Maruti Suzuki Discount: మారుతి బడ్జెట్ కార్లపై తగ్గింపు - ఎంత తగ్గిందో తెలుసా?
Maruti Suzuki: మారుతి సుజుకి తన బడ్జెట్ కార్ల ధరలను కాస్త మేర తగ్గించింది. మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్ ప్రెస్సోల ధరలను కంపెనీ కాస్త వరకు తగ్గించింది. ఎంత తగ్గాయో తెలుసా?
Maruti Suzuki Cars Discount: కార్ల తయారీదారు మారుతి సుజుకి తన కార్ల ధరలను పెంచడం ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ తన రెండు కార్లు ఆల్టో కే10, ఎస్ ప్రెస్సోలకు సంబంధించి కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించింది. తక్కువ ధరలో మంచి కారు కోసం వెతుకుతున్న వారికి ఈ కారు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. ఈ కార్ల ఎక్స్ షోరూమ్ ధరలు ఏంటి? కార్ల ధరలు ఎంత తగ్గించారు? అనే విషయాలను తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఆల్టో కే10, ఎస్ ప్రెస్సో ధరల తగ్గింపు గురించి చెప్పాలంటే ఎస్ ప్రెస్సో ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 2,000 తగ్గింది. ఆల్టో కే10 వీఎక్స్‌ఐ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 6,500 తగ్గింది.
ఇప్పుడు కస్టమర్లు ఆల్టో కే10ని రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల మధ్య కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. అంతే కాకుండా ఢిల్లీలో ఎస్ ప్రెస్సో ఎక్స్ షోరూమ్ ధర ఇప్పుడు రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.11 లక్షల మధ్య ఉంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
మంచి మైలేజీని అందించనున్న కార్లు
మారుతి సుజుకి ఆల్టో కే10లో 1.0 లీటర్ 3 సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 66 బీహెచ్‌పీ పవర్ అందించే 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారులో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం కారు పెట్రోల్ వేరియంట్ లీటరుకు దాదాపు 25 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ కారు సీఎన్‌జీ వేరియంట్ 33 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు.
మారుతి ఎస్ ప్రెస్సో మాన్యువల్ వేరియంట్‌లు లీటరుకు 24.76 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 25.30 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఇది ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్. అంటే మైలేజ్ పరంగా ఇది అద్భుతమైన కారు అని చెప్పవచ్చు. ఎస్ ప్రెస్సో పొడవు 3,565 మిల్లీమీటర్లు కాగా, ఎత్తు 1,567 మిల్లీమీటర్లు గానూ, వెడల్పు 1520 మిల్లీమీటర్లు గానూ ఉంది.
Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!