అన్వేషించండి

నెలకు రూ.12,000 EMIతోనూ మారుతి బ్రెజ్జా మీ ఇంటికొస్తుంది, లోన్‌ ఎంత తీసుకోవాలంటే?

తెలుగు రాష్ట్రాల్లో మారుతి బ్రెజా తాజా ఆన్‌రోడ్‌ ధర, ఫీచర్లు, రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్‌పై 5, 6, 7 ఏళ్ల EMI & బ్యాంక్‌ వడ్డీ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Maruti Brezza Price, Down Payment, Loan and EMI Details: తెలుగు రాష్ట్రాల్లో, కాంపాక్ట్‌ SUVలను ఇష్టపడేవాళ్ల లిస్ట్‌లో మారుతి సుజుకి బ్రెజా తప్పకుండా ఉంటుంది. స్టైలిష్‌ లుక్స్‌, ప్రీమియం ఫీచర్లు & నమ్మకమైన మైలేజ్‌ కాంబినేషన్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఈ కారును హైదరాబాద్‌లో కొనాలంటే ఎంత ఖర్చవుతుంది, లోన్‌పై తీసుకుంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, ఎంత EMI కట్టాలి వంటి వివరాలను ఇక్కడ క్లియర్‌గా తెలుసుకుందాం.

మారుతి బ్రెజా ఇంజిన్‌ & టాప్‌ ఫీచర్లు

మారుతి బ్రెజాలో 1.5 లీటర్ల K15C స్మార్ట్‌ హైబ్రిడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 101.65 bhp పవర్‌ & 136.8 Nm టార్క్‌ను అందిస్తుంది. ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, 360 డిగ్రీ కెమెరా, హెడ్‌ అప్‌ డిస్‌ప్లే, 9 ఇంచీల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ & 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇది లీటరుకు సుమారు 19.8 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుంది.

హైదరాబాద్‌లో తాజా ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధరలు

హైదరాబాద్‌ మార్కెట్‌లో, మారుతి బ్రెజా బేస్‌ వేరియంట్‌ Lxi Petrol 1.0L Turbo Manual ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ. 7,39,900. RTO ఛార్జీలు & ఇన్సూరెన్స్‌ కలిపితే ఆన్‌రోడ్‌ ధర సుమారు రూ.8.84 లక్షలకు చేరుకుంటుంది. టాప్‌ వేరియంట్‌ ఆన్‌రోడ్‌ ధర సుమారు రూ. 17.05 లక్షల వరకు ఉంటుంది.

విజయవాడలో తాజా ఎక్స్‌-షోరూమ్‌ & ఆన్‌రోడ్‌ ధరలు

విజయవాడ మార్కెట్‌ కూడా మారుతి బ్రెజా బేస్‌ వేరియంట్‌ Lxi Petrol 1.0L Turbo Manual ఎక్స్‌-షోరూమ్‌ ధర సుమారు రూ. 7,39,900. RTO ఛార్జీలు & ఇన్సూరెన్స్‌ కలిపితే ఆన్‌రోడ్‌ ధర సుమారు రూ.8.83 లక్షలు అవుతుంది. టాప్‌ వేరియంట్‌ ఆన్‌రోడ్‌ ధర సుమారు రూ. 16.90 లక్షల వరకు ఉంటుంది.

విజయవాడలో కనీస డౌన్‌పేమెంట్‌ వివరాలు

విజయవాడలోని ప్రధాన డీలర్లు & ఫైనాన్స్‌ కంపెనీలు రూ. 1,50,000 కనీస డౌన్‌పేమెంట్‌తో ఈ కారును అందిస్తున్నాయి. మీ సిబిల్ స్కోర్‌ 750 కంటే బాగుంటే 90% వరకు రుణం పొందే వెసులుబాటు ఉంది.

బ్యాంక్‌ వడ్డీ రేట్లు

వివిధ బ్యాంకులు & ఫైనాన్స్‌ కంపెనీలు మారుతి బ్రెజా కార్ లోన్లపై వార్షికంగా 8.75% నుంచి 14% వరకు వడ్డీని వసూలు చేస్తున్నాయి. సగటున 10% వార్షిక వడ్డీ రేటును ప్రామాణికంగా తీసుకుని EMI లెక్కిద్దాం.

10% వార్షిక వడ్డీ రేటుతో 5, 6, 7 ఏళ్ల EMI వివరాలు

బేస్‌ వేరియంట్‌ ఆన్‌రోడ్‌ ధర రూ.8.83 లక్షలు అనుకుంటే, రూ. 1,50,000 డౌన్‌పేమెంట్‌ చెల్లించగా మిగిలిన రూ. 7.33 లక్షలను లోన్‌గా తీసుకోవాలి. ఈ మొత్తానికి 10% వార్షిక వడ్డీ రేటుతో EMI లెక్కింపు:

ఐదు ఏళ్ల ప్లాన్‌: రూ. 15,578 EMI.

ఆరు ఏళ్ల ప్లాన్‌: రూ. 13,583 EMI.

ఏడు ఏళ్ల ప్లాన్‌: రూ. 12,172 EMI.

ఇది కూడా చదవండి: మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?

ఒకవేళ మీరు రూ. 2 లక్షలు డౌన్‌పేమెంట్‌ చెల్లిస్తే, మిగిలిన రూ. 7.33 లక్షలను లోన్‌గా తీసుకోవాలి. ఈ మొత్తానికి 10% వార్షిక వడ్డీ రేటుతో EMI లెక్కింపు:

ఐదు ఏళ్ల ప్లాన్‌: రూ. 14,516 EMI.

ఆరు ఏళ్ల ప్లాన్‌: రూ. 12,656 EMI.

ఏడు ఏళ్ల ప్లాన్‌: రూ. 11,341 EMI.

బ్యాంక్‌ విధానాలు, మీ సిబిల్‌ స్కోర్‌ను బట్టి మీ వడ్డీ రేటు మారుతుంది. ఫైనాన్స్‌లో కార్‌ తీసుకునే ముందు ప్రాసెసింగ్‌ ఫీజులు & ఆన్‌రోడ్‌ ఛార్జీలపై డీలర్‌ డిస్కౌంట్లు ఉన్నాయేమో సరి చూసుకోండి. తక్కువ EMI కోసం ఏడేళ్ల సుదీర్ఘ కాల పరిమితి ఎంచుకుంటే వడ్డీ భారం పెరుగుతుందని గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి: సెకండ్‌హ్యాండ్ Maruti Brezza కొంటున్నారా? ఈ సమస్యలు ఉన్నాయేమో ముందే చెక్ చేయండి

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kawasaki Z650 కంటే రూ.33,000 అదనపు ధరకు Kawasaki Z650 Sలో ఏం ఉంది? రెండు మోడళ్ల కంపారిజన్‌
Kawasaki Z650 vs Z650 S: ధరలో తేడా ఎంత? కొత్త మోడల్‌లో వచ్చిన మార్పులేంటి?
Force e-Traveller: ఫోర్స్‌ మోటార్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ ట్రావెలర్స్‌, అంబులెన్స్‌.. తుది పరీక్షల్లో EVలు
Force Motors ట్రావెలర్‌ EVలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి.. ఎలక్ట్రిక్ అంబులెన్స్ కూడా!
ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ ఎలక్ట్రిక్ SUVలు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 478km వరకు ప్రయాణం!
లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లేవాళ్ల కోసమే ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్‌ కార్లు.. కనీసం 400km రేంజ్‌ గ్యారెంటీ!
BMW F 450 GS లో Base నుంచి GS Trophy వరకు నాలుగు వేరియంట్లు.. ఏ వేరియంట్‌ బెటర్‌?
BMW అడ్వెంచర్ బైక్ F 450 GSలో 4 వేరియంట్లు.. ఏ మోడల్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag CII Partnership Summit: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముస్తాబైన విశాఖ.. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా ప్రభుత్వ ఏర్పాట్లు
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
AP Ration Items: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాయితీపై నిత్యావసర సరుకులు పంపిణీ
Bharat Summit 2026: ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
ప్రపంచ రాజకీయాలకు వేదికగా హైదరాబాద్ ! దావోస్ తరహాలో భాగ్యనగరం అభివృద్ధి: భట్టి విక్రమార్క
Kulgam Terrorist Attack: కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
కుల్గాం CRPF క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లకు గాయాలు- ఆ ఏరియాను జల్లెడ పడుతున్న బలగాలు
Pushpaka Vimanam Series OTT : ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hardik - Arshdeep Deal: 18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
18 కోట్ల భారీ డీల్‌తో పంజాబ్ కి చేరిన హార్దిక్.. ముంబై గూటికి అర్ష్‌దీప్ సింగ్.. మెగా ట్రేడ్‌ను అధికారికంగా ఖరారు చేసిన MI
Rohit Sharma Captaincy: రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
రోహిత్  చేతికే మళ్లీ  MI పగ్గాలు దక్కనున్నాయా..! హార్దిక్ నిష్క్రమణతో కెప్టెన్ ఎంపికపై ఫ్రాంచైజీ వ్యూహాత్మక మౌనం
Embed widget