అన్వేషించండి

Mahindra XUV700: పండగ సీజన్ లో మహీంద్రా షాకింగ్ న్యూస్.. XUV700 SUV ధరలు భారీగా పెంపు!

మహీంద్రా కంపెనీ ఫెస్టివల్ సీజన్ వేళ సంచలన నిర్ణయం తీసుకుంది. XUV700 SUVతో పాటు థార్ SUV ధరలను అమాంతం పెంచేసింది. ఎక్స్‌యూవీ 700 ధరలు వేరియంట్ ను బట్టి రూ. 20,072 నుంచి రూ. 36,814 వరకు పెరిగాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ  పండుగ సీజన్లో XUV700,  థార్ కొనుగోలుదారులకు  షాకింగ్ న్యూస్ చెప్పింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700, థార్ SUV ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.  మహీంద్రా కంపెనీ ఇటీవలే తన XUV 700కు సంబంధించి ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల ధరలను రూ. 6,000 వరకు తగ్గించింది. ఈ తగ్గుదలను ప్రకటించిన వారంలోపే  ధరలను భారీగా పెంచడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ధరల పెరుగుదలకు గల కారణాన్ని కూడా కంపెనీ బయటకు చెప్పకపోవడం విశేషం. మహీంద్రా కంపెనీ  2022 లో ఈ రెండు మోడల్స్ ధరలను పెంచడం ఇదే తొలిసారి.

మహీంద్రా XUV700 ధర ఎంత పెరిగిందంటే?

మహీంద్రా XUV700 ధర పెరుగుదల విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 22,000 నుంచి రూ. 35,000కి పెరిగింది. వీటి ధరలు ఇప్పుడు రూ. 13.45 లక్షల నుంచి రూ. 23.10 లక్షల వరకు చేరాయి.  ఇక XUV700 డీజిల్ వేరియంట్ ధరల విషయానికి వస్తే..  ఇవి కూడా రూ. 20,000 నుంచి రూ. 37,000 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో  XUV700 డీజిల్ ధరలు ఇప్పుడు రూ. 13.96 లక్షల నుంచి రూ. 24.95 లక్షల వరకు చేరాయి.

మహీంద్రా XUV700 అనేది మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి MX, AX3, AX5తో పాటు AX7. ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్, ఎక్యుప్ మెంట్స్ తో చాలా ఆధునికంగా ఉన్నాయి. XUV700 రెండు ఇంజిన్ ఆప్సన్స్ ను సైతం కలిగి ఉన్నాయి. 2.0 లీటర్ పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లతో వస్తున్నాయి.  2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 153 బిహెచ్‌పి పవర్‌ను, 360 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక 2. లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ను పరిశీలిస్తే.. 188 బిహెచ్‌పి పవర్ ను కలిగి ఉండి 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.  6 స్పీడ్ మాన్యువల్,  6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

మహీంద్రా థార్ ధరలు పెంపు

అటు మహీంద్రా థార్ ధరలకు కూడా పెరిగాయి. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 6,000 నుంచి రూ. 7,000 వరకు పెరిగాయి.  ఇప్పుడు మహీంద్రా థార్ పెట్రోల్ ధరలు రూ. 13.59 లక్షల నుంచి రూ. 15.82 లక్షల వరకు చేరాయి. థార్ డీజిల్ వేరియంట్  ధరలు మరింత ఎక్కువగా పెరిగాయి.  ఒక్కో యూనిట్ మీద రూ. 26,000 నుంచి రూ. 28,000 వరకు పెరిగాయి.   థార్ డీజిల్ ధరలు రూ. 14.16 లక్షల నుంచి రూ. 16.29 లక్షల వరకు కొనసాగుతున్నాయి.   

ధరల పెంపు కాసేపు పక్కన పెడితే.. మహీంద్రా కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో కొత్త XUV400 ఎలక్ట్రిక్ SUVని ప్రదర్శించింది. ఈ  EV వచ్చే ఏడాది జనవరిలో భారత మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనం టాటా నెక్సాన్ EV లాంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget