News
News
వీడియోలు ఆటలు
X

Maruti Suzuki Fronx SUV: మారుతి నుంచి మరో కాంపాక్ట్ SUV విడుదల, ధర, ఫీచర్లు ఇవే !

మారుతి సుజుకి మరో కాంపాక్ట్ SUVని మార్కెట్లోకి విడుదల చేసింది. 7.46 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

FOLLOW US: 
Share:

ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త కారును దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న  ఫ్రాంక్స్ కాంపాక్ట్ SUVని లాంచ్ చేసింది. రూ. 7.46 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.0-లీటర్ K-సిరీస్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజన్ ప్రారంభ ధర రూ. 9.72 లక్షల నుంచి రూ. 13.13 లక్షల వరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ను ఆన్‌లైన్‌లో లేదంటే కంపెనీ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 11,000 లోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి సబ్‌స్క్రిప్షన్ ద్వారా రూ. 17,378 నుండి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజుతో కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది.   

మారుతి సుజుకి ఫ్రాంక్స్: వేరియంట్లు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టా+ జీటా, ఆల్ఫా అనే ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది. వేరియంట్ వారీగా రూ. 7.46 లక్షల నుంచి రూ. 13.13 లక్షల వరకు ధర పలుకుతుంది.   

మారుతి సుజుకి ఫ్రాంక్స్: కలర్ ఆప్షన్స్

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కాంపాక్ట్ SUV 10 మోనోటోన్, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంది. మొత్తం 7 మోనోటోన్ షేడ్స్ ఉన్నాయి. ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యుర్ గ్రే, బ్లూయిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, ఓపులెంట్ రెడ్,  ఎర్టెన్ బ్రౌన్. ఆఫర్‌లో ఉన్న డ్యూయల్-టోన్ కలర్ కాంబినేషన్‌లలో స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఓపులెంట్ రెడ్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఎర్టెన్ బ్రౌన్ విత్ బ్లూయిష్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ డిజైన్

గ్రాండ్ విటారా,  బాలెనో   డిజైన్ ఆధారంగా తీసుకుని, మారుతి సుజుకి ఫ్రాంక్స్ క్రోమ్ బార్, స్లీకర్-లుకింగ్ LED హెడ్‌ల్యాంప్‌లు, DRLలతో వేరు చేయబడిన పెద్ద హెక్జాగోనల్ గ్రిల్‌తో అమర్చబడింది. కాంపాక్ట్ SUV  ఫ్రంట్ బంపర్ బూడిద రంగులో ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లను కలిగి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ 16-అంగుళాల ప్రెసిషన్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కూపే- లాంటి అప్పీల్‌ను అందించే స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో ఉంటుంది. వెనుక వైపున, మారుతి సుజుకి ఫ్రాంక్స్ స్పోర్ట్స్ సిగ్నేచర్ LED బ్లాక్ టెయిల్-ల్యాంప్‌లు, కాంపాక్ట్ SUV   LED స్ట్రిప్, రూఫ్‌పై ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. ఇక  లోపలి వైపు,  వైర్‌లెస్ Apple CarPlay,  Android Auto కనెక్టివిటీతో కూడిన 9.0-అంగుళాల HD స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ARKAMYS సౌండ్ సిస్టమ్, సుజుకి కనెక్ట్ 40+ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ ను కలిగి ఉంటుంది. HUD యూనిట్, 360-డిగ్రీ కెమెరా,  క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది.  

మారుతి సుజుకి ఫ్రాంక్స్: ఇంజిన్

మారుతి సుజుకి ఫ్రాంక్స్‌  సరికొత్త 1.0L K-సిరీస్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది.  ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. 99 hp శక్తిని, 147 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు 89 hp పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఐడిల్ స్టార్ స్టాప్ టెక్నాలజీతో 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ట్రాన్స్‌ మిషన్ ఎంపికల విషయానికి వస్తే, ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఐదు-స్పీడ్ AGS ట్రాన్స్‌మిషన్, ఆరు-స్పీడ్ AMT ఉన్నాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్: సేఫ్టీ ఫీచర్లు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు (డ్రైవర్, కో-డ్రైవర్, సైడ్ & కర్టెన్), మూడు-పాయింట్ ELR సీట్‌ బెల్ట్‌లు, ESP విత్ హిల్ హోల్డ్ అసిస్ట్ & రోల్‌ఓవర్ మిటిగేషన్, ABS తో సహా అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.  EBD,  ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లను కలిగి ఉంటుంది.

మారుతీ సుజుకి ఫ్రాంక్స్ వేటితో పోటీ పడుతుందంటే?

మారుతి సుజుకి ఫ్రాంక్స్ దేశీయ మార్కెట్లో  టాటా పంచ్, సిట్రోయెన్ C3, బాలెనో వంటి వాటితో పోటీపడుతుంది. రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్‌లకు కూడా పోటీగా ఉంటుంది.

Read Also: ఈ వేసవిలో మీ కార్లను ఇలా కాపాడుకోండి!

Published at : 25 Apr 2023 03:06 PM (IST) Tags: Maruti Suzuki Maruti Suzuki Fronx Maruti Suzuki Price Maruti Suzuki variants Maruti Suzuki features

సంబంధిత కథనాలు

Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?

Tata Punch vs Hyundai Exter: రూ. 10 లక్షల్లోపు మంచి బడ్జెట్ కార్లు - ఏది బెస్టో తెలుసా?

మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!

మారుతి To టయోటా- రూ. 10 లక్షల్లోపు రాబోతున్న 5 బెస్ట్ కార్లు ఇవే!

బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నారా? అయితే, తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Tesla Entry in India: త్వరలో భారతదేశానికి రానున్న టెస్లా - 2023 చివరిలోపు!

Tesla Entry in India: త్వరలో భారతదేశానికి రానున్న టెస్లా - 2023 చివరిలోపు!

Ajith Kumar: తోటి బైకర్‌కు అజిత్ సర్‌ప్రైజ్ - రూ.12.5 లక్షల విలువైన బైక్‌ గిఫ్ట్!

Ajith Kumar: తోటి బైకర్‌కు అజిత్ సర్‌ప్రైజ్ - రూ.12.5 లక్షల విలువైన బైక్‌ గిఫ్ట్!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా