అన్వేషించండి

Alto Vs Celerio Vs WagonR: ఆల్టో, సెలెరియో, వ్యాగన్ఆర్ - మూడు కార్లలో ఏది బెస్ట్?

Maruti Suzuki Mileage: మారుతి సుజుకి మనదేశంలో విక్రయిస్తున్న చవకైన కార్లలో ఆల్టో, సెలెరియో, వ్యాగన్ ఆర్ ముందంజలో ఉంటారు. వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్?

Maruti Suzuki Affordable Cars Mileage: తక్కువ ధర కార్ల విషయానికి వస్తే మారుతి సుజుకి కార్ల పేరు అగ్రస్థానంలో ఉంటుంది. కంపెనీ కార్లు చవకైన ధరతో పాటు మంచి మైలేజీని కూడా ఇవ్వడం వల్ల చాలా మంది ఇష్టపడతారు. మీరు చాలా కాలంగా తక్కువ ధరలో మారుతి కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఏ కార్లు మంచి మైలేజీని ఇస్తాయో అనే అయోమయంలో ఉంటే ఇక్కడ మీకు మూడు బెస్ట్ ఆప్షన్‌ల గురించి తెలుసుకుందాం.

మారుతి ఆల్టో కే10 (Maruti Alto K10)
భారత మార్కెట్లో ఏదైనా కారు చవక అని అంటే అది మారుతి ఆల్టో కే10. ఆల్టో ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.99 లక్షల నుంచి మొదలై రూ. 5.96 లక్షల వరకు ఉంది. మైలేజీ గురించి చెప్పాలంటే ఆల్టో కే10 పెట్రోల్ వేరియంట్ లీటరుకు 24.39 నుంచి 24.90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ కిలోగ్రాముకు 33.40 నుంచి 33.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

కంపెనీ మారుతి సుజుకి ఆల్టో కే10లో 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బీహెచ్‌పీ పవర్‌తో 89 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పాటు ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయి ఉంటుంది. ఈ కారులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
ఈ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 67 పీఎస్ పవర్, 89 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుంది. దాని సీఎన్‌జీ వెర్షన్‌లో ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే వస్తుంది. 56.7 పీఎస్ పవర్, 82 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 60 లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ అందుబాటులో ఉంది.

మారుతి సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 26 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అయితే సీఎన్‌జీ వేరియంట్ కిలోగ్రాముకు 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఏసీ వెంట్స్, మ్యూజిక్ కంట్రోల్‌తో కూడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
కంపెనీ మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌లో 998 సీసీ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 55.92 బీహెచ్‌పీ పవర్‌తో 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారులో మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంటుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ కారు దాదాపు 23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.54 లక్షల నుంచి మొదలై రూ. 7.33 లక్షల వరకు ఉంటుంది. అలాగే మార్కెట్‌లో, ఈ కారు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, టాటా టియాగో, రెనో క్విడ్ వంటి వాహనాలకు ప్రత్యక్ష పోటీని ఇస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

మీ కారు పక్కనున్న వాహనాలతో మాట్లాడుతుంది.. V2V టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్!
మీరు బ్రేక్ వేయకముందే మీ కారు అలర్ట్.. భారత్‌లోకి వస్తున్న V2V సేఫ్టీ సిస్టమ్ ఇదే!
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్‌పై Toyota Innova Hycross కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget