New Hybrid SUVs: 35 కిలోమీటర్ల మైలేజ్, సన్‌రూఫ్, 6 ఎయిర్ బ్యాగ్‌లతో వస్తున్న Hybrid SUVs; ఫీచర్లు, ధర తెలుసుకోండి
New Hybrid SUVs: భారత్‌లో 2025-26లో కొత్త హైబ్రిడ్ SUVలు రానున్నాయి. Fronx, Seltos, Grand Vitara 7-సీటర్ 35 kmpl మైలేజ్, ADAS, సన్రూఫ్ ఫీచర్స్ తో వస్తాయి.

Upcoming Hybrid SUVs: భారతదేశంలో పెరుగుతున్న కాలుష్యం, పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు ప్రజలను Hybrid SUVs వైపు మళ్లించాయి. ఈ SUVs తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి, మంచి మైలేజీని అందిస్తాయి. పర్యావరణానికి కూడా సురక్షితమైనవి. 2025-26లో భారతదేశంలో మూడు పెద్ద హైబ్రిడ్ SUVలు-Maruti Suzuki Fronx Hybrid, Kia Seltos Hybrid, Maruti Grand Vitara 7-Seater Hybrid విడుదల కానున్నాయి. ఈ మోడల్స్ అన్నీ మెరుగైన మైలేజ్, అధునాతన ఫీచర్లతో వస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Maruti Fronx Hybrid
మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ ఈ జాబితాలో అత్యంత చవకైన SUV అవుతుంది, దీని ప్రారంభ ధర సుమారు 8.5 లక్షల రూపాయలు ఉండవచ్చు. కంపెనీ దీనిని తన మొదటి ఇన్-హౌస్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్ HEVతో అందిస్తుంది. ఇందులో 1.2-లీటర్ 3-సిలిండర్ Z12E ఇంజిన్ ఉంటుంది, ఇది ఎలక్ట్రిక్ మోటార్, 1.5-2 kWh బ్యాటరీతో కలిసి దాదాపు 80-90 bhp పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్, దీనిలో పెట్రోల్ ఇంజిన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. మోటార్ చక్రాలను నడుపుతుంది. ఇది దాదాపు 35 kmpl మైలేజీనిస్తుంది. ఇందులో కొత్త గ్రిల్, LED లైట్లు, 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ కార్‌ప్లే, డిజిటల్ క్లస్టర్, లెవెల్-1 ADAS ఉంటాయి.
Kia Seltos Hybrid
కియా సెల్టోస్ హైబ్రిడ్ మోడల్ 2026లో వస్తుంది. ఇది భారతదేశంలో కియా మొదటి హైబ్రిడ్ అవుతుంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేస్తారు, ఇది 140 bhp పవర్‌ని, 250 Nm టార్క్‌ను అందిస్తుంది. e-CVT గేర్‌బాక్స్‌తో, ఈ SUV 25-28 kmpl మైలేజీనిస్తుంది. ఇందులో 10.25-అంగుళాల డ్యూయల్ స్క్రీన్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు ఉంటాయి. ధర సుమారు 15 లక్షల రూపాయల నుంచి ప్రారంభం కావచ్చు.
Maruti Grand Vitara 7-Seater
మారుతి గ్రాండ్ విటారా 7-సీటర్ హైబ్రిడ్ మోడల్ 2026లో విడుదల కానుంది. ఇది 1.5-లీటర్ K15C ఇంజిన్, 79 bhp ఎలక్ట్రిక్ మోటార్‌తో మొత్తం 115 bhp పవర్‌ని అందిస్తుంది. ఇది 25 kmpl కంటే ఎక్కువ మైలేజీనిస్తుందని భావిస్తున్నారు. పెద్ద కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని, ఇందులో పొడవైన వీల్‌బేస్, మూడో-వరుస సీటు, 9-అంగుళాల స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, ADAS వంటి ఫీచర్లు ఉంటాయి. ప్రారంభ ధర సుమారు 18.5 లక్షల రూపాయలు ఉండవచ్చు.




















