అన్వేషించండి

Upcoming SUVs: EV మార్కెట్‌ను ఏలేందుకు వస్తున్న అమేజింగ్‌ SUVలు - సింగిల్‌ ఛార్జ్‌తో 500 km రేంజ్‌

Upcoming SUVs 2005: మారుతి, టయోటా కంపెనీలు కొత్త SUV మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ EVలు పరీక్షల సమయంలో రోడ్లపై చాలాసార్లు కనిపించాయి.

Upcoming SUVs In India In 2025: భారతదేశంలో అతి పెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ, టఫ్‌ మోడళ్లను లాంచ్‌ చేసే టయోటా, మరికొన్నాళ్లలో కొత్త SUVలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికీ, ఈ వాహనాలను ఇండియన్‌ రోడ్ల మీద టెస్ట్‌ చేస్తున్నారు. మారుతి, టయోటా నుంచి రాబోయే SUVలలో ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చు & కస్టమర్ల కోసం ఏయే ప్రత్యేకతలు తీసుకురాబోతున్నారన్న విషయాలపై ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు.

1. మారుతి సుజుకి ఇ విటారా ‍‌(Maruti Suzuki e Vitara)
మారుతి సుజుకి, త్వరలో, తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV 'E Vitara'ను భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (EV)ను మొదటిసారిగా '2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో'లో ఈ కంపెనీ ప్రదర్శించబడింది. అప్పటి నుండి ఈ కారుపై జనాల్లో ఆసక్తి మొదలైంది. ఈ SUV సింగిల్‌ ఫుల్‌ ఛార్జ్‌తో 500 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్‌ ఇస్తుందని భావిస్తున్నారు. ఈ EV కోసం రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఇవ్వవచ్చు - ఒకటి స్టాండర్డ్ & మరొకటి ఎక్స్‌టెండెడ్ రేంజ్. ఈ వాహనం ప్రీమియం లుక్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌ కనెక్టివిటీ ఫీచర్లు & లెవల్-2 ADAS వంటి సేఫ్టీ ఫీచర్లతో ఫుల్లీ ఫీచర్‌ ప్యాక్‌డ్‌ కార్‌లా ఉండవచ్చు. లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లేవాళ్లను, ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ SUVని ప్రత్యేకంగా రూపొందించారు.

2. మారుతి ఎస్కుడో (Maruti Suzuki Escudo)
మారుతి ఎస్కుడో ఒక కొత్త మిడ్-సైజ్ SUV. ఇది.. ధర & ఫీచర్ల పరంగా బ్రెజ్జా - గ్రాండ్ విటారాకు మధ్యలో ఉంటుంది. ఈ వెహికల్‌ రోడ్ టెస్టింగ్ టైమ్‌లో చాలాసార్లు కనిపించింది. మరో 2, 3 నెలల్లో మారుతి ఎస్కుడో లాంచ్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోర్‌వీలర్‌కు 1.5 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు, దీనిని మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో లింక్‌ చేశారు. ఈ టెక్నాలజీ వల్ల మైలేజీ మెరుగుపరుడుతుంది. డిజైన్‌ విషయానికి వస్తే... మారుతి ఎస్కుడో కొత్త అల్లాయ్ వీల్స్ & షార్ప్ LED DRL వంటి స్పోర్టీ లుక్స్‌ ఇశ్తుంది. ఇంటీరియర్‌లో... కొత్త డాష్‌బోర్డ్ & అప్‌డేటెడ్‌ టెక్నాలజీ ఎలిమెంట్స్‌ ఉండవచ్చు. కాస్త తక్కువ ధరలో SUV కొనాలనుకునే కస్టమర్లకు మారుతి ఎస్కుడో మిడ్-సైజ్ SUV అనుకూలంగా ఉంటుంది.

3. టయోటా అర్బన్ క్రూయిజర్ BEV ‍‌(Toyota Urban Cruiser BEV)
టయోటా అర్బన్ క్రూయిజర్ BEV, ఈ కంపెనీ నుంచి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ SUV. మారుతి సుజుకి eVX ఫ్లాట్‌ఫామ్‌పై దీనిని నిర్మించారు. అంటే, మారుతి e Vitara ప్లాట్‌ఫామ్ & టెక్నాలజీని టయోటా అర్బన్ క్రూయిజర్ BEV ‍లోనూ చూడవచ్చు. ఈ కారును మొదట బ్రస్సెల్స్‌లో ప్రదర్శించారు & ఆ తరువాత భారతదేశంలో '2025 గ్లోబల్ ఎక్స్‌పో'లో పరిచయం చేశారు. ఈ SUV సింగిల్‌ ఫుల్‌ ఛార్జ్‌తో 500 km పైగా డ్రైవింగ్‌ రేంజ్ ఇవ్వగలదని సమాచారం. దీని ఎక్స్‌టర్నల్‌ డిజైన్ e Vitara కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది, ముందు వైపు ఫాసియా & టెయిల్ లాంప్‌లకు కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉంటాయి. టయోటా ఈ వాహనాన్ని ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా లాంచ్‌ చేయవచ్చు. 

ఏ కారు ధర ఎంత, ఎప్పుడు లాంచ్‌ అవుతాయి?
మారుతి ఇ విటారా 2025 మధ్యలో (అతి త్వరలో) లాంచ్‌ కావచ్చని & ధర రూ. 22 లక్షల నుంచి రూ. 28 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. మారుతి ఎస్కుడో ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ కాలంలో విడుదల కావచ్చని, దీని ధర రూ. 12 నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. టయోటా అర్బన్ క్రూయిజర్ BEV, 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది & దీని అంచనా ధర రూ. 24 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget