అన్వేషించండి

Maruti Suzuki First EV: రోడ్లపై కనిపించిన మారుతి మొదటి ఎలక్ట్రిక్ కారు - లాంచ్ ఎప్పుడంటే?

Maruti First Electric Car: భారతదేశపు నంబర్ వన్ కార్ల బ్రాండ్ మారుతి తన మొదటి ఎలక్ట్రిక్ కారును త్వరలో లాంచ్ చేయనుంది.

Maruti Suzuki eVX Electric SUV: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ త్వరలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ విభాగంలోకి ప్రవేశించబోతోంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోడల్ ఈవీఎక్స్‌ని ఆటో ఎక్స్‌పో 2023లో పరిచయం చేసింది. అప్పటి నుండి ప్రజలు మార్కెట్లోకి దాని రాక కోసం ఎదురు చూస్తున్నారు. 2025లో ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇటీవల ఈవీఎక్స్ కారును కంపెనీ భారతీయ రోడ్లపై పరీక్షిస్తుంది.

దీని ఫొటోలు ఈవీఎక్స్ డిజైన్, ఫీచర్ల గురించి ప్రత్యేక వివరాలను రివీల్ చేస్తున్నాయని కొన్ని కథనాల్లో పేర్కొన్నారు. దీని కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మంచి రోజులు వచ్చాయని అనుకోవచ్చు. ఫ్రంట్ లెఫ్ట్ ఫెండర్‌లో ఛార్జింగ్ పోర్టును చూడవచ్చు. ఇది దాని ప్రాక్టికాలిటీని చూపిస్తోంది. దీని సెక్యూరిటీ ఫీచర్లు కూడా అద్బుతంగా ఉండనున్నాయని సమాచారం. ముందు వైపు ఛార్జర్ పోర్టును అందించడం తాకిడి ప్రభావాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది.

రియర్‌వ్యూ మిర్రర్‌లపై అమర్చిన కెమెరాలు 360 డిగ్రీ కెమెరా సిస్టమ్‌ను సూచిస్తాయి. ఇది డ్రైవర్‌లకు మెరుగైన భద్రతను అందిస్తుంది. ప్రొడక్షన్ స్పెక్ మోడల్ స్మూత్ ఫ్రంట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను కలిగి ఉంది. అయితే ఎలక్ట్రిక్ మోడల్ కావడంతో నార్మల్ మోడల్స్‌లో కనిపించే గ్రిల్ ఇందులో కనిపించదు. ఇందులో ఏర్పాటు చేసిన ఎయిర్ డ్యామ్ విద్యుత్ భాగాలను చల్లబరుస్తుంది.

స్టైలిష్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, వినూత్నమైన సి పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ సైడ్ ప్రొఫైల్‌లో కనిపిస్తాయి. ఇది దాని రూపాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా షార్క్ ఫిన్ యాంటెన్నా, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ స్పాయిలర్, లైట్ బార్ వంటి అదనపు ఫీచర్లు ఈవీఎక్స్ ఆకర్షణను మరింత మెరుగుపరుస్తాయి.

ఇంటీరియర్, ఫీచర్లు ఇలా...
ఇంటీరియర్‌లో వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటుతో ఆటో డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్‌వ్యూ మిర్రర్ వంటి అనేక అధునాతన ఫీచర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఇది కాకుండా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే రెండింటికి సపోర్ట్ చేసే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సీమ్‌లెస్ కనెక్టివిటీ, అనేక ఎంటర్‌టైన్‌మెంట్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.

550 కిలోమీటర్ల రేంజ్
పవర్ కోసం ఇందులో 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని అందించే అవకాశం ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 550 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. మారుతి సుజుకి ఈవీఎక్స్ భారతదేశంలోకి వచ్చే సమయం దగ్గరపడుతున్నందున కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో తన కమిట్‌మెంట్‌ను మరింత బలంగా చూపిస్తుంది.

మరోవైపు జీప్ ఇండియా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని మన దేశంలో లాంచ్ చేయడంపై వర్క్ చేస్తుంది. జీప్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న మిడ్ సైజ్ ఎస్‌యూవీ కంపాస్ కంటే ఇది కాస్త తక్కువ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. జీప్ లాంచ్ చేయనున్న ఈ కొత్త ఎస్‌యూవీ... హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి ఇతర కార్లతో పోటీపడనుంది. జీప్ ప్రస్తుతం రూపొందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీని సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ను రూపొందించిన స్టెల్లాంటిస్ సీఎం ప్లాట్‌ఫారమ్‌పైనే రూపొందించనున్నారు.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌పై అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో పాటు BaaS ఆఫర్ - నిజంగా మంచి ఆఫర్‌!
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ కొనేవాళ్లకు బంపర్‌ ఆఫర్‌.. అస్యూర్డ్ బైబ్యాక్ స్కీమ్‌తో రీసేల్‌ చాలా ఈజీ!
2026 మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌ - పానోరమిక్ సన్‌రూఫ్‌, భారీ టచ్‌స్క్రీన్‌, 540 డిగ్రీ కెమెరా, కొత్త ఫీచర్లతో లాంచ్‌
రూ.13.69 లక్షలకే కొత్త మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌.. పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త ఎక్స్‌పీరియన్స్‌
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
డ్రైవర్‌ సహా వాహనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ బీమా - సుప్రీంకోర్టు సంచలన తీర్పు, కొత్త నిబంధనలు!
కొత్త కార్లకు 4 ఏళ్లు, బైక్‌లకు 6 ఏళ్లు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి? సుప్రీంకోర్టు సూచన

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget