతారు. ఇది గరిష్టంగా 57 బీహెచ్‌పీ పవర్, 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంది. వ్యాగన్ఆర్ మైలేజ్ కిలోకు 32.52 కిలోమీటర్ల నుంచి 34.05 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వ్యాగన్ఆర్ సీఎన్‌జీలో ఎల్‌ఎక్స్‌ఐ (రూ. 6.42 లక్షలు), వీఎక్స్‌ఐ (రూ. 7.23 లక్షలు) వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న బ్రాండ్లలో మారుతి సుజుకి నంబర్ వన్ స్థానంలో ఉంది.
Also Read: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
To the sibling who’s always up for an adventure and brings style to every ride – this Bhai Dooj, let’s cherish the memories and look forward to more! 👫 ❤️ #MarutiSuzukiArena #Celerio #Spresso #DriveYourStyle #MadeforMore #BhaiDooj #SiblingBond pic.twitter.com/51rl5xBWNa
— Maruti Suzuki Arena (@MSArenaOfficial) November 3, 2024